4 : 146
إِلَّا ٱلَّذِينَ تَابُواْ وَأَصۡلَحُواْ وَٱعۡتَصَمُواْ بِٱللَّهِ وَأَخۡلَصُواْ دِينَهُمۡ لِلَّهِ فَأُوْلَٰٓئِكَ مَعَ ٱلۡمُؤۡمِنِينَۖ وَسَوۡفَ يُؤۡتِ ٱللَّهُ ٱلۡمُؤۡمِنِينَ أَجۡرًا عَظِيمٗا
కాని ఎవరైతే, పశ్చాత్తాప పడి, తమను తాము సంస్కరించుకొని, అల్లాహ్ ను గట్టిగా నమ్ముకొని తమ ధర్మాన్ని (భక్తిని) కేవలం అల్లాహ్ కొరకే ప్రత్యేకించు కుంటారో, అలాంటి వారే విశ్వాసులతో కలిసి మెలిసి ఉంటారు. మరియు త్వరలోనే అల్లాహ్ విశ్వాసులందరికీ గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదించగలడు.
Explanation & meanings · 1
- మరియు ఏ కపటవిశ్వాసి అయితే పశ్చాత్తాపపడి తనను తాను సవరించుకొని అల్లాహ్ (సు.తా.) నే గట్టిగా విశ్వసించి తన భక్తిని కేవలం అల్లాహ్ (సు.తా.) కే ప్రత్యేకించుకుంటాడో అట్టివాడు స్వర్గంలో విశ్వాసులతో ఉంటాడు.