4 : 15
وَٱلَّٰتِي يَأۡتِينَ ٱلۡفَٰحِشَةَ مِن نِّسَآئِكُمۡ فَٱسۡتَشۡهِدُواْ عَلَيۡهِنَّ أَرۡبَعَةٗ مِّنكُمۡۖ فَإِن شَهِدُواْ فَأَمۡسِكُوهُنَّ فِي ٱلۡبُيُوتِ حَتَّىٰ يَتَوَفَّىٰهُنَّ ٱلۡمَوۡتُ أَوۡ يَجۡعَلَ ٱللَّهُ لَهُنَّ سَبِيلٗا
మరియు మీ స్త్రీలలో ఎవరైనా వ్యభిచారానికి పాల్పబడితే, వారికి వ్యతిరేకంగా, మీలో నుండి నలుగురి సాక్ష్యం తీసుకోండి. వారు (నలుగురు) సాక్ష్యమిస్తే, వారు మరణించే వరకైనా, లేదా వారి కొరకు అల్లాహ్ ఏదైనా మార్గం చూపించే వరకైనా, వారిని ఇండ్లలో నిర్బంధించండి.
Explanation & meanings · 1
- ఇది ము'హమ్మద్ ('స'అస), ప్రవక్తగా ఎన్నుకోబడిన మొదటి రోజులలో ఇవ్వబడిన అల్లాహ్ (సు.తా.) ఆజ్ఞ. ఆ తరువాత సూరహ్ అన్నూర్ (24:2)లో, అల్లాహుతా'ఆలా తన ఆదేశాన్ని వివరంగా అవతరింపజేశాడు. ఇంకా చూడండి, 4:25.