Skip to content
النِّسَاء /

ఆయత్ 94

4 : 94

ఆయత్ 94 of النِّسَاء (4 : 94). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

النِّسَاء ఆయతులు 176
సూరా · النِّسَاء
తెలుగు · Muhammad
4 : 94

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓاْ إِذَا ضَرَبۡتُمۡ فِي سَبِيلِ ٱللَّهِ فَتَبَيَّنُواْ وَلَا تَقُولُواْ لِمَنۡ أَلۡقَىٰٓ إِلَيۡكُمُ ٱلسَّلَٰمَ لَسۡتَ مُؤۡمِنٗا تَبۡتَغُونَ عَرَضَ ٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَا فَعِندَ ٱللَّهِ مَغَانِمُ كَثِيرَةٞۚ كَذَٰلِكَ كُنتُم مِّن قَبۡلُ فَمَنَّ ٱللَّهُ عَلَيۡكُمۡ فَتَبَيَّنُوٓاْۚ إِنَّ ٱللَّهَ كَانَ بِمَا تَعۡمَلُونَ خَبِيرٗا

ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ మార్గంలో (జిహాద్ కు) బయలుదేరి నప్పుడు వివేచనతో వ్యవహరించండి. (శాంతిని ఆశించి మీ వైపునకు) సలాం చేస్తూ వచ్చే వానిని - ప్రాపంచిక ప్రయోజనాలను పొంద గోరి - "నీవు విశ్వాసివి (ముస్లింవు) కావు." అని (త్వరపడి) అనకండి. అల్లాహ్ దగ్గర మీ కొరకు విజయధనాలు అత్యధికంగా ఉన్నాయి. దీనికి పూర్వం మీరు కూడా ఇదే స్థితిలో ఉండేవారు కదా! ఆ తరువాత అల్లాహ్ మిమ్మల్ని అనుగ్రహించాడు, కావున సముచితమైన పరిశీలన చేయండి. నిశ్చయంగా, అల్లాహ్! మీరు చేసేదంతా బాగా ఎరుగును.

Explanation & meanings · 1
  1. ఒకసారి కొందరు 'స'హాబీలు జిహాద్ కొరకు పోతుంటారు. దారిలో ఒక పశువుల కాపరి వారిని చూసి సలామ్ చేస్తాడు. వారు అతడు విశ్వాసికాడు, కేవలం తన ప్రాణాలను కాపాడుకోవటానికే - తాను ముస్లింనని తెలుపటానికి - సలాం చేశాడని భావించి, అతనిని చంపి, అతని పశువులను, మాలె 'గనీమత్ గా దైవప్రవక్త ('స'అస) దగ్గరికి తెస్తారు. అప్పుడు ఈ ఆయత్ అవతరింపజేయబడింది. ('స. బు'ఖారీ, తిర్మిజీ').