Skip to content

జ్ఞానార్జనలో పాటించవలసిన మర్యాదలు ఏమిటి?

الباب / الفصل
قسم الآداب الإسلامية

السؤال

س9: ما آداب طلب العلم؟

ప్రశ్న9- జ్ఞానార్జనలో పాటించవలసిన మర్యాదలు ఏమిటి?

الجواب

ج:1. إخلاص النية لله عَزَّ وَجَلَّ.

في الحديث:

«من تعلم العلم ليباهي به العلماء، ويجاري به السفهاء، ويصرف به وجوه الناس إليه أدخله الله جهنم»

رواه ابن ماجه.

  1. أعمل بالعلم الذي تعلمته.

«لا تزول قدما عبد يوم القيامة حتى يسأل عن أربع: -وذكر منها- وعن علمه ماذا عمل فيه»

رواه الترمذي والدارمي.

  1. أحترم المعلم وأوقره في حضوره وغيابه.
  2. أجلس أمامه بأدب.
  3. أنصت إليه جيدًا ولا أقاطعه في درسه.
  4. أتأدب بطرح السؤال.
  5. لا أناديه باسمه.
  • في الحديث:

«إن من إجلال الله إكرام ذي الشيبة المسلم، وحامل القرآن»

رواه أبو داود.

జవాబు: 1 - సంకల్పాన్ని సంపూర్ణ చిత్తశుద్ధితో సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కు అంకితం చేయడం

హదీసులో ఇలా ఉన్నది :

"ఎవరైతే జ్ఞానాన్ని పండితుల ముందు గొప్పతనం ప్రదర్శించడానికి, మూర్ఖులతో పోటీ పడేందుకు, లేదా ప్రజల దృష్టిని తన వైపు మళ్లించేందుకు నేర్చుకుంటాడో, అల్లాహ్ అతనిని నరకంలో ప్రవేశింపజేస్తాడు."

దీనిని ఇబ్నె మాజహ్ ఉల్లేఖించారు.

  1. నేర్చుకున్న జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాలి.

“పునరుత్థాన దినము నాడు, కొన్ని విషయాలను గురించి ప్రశ్నించనంత వరకు, మానవుడి కాళ్ళు అతడు నిలుచుని ఉన్నచోటు నుండి ఏమాత్రమూ కదలవు. -ఆ విషయాలలో ఒకటి ప్రస్తావించారు - అతని జ్ఞానం గురించి, దానితో అతను ఏం చేశాడు?"

దీనిని తిర్మిజీ, దార్మీ ఉల్లేఖించారు.

  1. గురువును అతని సమక్షంలో మరియు పరోక్షంలో గౌరవించాలి మరియు అతనిని సత్కరించాలి.
  2. అతని సమక్షంలో వినమ్రతతో, అణుకువతో కూర్చోవాలి.
  3. గురువుకు మధ్యలో అంతరాయం కలగజేయకుండా శ్రద్ధగా వినాలి.
  4. గురువును మర్యాదతో ఉత్తమ పద్ధతిలో తన సందేహాలు అడిగి తెలుసుకోవాలి.
  5. గురువును పేరు పెట్టి పిలవ కూడదు.

"నిశ్ఛయంగా ముస్లిం వృద్ధులను మరియు ఖుర్ఆన్‌ హాఫిజ్ లను గౌరవించటం అల్లాహ్‌ను గౌరవించడం లో నుంచి అవుతుంది."

దీనిని అబూ దావూద్ ఉల్లేఖించారు.