Skip to content
సూరాల జాబితా /

النِّسَاء

النِّسَاء is chapter 4 of the Quran and has 176 verses. This page presents it in full in the Uthmani script, with a verse-by-verse translation of its meaning.

176 ఆయతులు సూరా సంఖ్య 4
ఆయత్‌కు వెళ్ళండి
తెలుగు · Muhammad
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

يَٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱتَّقُواْ رَبَّكُمُ ٱلَّذِي خَلَقَكُم مِّن نَّفۡسٖ وَٰحِدَةٖ وَخَلَقَ مِنۡهَا زَوۡجَهَا وَبَثَّ مِنۡهُمَا رِجَالٗا كَثِيرٗا وَنِسَآءٗۚ وَٱتَّقُواْ ٱللَّهَ ٱلَّذِي تَسَآءَلُونَ بِهِۦ وَٱلۡأَرۡحَامَۚ إِنَّ ٱللَّهَ كَانَ عَلَيۡكُمۡ رَقِيبٗا

ఓ మానవులారా! మీ ప్రభువు పట్ల భయభక్తులు కలిగి ఉండండి. ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి (ఆదమ్) నుండి సృష్టించాడు మరియు ఆయనే దాని (ఆ ప్రాణి) నుండి దాని జంట(హవ్వా)ను సృష్టించాడు మరియు వారిద్దరి నుండి అనేక పురుషులను మరియు స్త్రీలను వ్యాపింపజేశాడు. మరియు ఆ అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి, ఎవరి ద్వారానైతే (పేరుతోనైతే) మీరు మీ పరస్పర (హక్కులను) కోరుతారో; మరియు మీ బంధుత్వాలను గౌరవించండి (త్రెంచకండి). నిశ్చయంగా, అల్లాహ్ మిమ్మల్ని సదా కనిపెట్టుకొని ఉన్నాడు.

Explanation & meanings · 2
  1. అల్ - అర్'హాము, ర'హిమున్ యొక్క బహువచనం: అంటే గర్భకోశం. దాని నుండియే బంధుత్వాలు ఏర్పడుతాయి. కాబట్టి: "బంధుత్వాలను గౌరవించండి (త్రెంచకండి) మరియు వారి (బంధువుల) హక్కులను చెల్లించండి." అని ఎన్నో హదీసులు ఉన్నాయి.
  2. రఖీబున్ (అర్-రఖీబు) : చూడండి, 5:117. The Watcher, Observer, Guardian, Keeper from whom nothing is hidden. పరిశీలకుడు, కనిపెట్కొని ఉండేవాడు. గమనించేవాడు. ఇది అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లలో ఒకటి.

وَءَاتُواْ ٱلۡيَتَٰمَىٰٓ أَمۡوَٰلَهُمۡۖ وَلَا تَتَبَدَّلُواْ ٱلۡخَبِيثَ بِٱلطَّيِّبِۖ وَلَا تَأۡكُلُوٓاْ أَمۡوَٰلَهُمۡ إِلَىٰٓ أَمۡوَٰلِكُمۡۚ إِنَّهُۥ كَانَ حُوبٗا كَبِيرٗا

మరియు అనాథుల ఆస్తిపాస్తులను వారికి తిరిగి ఇవ్వండి. మరియు (మీ) చెడ్డ వస్తువులను (వారి) మంచి వస్తువులతో మార్చకండి. మరియు వారి ఆస్తులను మీ ఆస్తులతో కలిపి తిని వేయకండి. నిశ్చయంగా, ఇది గొప్పనేరం (పాపం).

وَإِنۡ خِفۡتُمۡ أَلَّا تُقۡسِطُواْ فِي ٱلۡيَتَٰمَىٰ فَٱنكِحُواْ مَا طَابَ لَكُم مِّنَ ٱلنِّسَآءِ مَثۡنَىٰ وَثُلَٰثَ وَرُبَٰعَۖ فَإِنۡ خِفۡتُمۡ أَلَّا تَعۡدِلُواْ فَوَٰحِدَةً أَوۡ مَا مَلَكَتۡ أَيۡمَٰنُكُمۡۚ ذَٰلِكَ أَدۡنَىٰٓ أَلَّا تَعُولُواْ

మరియు అనాథ బాలికలకు న్యాయం చేయలేమనే భయం మీకు ఉంటే, మీకు నచ్చిన (ఇతర) స్త్రీలను ఇద్దరిని గానీ, ముగ్గురిని గానీ, నలుగురిని గానీ వివాహం చేసుకోండి. అయితే వారితో న్యాయంగా వ్యవహరించ లేమనే భయం మీకు ఉంటే, ఒకామెను మాత్రమే; లేదా మీ స్వాధీనంలో నున్నవారిని (బానిస స్త్రీలను దాంపత్యంలోకి) తీసుకోండి. ఒకే వైపునకు మొగ్గకుండా (అన్యాయవర్తన నుండి దూరంగా ఉండటానికి) ఇదే సముచితమైన మార్గం.

Explanation & meanings · 2
  1. ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది: "మీరు వారి (స్త్రీల) మధ్య న్యాయం చేయలేమనే భయం ఉంటే ఒకామెను మాత్రమే వివాహమాడండి." అని. నలుగురి కంటే ఎక్కువ వివాహమాడ కండని మరియు అంత కంటే ఎక్కువ భార్యలను ఏక కాలంలో ఉంచుకోరాదని, దివ్యఖుర్ఆన్ తప్ప, ఇతర ఏ మత గ్రంథంలో కూడా వ్రాయబడ లేదు. అందుకే పూర్వకాలంలో చాలా మంది భార్యలు ఉండటం అన్ని ధర్మాల వారి ఆచారమై ఉండెను. ఇంకా ముందు దివ్యఖుర్ఆన్ లో ఇలా చెప్పబడింది: "మీరు ఎంత ప్రయత్నం చేసినా వారి (భార్యల) మధ్య న్యాయం చేయటం చాలా కష్టం అట్టి సమయంలో ఒకామెను పూర్తిగా ఉపేక్షించకండి." (చూడండి 4:129). ఈ విధంగా ఖుర్ఆన్ లో స్త్రీలకు ఇవ్వబడినంత గౌరవం, రక్షణ, హక్కులు ఇతర మత గ్రంథాలలో పేర్కొనబడ లేదు. బానిసత్వాన్ని, బానిసత్వ వ్యాపారాన్ని నిర్మూలిస్తూ, కేవలం యుద్ధఖైదీలను తప్ప ఇతరులను బానిసలుగా ఉంచగూడదని కూడా ఖుర్ఆన్ 1400 సంవత్సరాల ముందు ఆదేశించింది. ముస్లింలు అయిన బానిస స్త్రీలతో వివాహమాడటాన్ని కూడా ప్రోత్సహించింది. చూడండి, 1400 సంవత్సరాల ముందు ఇస్లాంలో మానవహక్కులు (Human Rights) మరియు స్త్రీల హక్కులు ఏ విధంగా రక్షింపబడ్డాయో!
  2. చూడండి, 24:32.

وَءَاتُواْ ٱلنِّسَآءَ صَدُقَٰتِهِنَّ نِحۡلَةٗۚ فَإِن طِبۡنَ لَكُمۡ عَن شَيۡءٖ مِّنۡهُ نَفۡسٗا فَكُلُوهُ هَنِيٓـٔٗا مَّرِيٓـٔٗا

మరియు స్త్రీలకు వారి స్త్రీ శుల్కం (మహర్) సహృదయంతో ఇవ్వండి. కాని వారు తమంతట తామే సంతోషంగా కొంత భాగాన్ని మీకు విడిచి పెడితే, దానిని సంతోషంగా స్వేచ్ఛగా అనుభవించండి (తినండి).

وَلَا تُؤۡتُواْ ٱلسُّفَهَآءَ أَمۡوَٰلَكُمُ ٱلَّتِي جَعَلَ ٱللَّهُ لَكُمۡ قِيَٰمٗا وَٱرۡزُقُوهُمۡ فِيهَا وَٱكۡسُوهُمۡ وَقُولُواْ لَهُمۡ قَوۡلٗا مَّعۡرُوفٗا

మరియు అల్లాహ్ మీకు నిర్వహించటానికి అప్పగించిన ఆస్తులను, అవివేకులుగా ఉన్నప్పుడు (అనాథులకు) అప్పగించకండి. దాని నుండి వారికి అన్న వస్త్రాలు ఇస్తూ ఉండండి. మరియు వారితో వాత్సల్యంతో మాట్లాడండి.

Explanation & meanings · 1
  1. చూడండి, 'స. బు'ఖారీ, పు - 3, 'హ. నం. 591.