Skip to content
النِّسَاء /

ఆయత్ 6

4 : 6

ఆయత్ 6 of النِّسَاء (4 : 6). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

النِّسَاء ఆయతులు 176
సూరా · النِّسَاء
తెలుగు · Muhammad
4 : 6

وَٱبۡتَلُواْ ٱلۡيَتَٰمَىٰ حَتَّىٰٓ إِذَا بَلَغُواْ ٱلنِّكَاحَ فَإِنۡ ءَانَسۡتُم مِّنۡهُمۡ رُشۡدٗا فَٱدۡفَعُوٓاْ إِلَيۡهِمۡ أَمۡوَٰلَهُمۡۖ وَلَا تَأۡكُلُوهَآ إِسۡرَافٗا وَبِدَارًا أَن يَكۡبَرُواْۚ وَمَن كَانَ غَنِيّٗا فَلۡيَسۡتَعۡفِفۡۖ وَمَن كَانَ فَقِيرٗا فَلۡيَأۡكُلۡ بِٱلۡمَعۡرُوفِۚ فَإِذَا دَفَعۡتُمۡ إِلَيۡهِمۡ أَمۡوَٰلَهُمۡ فَأَشۡهِدُواْ عَلَيۡهِمۡۚ وَكَفَىٰ بِٱللَّهِ حَسِيبٗا

మరియు వివాహయోగ్యమైన వయస్సు వచ్చే వరకూ మీరు అనాథులను పరీక్షించండి, ఇక వారిలో మీకు యోగ్యత కనిపించినప్పుడు, వారి ఆస్తులను వారికి అప్పగించండి. మరియు వారు పెరిగి పెద్దవారు అవుతారనే తలంపుతో దానిని (వారి ఆస్తిని) త్వరపడి అపరిమితంగా తినకండి. మరియు అతడు (సంరక్షకుడు) సంపన్నుడైతే, వారి సొమ్ముకు దూరంగా ఉండాలి. కాని అతడు పేదవాడైతే, దాని నుండి ధర్మసమ్మతంగా తినాలి. ఇక వారి ఆస్తిని వారికి అప్పగించేటప్పుడు దానికి సాక్షులను పెట్టుకోండి. మరియు లెక్క తీసుకోవటానికి అల్లాహ్ చాలు!

Explanation & meanings · 1
  1. అల్-'హసీబు : Reckoner, Taker of Accounts, Sufficer, or giver of what is sufficient. లెక్కతీసుకునే, పరిగణించే వాడు. అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లలో ఒకటి. చూడండి, 4:86.