Skip to content
సూరాల జాబితా /

آل عِمران

آل عِمران is chapter 3 of the Quran and has 200 verses. This page presents it in full in the Uthmani script, with a verse-by-verse translation of its meaning.

200 ఆయతులు సూరా సంఖ్య 3
ఆయత్‌కు వెళ్ళండి
తెలుగు · Muhammad
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

الٓمٓ

అలిఫ్-లామ్-మీమ్ .

Explanation & meanings · 1
  1. సూరతుల్ బఖరహ్ లోని మొదటి ఆయతు యొక్క ఫుట్‌నోట్ చూడండి.

ٱللَّهُ لَآ إِلَٰهَ إِلَّا هُوَ ٱلۡحَيُّ ٱلۡقَيُّومُ

అల్లాహ్! ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. ఆయన సజీవుడు (నిత్యుడు), విశ్వవ్యవస్థకు ఆధార భూతుడు.

Explanation & meanings · 1
  1. చూడండి, 2:255.

نَزَّلَ عَلَيۡكَ ٱلۡكِتَٰبَ بِٱلۡحَقِّ مُصَدِّقٗا لِّمَا بَيۡنَ يَدَيۡهِ وَأَنزَلَ ٱلتَّوۡرَىٰةَ وَٱلۡإِنجِيلَ

ఆయన, సత్యమైన ఈ దివ్యగ్రంథాన్ని (ఓ ముహమ్మద్!) నీపై అవతరింపజేశాడు. ఇది పూర్వం అవతరింపజేయబడిన గ్రంథాలలో నుండి (మిగిలి వున్న సత్యాన్ని) ధృవపరుస్తోంది. మరియు ఆయనే తౌరాత్ ను మరియు ఇంజీలును అవతరింపజేశాడు.

Explanation & meanings · 2
  1. చూడండి, 5:46, 48, 61:6.
  2. ఇక్కడ (ఖుర్ఆన్ లో) పేర్కొనబడిన ఇంజీల్ మరియు తౌరాత్ గ్రంథాలు అంటే 'ఈసా ('అ.స.) మరియు మూసా ('అ.స.) లపై అవతరింపజేయబడిన దివ్యగ్రంథాలు అని అర్థం. ఆ అసలు దివ్యగ్రంథాలు ఇప్పుడు ప్రపంచంలో లేవు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అత్యంత ప్రాచీన బైబిల్ గ్రంథాలు, గ్రీక్ భాషలో ఉన్న బ్రిటీష్ మ్యూజియంలోని Codex Sinaiticus, Codex Alexandrinus మరియు రోమ్ లోని వాటికాన్ లైబ్రరీలో ఉన్న Codex Vaticanus. ఇవి 'ఈసా ('అ.స.) పైకి సజీవులుగా ఎత్తుకోబడిన దాదాపు నాలుగు వందల సంవత్సరాల తరువాత, గ్రీక్ భాషలో వ్రాయబడ్డాయి. మూసా మరియు 'ఈసా ('అలైహిమ్. స.) లపై అవతరింపజేయబడిన తౌరాత్ మరియు ఇంజీల్ గ్రంథాల బాష గ్రీకు కాదు. వారి మతాచారులు / విద్వాంసులు, వాటిలో ఇంత వరకు ఎన్నో సార్లు, ఎన్నో మార్పులు చేస్తూ వచ్చారు. ఈ రోజు వాడుకలో ఉన్న బైబిల్ లలో, ఆ ప్రవక్తల కొన్ని ప్రవచనాలు మరియు అసలు దివ్య ఆవిష్కృతులైన కొన్ని అంసాలు - వారి మతాచారులు / విద్వాంసులు వ్రాసిన రూపంలో - ఉన్నాయి. కాబట్టి దివ్యఖుర్ఆన్ సూచించేది ఆ ప్రవక్తలపై అవతరింపజేయబడిన ప్రవచనాలను మాత్రమే కానీ ఈ రోజు వాడుకలో ఉన్న బైబిల్ (Revised) Authorized Kind James Version ను కాదు. చూడండి, 4:136, 5:47.

مِن قَبۡلُ هُدٗى لِّلنَّاسِ وَأَنزَلَ ٱلۡفُرۡقَانَۗ إِنَّ ٱلَّذِينَ كَفَرُواْ بِـَٔايَٰتِ ٱللَّهِ لَهُمۡ عَذَابٞ شَدِيدٞۗ وَٱللَّهُ عَزِيزٞ ذُو ٱنتِقَامٍ

దీనికి ముందు ప్రజలకు సన్మార్గం చూపటానికి, మరియు (సత్యాసత్యాలను విశదీకరించే) ఈ గీటురాయిని కూడా అవతరింపజేశాడు. నిశ్చయంగా, ఎవరైతే అల్లాహ్ ఆజ్ఞను తిరస్కరిస్తారో వారికి కఠినశిక్ష ఉంటుంది. మరియు అల్లాహ్ సర్వ శక్తిమంతుడు, ప్రతీకారం తీర్చుకోగలవాడు.

Explanation & meanings · 1
  1. చూడండి, 2:53.

إِنَّ ٱللَّهَ لَا يَخۡفَىٰ عَلَيۡهِ شَيۡءٞ فِي ٱلۡأَرۡضِ وَلَا فِي ٱلسَّمَآءِ

నిశ్చయంగా, భూమిలో గానీ మరియు ఆకాశాలలో గానీ, అల్లాహ్ కు గోప్యంగా ఉన్నది ఏదీ లేదు.