Skip to content
النِّسَاء /

ఆయత్ 77

4 : 77

ఆయత్ 77 of النِّسَاء (4 : 77). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

النِّسَاء ఆయతులు 176
సూరా · النِّسَاء
తెలుగు · Muhammad
4 : 77

أَلَمۡ تَرَ إِلَى ٱلَّذِينَ قِيلَ لَهُمۡ كُفُّوٓاْ أَيۡدِيَكُمۡ وَأَقِيمُواْ ٱلصَّلَوٰةَ وَءَاتُواْ ٱلزَّكَوٰةَ فَلَمَّا كُتِبَ عَلَيۡهِمُ ٱلۡقِتَالُ إِذَا فَرِيقٞ مِّنۡهُمۡ يَخۡشَوۡنَ ٱلنَّاسَ كَخَشۡيَةِ ٱللَّهِ أَوۡ أَشَدَّ خَشۡيَةٗۚ وَقَالُواْ رَبَّنَا لِمَ كَتَبۡتَ عَلَيۡنَا ٱلۡقِتَالَ لَوۡلَآ أَخَّرۡتَنَآ إِلَىٰٓ أَجَلٖ قَرِيبٖۗ قُلۡ مَتَٰعُ ٱلدُّنۡيَا قَلِيلٞ وَٱلۡأٓخِرَةُ خَيۡرٞ لِّمَنِ ٱتَّقَىٰ وَلَا تُظۡلَمُونَ فَتِيلًا

"మీ చేతులను ఆపుకోండి, నమాజ్ ను స్థాపించండి, విధిదానం (జకాత్) ఇవ్వండి." అని చెప్పబడిన వారిని నీవు చూడలేదా? యుద్ధం చేయమని వారిని ఆదేశించినప్పుడు, వారిలో కొందరు అల్లాహ్ కు భయపడవలసిన విధంగా మానవులకు భయపడుతున్నారు. కాదు! అంతకంటే ఎక్కువగానే భయపడుతున్నారు. వారు: "ఓ మా ప్రభూ! యుద్ధం చేయమని ఈ ఆజ్ఞను మా కొరకు ఎందుకు విధించావు? మాకు ఇంకా కొంత వ్యవధి ఎందుకివ్వలేదు? అని అంటారు. వారితో ఇలా అను: "ఇహలోక సుఖం తుచ్ఛమైనది మరియు దైవభీతి గలవారికి పరలోక సుఖమే ఉత్తమమైనది. మరియు మీకు ఖర్జూర బీజపు చీలికలోని పొర (ఫతీల) అంత అన్యాయం కూడా జరుగదు.

Explanation & meanings · 1
  1. ఇస్లాం ఆరంభ దినాలలో మొట్టమొదట, మక్కా ముస్లింలకు సహనం వహించండి, నమా'జ్ చేయండి మరియు 'జకాత్ ఇవ్వండి, అని ఆదేశాలు ఇవ్వబడ్డాయి. ఎందుకంటే అప్పుడు వారి ఆర్థిక మరియు భౌతిక పరిస్థితులు జిహాద్ కు అనుకూలంగా లేకుండెను. అయినా వారు, జిహాద్ కొరకు తొందర పెట్టేవారు. కాని ఇప్పుడు మదీనా మునవ్వరాకు వచ్చిన తరువాత వారి పరిస్థితులు మెరుగైన తరువాత వారిని జిహాద్ చేయమని ఆజ్ఞాపిస్తే వారెందుకు వెనుకంజ వేస్తున్నారని ఈ ఆయత్ ప్రశ్నిస్తున్నది.