జవాబు: మహోన్నతుడైన అల్లాహ్ పై విశ్వాసం:
మిమ్మల్ని సృష్టించిన, మిమ్మల్ని పోషిస్తున్న, ఇంకా సకల సృష్టిరాశుల యజమాని మరియు నిర్వాహకుడు అయిన అల్లాహ్ ను మాత్రమే విశ్వసించుట.
మరియు ఆయనే ఆరాధ్యుడు. నిజానికి, ఆయన తప్ప మరెవ్వరూ ఆరాధ్యులు లేరు. సృష్టించటం, ఆదేశము, తీర్పు ధర్మశాసనాలు చేయటం ఆయన ఒక్కడిగే చెందును. ఆయనకు ఎవరు సాటి లేరు.
మరియు ఆయన సర్వశక్తిమంతుడు, గొప్పవాడు, సంపూర్ణుడు, సకల ప్రశంసలు ఆయనకే శోభిస్తాయి, అత్యంత సుందరమైన దివ్యనామాలు మరియు దివ్యమైన సుగుణాలు ఆయనకే చెందుతాయి. ఆయనకు సాటి ఎవ్వరూ లేరు. ఆయనను పోలిన వారెవ్వరూ లేరు. ఆయనలో ఎలాంటి లోపాలూ, కొరతలూ లేవు.
దైవదూతల పై విశ్వాసం:
కేవలం తనను మాత్రమే ఆరాధించడానికి మరియు తన ఆజ్ఞలను మాత్రమే పూర్తిగా అనుసరించేందుకు, అల్లాహ్ కాంతి నుండి సృష్టించిన గొప్ప సృష్టిరాశులే దైవదూతలు.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
{వారు కేవలం గౌరవనీయులైన (ఆయన) దాసులు మాత్రమే!"
వారు ఆయన (అనుమతించక) ముందు మాట్లాడలేరు. మరియు వారు (దైవదూతలు) ఆయన ఆజ్ఞలనే పాటిస్తూ ఉంటారు.}
[అల్ అంబియా :26,27]
ఆయన అలైహిస్సలాతు వస్సలాం ఇలా పలికారు:
దైవదూతలు జ్యోతి( నూర్) నుండి సృష్టించబడ్డారు.
దీనిని ముస్లిం ఉల్లేఖించారు.
వారిలో జిబ్రయీల్ అలైహిస్సలామ్ ఒకరు. ఆయన ప్రవక్తలకు, సందేశహరులకు ప్రత్యక్షంగా దైవసందేశాన్ని అందిస్తారు.
{మరియు నిశ్చయంగా, ఇది సర్వలోకాల ప్రభువు అవతరింపజేసిన (గ్రంథం).
దీనిని నమ్మదగిన ఆత్మ (రూహుల్ అమీన్) అవతరింపజేశాడు;
నీ హృదయం మీద, నీవు హెచ్చరిక చేసేవారిలో చేరిపోవాలని;
స్పష్టమైన అరబీ భాషలో!}
[షుఅరా:192-195]
దైవగ్రంధాల పై విశ్వాసం:
ఉదాహరణకు అల్లాహ్ తన సందేశహరులపై అవతరింప జేసిన గ్రంధాలు.
దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపజేసిన ఖుర్ఆన్ లా.
ఇంజీలు గ్రంధం ప్రవక్త ఈసా అలైహిస్సలాం పై అవతరింప జేయబడింది.
తౌరాతు గ్రంధం ప్రవక్త మూసా అలైహిస్సలాం పై అవతరింప జేయబడింది.
జబూర్ గ్రంధం ప్రవక్త దావూద్ అలైహిస్సలాం పై అవతరింప జేయబడింది.
- సహీఫ ఇబ్రాహీమ్ మరియు మూసా (అలైహిమ స్సలాం): ప్రవక్త ఇబ్రాహీమ్ మరియు మూసా అలైహిమస్సలాంల పై అవతరింప జేయబడినాయి.
దైవసందేశహరుల పై విశ్వాసం:
మరియు తన దాసులకు (ధర్మం) బోధించడానికి, మంచితనం మరియు స్వర్గానికి సంబంధించిన శుభవార్తలను అందించడానికి, ఇంకా చెడు మరియు నరకం నుండి వారిని హెచ్చరించడానికి అల్లాహ్ తన సందేశహరులను ఉద్భవింపజేసాడు.
మరియు వారిలో ఉత్తములు మరియు దృఢసంకల్పం గల కొందరు సందేశహరులు:
నూహ్ అలైహిస్సలాం.
ఇబ్రాహీమ్ అలైహిస్సలాం.
మూసా అలైహిస్సలాం.
ఈసా అలైహిస్సలాం.
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం
ప్రళయదినం పై విశ్వాసం:
ప్రళయదినంపై విశ్వాసం అంటే సమాధిలోని మరణానంతరం జీవితంపై విశ్వాసం ఉదాహరణకు ప్రళయదినం, పునరుత్థాన దినం, అంతిమ తీర్పుదినం, చివరికి శాశ్వతంగా స్వర్గవాసులు స్వర్గంలోని తమ స్థానాల్లో మరియ నరకవాసులు నరకంలోని తమ స్థానాల్లో చేరటంపై విశ్వాసం.
{ప్రతి పాణి చావును చవి చూస్తుంది. మరియు నిశ్చయంగా, తీర్పుదినమున మీ కర్మల ఫలితం మీకు పూర్తిగా ఇవ్వబడుతుంది. కావున ఎవడు నరకాగ్ని నుండి తప్పించబడి స్వర్గంలో ప్రవేశపెట్టబడతాడో! వాస్తవానికి వాడే సఫలీకృతుడు. మరియు ఇహలోక జీవితం కేవలం మోసపుచ్చే సుఖానుభవం మాత్రమే!}
[ఆలి ఇమ్రాన్ : 185]
- అల్ ఖద్ర్ ఖైరిహి,వషర్రిహి ( మంచి,చెడు విధివ్రాత)పై విశ్వాసం:
అల్ ఖద్ర్: విశ్వంలో జరిగే ప్రతిదీ అల్లాహ్ కు తెలుసు అనీ, ఆయన ఆ జ్ఞానాన్ని దానిని అత్యంత సురక్షితంగా భద్రపరచబడిన ‘అల్ కితాబ్’ అనే దివ్యగ్రంధంలో లిఖించి ఉంచాడని, దాని ఉనికి ఆయన ఇష్టానుసారమే ఉందని మరియు దానిని ఆయనే సృష్టించాడని విశ్వసించుట.
{నిశ్చయంగా, మేము ప్రతి దానిని ఒక విధివ్రాత (ఖద్ర్) తో సృష్టించాము.}
[అల్ ఖమర్: 49]
అది నాలుగు స్థాయిలలో జరిగింది:
మొదటిది: మహోన్నతుడైన అల్లాహ్ యొక్క మహాద్భుత జ్ఞానము. ప్రతిదీ సంభవించక ముందు మరియు సంభవించిన తర్వాత విషయాల గురించి తన అపూర్వ జ్ఞానం వలన ఆయన ముందే ఎరుగును.
దీనికి సాక్ష్యం: మహోన్నతుడైన అల్లాహ్ వాక్కు:
{నిశ్చయంగా, ఆ (అంతిమ) ఘడియ జ్ఞానం, కేవలం అల్లాహ్ కు మాత్రమే ఉంది. మరియు ఆయనే వర్షం కురిపించేవాడు మరియు గర్భాలలో ఉన్నదాని విషయం తెలిసినవాడు. మరియు తాను రేపు ఏమి సంపాదిస్తాడో, ఏ మానవుడు కూడా ఎరుగడు. మరియు ఏ మానవుడు కూడా తాను ఏ భూభాగంలో మరణిస్తాడో కూడా ఎరుగడు. నిశ్చయంగా, అల్లాహ్ మాత్రమే సర్వజ్ఞుడు, సమస్తం తెలిసినవాడు (ఎరిగినవాడు).}
[లుఖ్మాన్ : 34]
రెండవది: దీనిని అల్లాహ్ సురక్షితంగా భద్రపరచబడిన ‘అల్ కితాబ్’ అనే మహాద్భుత గ్రంధంలో లిఖించాడు. కాబట్టి జరిగినదీ మరియు జరగబోయేదీ ప్రతిదీ ఆయన అందులో నమోదు చేసి ఉంచాడు.
{మరియు అగోచర విషయాల తాళపు చెవులు ఆయన (అల్లాహ్) వద్దనే ఉన్నాయి. వాటిని, ఆయన తప్ప మరెవ్వరూ ఎరుగరు. మరియు భూమిలోనూ, సముద్రంలోనూ ఉన్నదంతా ఆయనకు తెలుసు. మరియు ఆయనకు తెలియకుండా ఏ చెట్టు ఆకు కూడా రాలదు. మరియు భూమిలోని చీకటి పొరలలో ఉన్న ప్రతి గింజ, అది పచ్చిది కానీ ఎండినది కానీ అంతా స్పష్టంగా ఒక గ్రంధంలో (వ్రాయబడి) ఉంది.}
[అల్ అన్ఆమ్: 18]
మూడవది: ప్రతిదీ అల్లాహ్ యొక్క చిత్తం ద్వారా మాత్రమే జరుగుతుంది మరియు ఆయన సృష్టిలోనిదేదీ ఆయన ఇష్టానుసారంగా కాకుండా జరగదు.
మరియు దాసునికి ఎంపిక ఉంటుంది, నిర్ణయం ఉంటుంది, మరియు అతనికి ఇష్ట ప్రకారం ఉంటుంది. అయితే, ఈ ఆలోచన మరియు ఈ ఇష్టప్రకారం అల్లాహ్ సుబ్హానహూ తఆలా యొక్క ఇష్టానికి తరువాత మాత్రమే జరుగుతాయి.
{మీలో, ఋజుమార్గంలో నడవ దలచుకున్న ప్రతివాని కొరకు.28
మరియు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ తలచనంత వరకు, మీరు తలచినంత మాత్రాన ఏమీ కాదు.29}
[అత్తక్వీర్ : 28-29]
నాల్గవది: మొత్తం సృష్టిలోని జీవరాశులన్నీ అల్లాహ్ చే సృష్టించబడిన జీవరాశులు అని విశ్వసించుట. ఆయనే వాటి ఆత్మలనూ, గుణగణాలనూ, కదలికలనూ మరియు వాటిలో ఉన్న ప్రతిదాన్నీ సృష్టించాడు.
{"వాస్తవానికి, మిమ్మల్ని మరియు మీరు (చెక్కి) చేసిన వాటిని సృష్టించింది అల్లాహ్ యే కదా!"}
[అస్సాఫ్ఫాత్: 96]