Skip to content
అన్-నిసా /

ఆయత్ 65

4 : 65

ఆయత్ 65 of అన్-నిసా (4 : 65). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

అన్-నిసా ఆయతులు 176
సూరా · అన్-నిసా
తెలుగు · Muhammad
4 : 65

فَلَا وَرَبِّكَ لَا يُؤۡمِنُونَ حَتَّىٰ يُحَكِّمُوكَ فِيمَا شَجَرَ بَيۡنَهُمۡ ثُمَّ لَا يَجِدُواْ فِيٓ أَنفُسِهِمۡ حَرَجٗا مِّمَّا قَضَيۡتَ وَيُسَلِّمُواْ تَسۡلِيمٗا

అలా కాదు, నీ ప్రభువు సాక్షిగా! వారు తమ పరస్పర విభేదాల విషయంలో నిన్ను న్యాయనిర్ణేతగా స్వీకరించనంత వరకు మరియు (ఓ ప్రవక్తా!) నీవు ఏ నిర్ణయం చేసినా దానిని గురించి వారి మనస్సులలో ఏ మాత్రం సంకోచం లేకుండా దానికి (యథాతథంగా) శిరసావహించనంత వరకు, వారు (నిజమైన) విశ్వాసులు కాలేరు!

Explanation & meanings · 1
  1. 'జుబైర్ (ర'ది.'అ.) దైవప్రవక్త ('స'అస) యొక్క తండ్రి సోదరీమణి (మేనత్త) కుమారులు. అతను ఒకసారి చేనుకు నీరు ప్రవహించే కాలువ గురించి ఒక విశ్వాసితో పోట్లాడుతారు. వారిద్దరూ దైవప్రవక్త ('స'అస) దగ్గరకు తీర్పు కోసం వస్తారు. అతను న్యాయంగా 'జుబైర్ (ర'ది.'అ.) పక్షాన తీర్పు చేయగా, ఆ రెండో వ్యక్తి అంగీకరించడు. పైగా అతడు: 'జుబైర్ (ర'ది.'అ.) మీ బంధువు కాబట్టి, అతని పక్షాన తీర్పు చేశారు, అని అంటాడు. ఆ సందర్భంలో ఈ ఆయత్ అవతరింపజేయబడింది. 'స, బు'ఖారీ, సూరహ్ అన్-నిసాఅ' (4), వ్యాఖ్యానం.