Skip to content
النِّسَاء /

ఆయత్ 51

4 : 51
النِّسَاء ఆయతులు 176
సూరా · النِّسَاء
తెలుగు · Muhammad
4 : 51

أَلَمۡ تَرَ إِلَى ٱلَّذِينَ أُوتُواْ نَصِيبٗا مِّنَ ٱلۡكِتَٰبِ يُؤۡمِنُونَ بِٱلۡجِبۡتِ وَٱلطَّٰغُوتِ وَيَقُولُونَ لِلَّذِينَ كَفَرُواْ هَٰٓؤُلَآءِ أَهۡدَىٰ مِنَ ٱلَّذِينَ ءَامَنُواْ سَبِيلًا

ఏమీ? గ్రంథజ్ఞానంలో కొంతభాగం ఇవ్వబడిన వారిని గురించి నీకు తెలియదా ? వారు జిబ్త్ మరియు తాగూత్ లలో విశ్వాసముంచుతున్నారు. వారు సత్యతిరస్కారులను గురించి: "విశ్వాసుల కంటే, వీరే సరైన మార్గంలో ఉన్నారు." అని అంటారు.

Explanation & meanings · 2
  1. జిబ్త్: అంటే అసలు అర్థం అసత్యమైనది, ఆధారం లేనిది, నిరుపయోగమైనది. ఇస్లాం పరిభాషలో మంత్ర తంత్రాలు, జ్యోతిషం, భూతవైద్యం, శకునాలు, ముహూర్తాలు మరియు ఊహాపోహలకు సంబంధించిన అన్ని విషయాలను జిబ్త్ తో పోల్చవచ్చు.
  2. 'తా'గూత్: చూడండి, 2:256 వ్యాఖ్యానం 3. 'తా'గూత్ అంటే షై'తాన్ అని కూడ అర్థం. ఎందుకంటే కల్పిత దైవాలను ఆరాధించటం షై'తాన్ ను అనుసరించటమే. కావున షై'తాన్ కూడా 'తా'గూత్ లలో చేరుతాడు.