ఫలితాలను ఫిల్టర్ చేయండి
339 కార్డులు
الموضوعات
الموضوعات (13)
التصنيف الشرعي
Filter ▾
حجم المحتوى4
జవాబు: నమాజులో విధులు (వాజిబాతులు) తొమ్మిది. అవి,
- తక్బీర్ అల్ ఇహ్రామ్ కాకుండా మిగిలిన తక్బీర్లు
- ఇమామ్ మరియు ఒంటరిగా నమాజు చేస్తున్న వారు "సమిఅ అల్లాహు లిమన్ హమిదహ్ (తనను ఎవరైనా స్తుతిస్తే, అల్లాహ్ దానిని ఆలకిస్తాడు)" అని పలకడం.
- "రబ్బనా వలకల్ హమ్ద్ (ఓ అల్లాహ్! ప్రశంసలన్నీ నీకే శోభిస్తాయి)" అని పలకడం.
- రుకూలో "సుబహాన రబ్బియల్ అజీమ్" అని మూడు సార్లు పలకడం.
- సజ్దాలో "సుబహాన రబ్బియల్ అఆలా" అని మూడుసార్లు పలకడం.
- రెండు సజ్దాల మధ్య విరామంలో (జల్సా భంగిమలో ప్రశాంతంగా కూర్చున్నప్పుడు), రబ్బిగ్ఫిర్లీ అని పలకడం.
- తషహ్హుద్ మొదటి భాగం పఠించడం.
- తషహ్హుద్ మొదటి భాగాన్ని పఠించడం కొరకు కూర్చోవడం.
జవాబు: నమాజు సున్నతులు ఈ క్రింది విధంగా పదకొండు కలవు:
- దుఆ అల్ ఇస్తిఫ్తాహ్ అంటే తక్బీర్ అల్ ఇహ్రామ్ తరువాత "సుబహానక అల్లాహుమ్మ వ బి హమ్'దిక, వ తబారకస్ముక, వ తఅఆలా జద్దుక, వలా ఇలాహ గైరుక" అని పలకడం.
- తఅ'వ్వుజ్ అంటే అఊజు బిల్లాహి మినష్షయితా నిర్రజీమ్ అని పలకడం.
- బస్మలహ్ అంటే బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్ అని పలకడం.
- ఆమీన్ అని పలకడం.
- సూరతుల్ ఫాతిహా తరువాత వేరే ఏదైనా సూరహ్ గానీ, ఏదైనా సూరహ్ లోని కొన్ని ఆయతులు గానీ పఠించడం.
- బిగ్గరగా ఖుర్ఆన్ పారాయణం చేసే నమాజులలో వెనుక ఉన్న వారికి చక్కగా వినిపించేలా ఇమామ్ తన కంఠస్వరాన్ని పెంచి, ఖుర్ఆన్ వచనాలు పఠించడం.
- తహ్మీద్ పలకడం (అల్లాహ్ ను స్తుతించడం) - "మిలస్సమావాతి వ మినల్ అర్ద్, వ మినల్ మా షి'త మిన్ షైఇన్ బఆద్" అనే పలుకులు ఇమాం నుండి విన్న తరువాత అల్హందులిల్లాహ్ అంటూ అల్లాహ్ ను స్తుతించడం.
- తస్బీహ్ - రుకూలో ఎక్కువసార్లు సుబహాన రబ్బియల్ అజీమ్ అనే పలుకులను ఒకటి కంటే ఎక్కువ సార్లు చదవడం.
- సజ్దాలో ఒకటి కంటే ఎక్కువ సార్లు తస్బీహ్ చదవటం.
- రబ్బిగ్'ఫిర్లీ అనే పదాలను రెండు సజ్దాల మధ్య ప్రశాంతంగా కొంచెంసేపు కూర్చున్నప్పుడు ఒకటి కంటే ఎక్కువ సార్లు చదవడం.
- చివరి తషహ్హు ద్ లో ప్రవక్త ﷺ మరియు ఆయన కుటుంబం మీద దరూద్,సలాం, శుభాలను పలుకడం, మరియు తరువాత దుఆ చేయడం.
సున్నత్ కార్యాలు, మరియు వాటిని హైయ్'ఆత్ (రూపాలు,ఆకృతులు) అని పిలుస్తారు :
- తక్బీర్ అల్ ఇహ్రామ్ పలుకులతో రెండు అరచేతులను ఖిబ్లా దిశలో చెవుల క్రింది భాగం వరకు పైక లేపడం.
- రుకూలోకి వెళ్ళే ముందు రఫ్ ఉల్ యదైన్ చేయడం
- రుకూ నుండి పైకి లేచిన తరువాత రఫ్ ఉల్ యదైన్ చేయడం.
- రఫ్ ఉల్ యదైన్ తరువాత రెండు చేతులను క్రిందికి దించడం.
- ఎడమ చేతిపై కుడి చేతిని కట్టడం.
- సజ్దా చేసే స్థానంపై మీ కంటిచూపును ఉంచడం.
- నిటారుగా నిలబడినప్పుడు రెండు కాళ్ళను సముచితమైన దూరంలో ఉంచడం.
- రుకులో రెండు అరచేతులతో మరియు చేతివ్రేళ్ళతో రెండు మోకాళ్లను గట్టిగా పట్టుకోవడం, ఒకరి వీపును నేలకు సమాంతరంగా, తిన్నగా ఉంచుతూ, తల మరియు వీపు సమంగా ఉండేలా ముందుకు వంగడం.
- సజ్దా అవయవాలను నేలపై ప్రశాంతంగా ఆన్చడం, అవన్నీ నేలను తాకేలా చూసుకోవడం.
- సజ్దాలో రెండు మోజేతులను పక్కల నుండి దూరంగా ఉంచడం, పొత్తికడుపు తొడల నుండి మరియు తొడలను కాళ్ళ నుండి దూరంగా ఉంచడం; మోకాళ్లను వేరుగా ఉంచడం మరియు పాదాల కాలి వేళ్లు వేరు చేయడం మరియు వేళ్ళ మొన భాగాన్ని నేలకు ఆన్చడం; అరచేతులు నేలపై ఆన్చుతూ, వాటి వేళ్ళు కలిపి ఉంచి, మోజేతులను భుజాలకు సమాంతరంగా ఉంచడం.
- రెండు సజ్దాల మధ్య మరియు మొదటి తషహ్హుద్ సమయంలో కూర్చున్నప్పుడు ఇఫ్తీరాష్ (ఎడమ పాదాన్ని దాని వైపే ఉంచి, దానిపై కూర్చోవడం; మరియు కుడి పాదాన్ని ఖిబ్లా వైపు కాలి వేళ్ల మొనలు ఉండేలా చేయడం) చేయడం. అయితే, రెండవ తషహ్హుద్ సమయంలో తవర్రుక్ (ఎడమ వెనుక భాగాన్ని (పిరుదులను) నేలపై పర్చి, దానిపై కూర్చోవడం; కుడి పాదం కాలి వేళ్ల ఖిబ్లా వైపు ఉంచి, పాదాన్ని నిటారుగా ఉండేలా చేయడం; మరియు ఎడమ పాదాన్ని కుడి పాదం కింద ఉండేలా చేయడం) చేయడం.
- రెండు సజ్దాల మధ్య మరియు తషహ్హుద్ సమయంలో చేతి వ్రేళ్ళను దగ్గరగా ఉంచి, రెండు అరచేతులను రెండు తొడల మీద పెట్టడం; అయితే, రెండవ తషహ్హుద్ సమయంలో, తన కుడి చేతి యొక్క చిన్న మరియు ఉంగరపు వేళ్లను (చివరి రెండు వేళ్ళను) బిగించి, బొటనవేలు మరియు మధ్య వేళ్లతో ఉంగరాన్ని తయారు చేయవచ్చు మరియు అల్లాహ్ నామం ప్రస్తావిస్తున్నప్పుడు చూపుడు వేలును పైకి లేపి చూపవలెను.
- తస్లీమ్ చేస్తున్నప్పుడు ముందుగా ముఖాన్ని కుడివైపుకు త్రిప్పాలి, ఆ తరువాత ఎడమవైపునకు.
జవాబు: నమాజు చేసే పద్ధతి
- ఖిబ్లా దిశకు (మక్కాలోని కాబాగృహం దిక్కుకు) అభిముఖంగా శరీరం మొత్తాన్ని త్రిప్పి, అటూ ఇటూ తిరగకుండా నిలబడాలి.
- బయటకు ఉచ్ఛరించకుండా, మనస్సులోనే ఏ నమాజు చేస్తున్నారో, దాని కొరకు సంకల్పం చేసుకోవాలి.
- భుజాల ఎత్తులో ఖిబ్లాకు అభిముఖంగా అరచేతులు ఉండేలా రెండు చేతులు పైకి ఎత్తి, "అల్లాహు అక్బర్" (అల్లాహ్ గొప్పవాడు) అని పలుకుతూ తక్బీర్ అల్ ఇహ్రామ్ పూర్తి చేయాలి.
- ఛాతీపై ఎడమచేయి ఉంచి, దానిపై కుడి చేతిని ఉంచవలెను.
- ఈ దుఆ చేస్తూ నమాజ్ ప్రారంభించండి:
అల్లాహుమ్మ బాయిద్ బైని వ బైన ఖతాయాయ కమా బాఅద్’త బైనల్ మష్రిఖి వల్ మగ్రిబి, అల్లాహుమ్మ నఖ్ఖినీ మిన్ ఖతాయాయ కమా యునఖ్ఖ స్సౌబల్ అబ్యజి మినద్'దనసి, అల్లాహుమ్మగ్'సిల్నీ మిన్ ఖతాయాయ బిల్ మాయి వస్సల్జీ వల్ బర్'దీ (ఓ అల్లాహ్! మీరు తూర్పును పశ్చిమం నుండి వేరు చేసినట్లుగా, నా పాపాల నుండి నన్ను వేరు చేయుము. ఓ అల్లాహ్! తెల్లని వస్త్రం నుండి మరకలను తొలగించినట్లు నా పాపాల నుండి నన్ను శుభ్రపరచు. ఓ అల్లాహ్! మంచు, నీరు మరియు వడగళ్ళతో నా పాపాలను కడిగివేయి).
లేదా ఇలా పలకండి:
(సుబ్హానకల్లాహుమ్మ వబిహమ్దిక వతబారకస్ముక వతఆలా జద్దుక వలా ఇలాహ గైరుక.)
- అల్లాహ్ వద్ద ఈ పదాలు పలుకుతూ శరణు వేడుకోండి.
అఊదు బిల్లాహి మినష్షయితా నిర్రజీమ్ (శాపగ్రస్తుడైన షైతాన్ నుండి అల్లాహ్ శరణు కోరుతున్నాను)
- ఆ తరువాత ఇలా బస్మలతో ప్రారంభించి, సూరతుల్ ఫాతిహా పఠించవలెను.
బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్ (అపార కరుణామయుడు,పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో) (1)
{సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ మాత్రమే సమస్త స్తోత్రాలకు అర్హుడు.
అర్రహ్మా నిర్రహీమ్ (అపార కరుణామయుడు,పరమ కృపాశీలుడు) (3)
మాలికి యౌమిద్దీన్ (తీర్పుదినానికి యజమాని).(4)
ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తయీన్ ( మేము కేవలం నిన్ను మాత్రమే ఆరాధిస్తాము మరియు కేవలం నిన్ను మాత్రమే సహాయం కొరకు అర్థిస్తాము).(5)
ఇహ్'ది నశ్శిరాతల్ ముస్తఖీమ్ (మాకు ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేయి).(6)
శిరాతల్లదీన్ అన్అమ్త అలైహిమ్ గైరిల్ మగ్దూబి అలైహిమ్ వలద్దాల్లీన్ (నీవు అనుగ్రహించిన వారి మార్గం మాత్రమే (చూపు) నీ ఆగ్రహానికి గురి అయిన వారి (మార్గం కానీ) లేక మార్గభ్రష్టులైన వారి (మార్గం కానీ) కాదు).(7)
[అల్ ఫాతిహ: 2]
ఆ తరువాత ఆమీన్ (అంటే ఓ అల్లాహ్! నా ప్రార్థన స్వీకరించుము) అని పలక వలెను. :
- తరువాత ఖుర్ఆన్ లో నుండి మీకు వీలయిన భాగాన్ని పఠించ వలెను. ఉదయపు ఫజ్ర్ నమాజులో దీర్ఘంగా ఎక్కువ సేపు ఖుర్ఆన్ పారాయణం చేయవలెను.
- ఆ తరువాత (అల్లాహు అక్బర్) తక్బీర్ పలుకుతూ, రెండు చేతులూ భుజాల వరకు ఖిబ్లా దిశలో పైకెత్తి, దించుతూ రుకూలోకి వెళ్ళవలెను. రుకూలో చేతి వ్రేళ్ళను వ్యాపింపజేసి, రెండు అరచేతులతో మోకాలి చిప్పలను గట్టిగా పట్టుకుని, వీపును తిన్నగా అంటే నేలకు సమాంతరంగా ఉంచి, తల మరియు నడుము ఒకే ఎత్తులో ఉండేటట్లు చూడటం సున్నతు.
- రుకూలో మూడు సార్లు సుబహాన రబ్బియల్ అజీమ్ (లోపాలూ, కొరతలకు అతీతుడైన నా ప్రభువుకే సకల కీర్తనలు), ఇంకా ఇలా కూడా పలికితే మంచిది: సుబహానక అల్లాహుమ్మ వ బి హమ్'దిక, అల్లాహుమ్మగ్'ఫిర్లీ ((ఓ అల్లాహ్! నీవు ఎలాంటి లోపాలకూ, కొరతలకూ అతీతుడవు. ఓ అల్లాహ్, నన్ను క్షమించు)
- ఆ తరువాత రుకూ నుండి తన తల పైకెత్తుతూ, మరలా రెండు చేతులు భుజాల వరకు పైకెత్తి సమి అల్లాహు లిమన్ హమిదహ్ (అల్లాహ్ తనను స్తుతించే వారిని వింటాడు) అని పలక వలెను. ఇమామును అనుసరిస్తూ, ఆయన వెనుక నమాజ్ చేస్తున్నవారు, బదులుగా ఇలా పలక వలెను రబ్బనా వలకల్ హమ్ద్ (ఓ మా ప్రభూ! సకల స్తోత్రములు నీకే శోభిస్తాయి).
- అలా పైకి లేచి, నిటారుగా నిలబడిన తరువాత రబ్బనా వలకల్ హమ్'ద్ మిల్అ స్సమావాతి వ మిల్ అల్ అర్'ది, వ మా బైనహుమా వ మిల్అ మా షిఅత మిన్ షైయిన్ బఆదు. అహ్లలథ్థనాయి వల్ మజ్ది అహఖ్'ఖు మా ఖాలల్ అబ్'దు వ కుల్లునా లక అబ్దున్. అల్లాహుమ్మ లా మానిఅ లిమా ఆతైత వలా మూతియ లిమా మనఆత వలా యన్'ఫవు దల్ జద్ది మిన్కల్ జద్దు (ఆకాశాల నిండుగా, భూమి నిండుగా మరియు వాటి మధ్య నున్న వాటి నిండుగా, ఆ తరువాత నీవు తలచిన వాటన్నింటి నిండుగా (ప్రశంసలన్నీ నీకే శోభిస్తాయి). సమస్త ప్రశంసలు మరియు ఘనతలు గలవాడవు. దాసుడు సెలవిచ్చిన మాట అత్యంత సత్యమైనది. మేమంతా నీకు దాస్యం చేయువారము. ఓ అల్లాహ్! నీవు ఇవ్వదలిస్తే అడ్డగించే వాడెవ్వడూ లేడు. మరియు నీవు ఇవ్వదలచక పోతే దాన్ని ప్రసాదించే వాడెవ్వడూ లేడు. ఏ గొప్పవాని గొప్పతనమూ నీ వద్ద చెల్లదు. అతనికి అది ఎలాంటి లాభాన్నీ చేకూర్చదు) అని పలుక వలెను.
- "అల్లాహు అక్బర్" (అల్లాహ్ గొప్పవాడు) అని పలుకుతూ, మొదటి సజ్దాలోకి వెళ్ళ వలెను. శరీరంలోని ఏడు భాగాలను నేలకు ఆన్చి సజ్దా చేయవలెను: నుదురు, ముక్కు, రెండు అరచేతులు, రెండు మోకాళ్ళు మరియు రెండు కాళ్ళవేళ్లు; చేతులను పక్కల నుండి దూరంగా ఉంచి, నేలపై మోచేతులు ఆన్చకుండా, కాలివేళ్లను ఖిబ్లా దిశలో ఉంచ వలెను.
- సజ్దాలో మూడు సార్లు సుబహాన రబ్బియల్ ఆలా (సర్వోన్నతుడైన నా ప్రభువు అపర పరిశుద్ధుడు) పలక వలెను. ఇంకా ఇలా పలికితే మంచిది - సుబహానక అల్లాహుమ్మ, రబ్బనా వ బిహమ్'దిక అల్లాహుమ్మగ్'ఫిర్'లీ (ఓ అల్లాహ్ నీవు పరిశుద్ధుడవు, ఓ మా ప్రభూ! నేను నిన్నుస్తుతిస్తున్నాను. (కనుక) ఓ అల్లాహ్ నన్ను క్షమించు)
- ఆ తరువాత అల్లాహు అక్బర్ అని పలుకుతూ సజ్దా నుండి తల పైకెత్త వలెను.
- ఆ తరువాత రెండు సజ్దాల మధ్య ఎడమ పాదం మీద కూర్చొని; కుడి పాదం నిటారుగా ఉంచి;తన రెండు చేతులను తన తొడలు,తన మోకాళ్ళపై పెట్టవలెను.
- రెండు సజ్దాల మధ్య జులూస్ లో కూర్చున్నప్పుడు ఇలా దుఆ చేయవలెను.
రబ్బిగ్'ఫిర్లీ వర్'హమ్'నీ, వహ్'దినీ, వరజుఖ్'నీ, వజ్'బుర్'నీ, వఆఫినీ (ఓ నా ప్రభూ నన్ను క్షమించు, నన్ను కరుణించు, నాకు సన్మార్గం వైపు మార్గదర్శకం చేయి, నాకు ఉపాధి ప్రసాదించు, నా నష్టాన్ని పూడ్చు, నాకు ఉన్నత స్థానాన్ని ప్రసాదంచు.)
- ఆ తరువాత అల్లాహు అక్బర్ అని పలుకుతూ మొదటిసారి చేసినట్లుగానే చేస్తూ, మొదటి సజ్దాలో ప్రార్థించినట్లుగానే ప్రార్థిస్తూ, రెండవ సారి సజ్దా చేయవలెను.
- ఆ తరువాత అల్లాహు అక్బర్ అని పలుకుతూ, రెండవ సజ్దా నుండి లేచి నిలబడ వలెను (ఇక్కడితో మొదటి రకాతు పూర్తయింది), మొదటి రకాతులో పలికినట్లుగా, ఆచరించినట్లుగానే చేస్తూ రెండవ రకాతు పూర్తి చేయ వలెను.
- రెండవ రకాతులోని రెండవ సజ్దా చేసిన తరువాత రెండవ సజ్దా నుండి అల్లాహు అక్బర్ అని పలుకుతూ, రెండు సజ్దాల మధ్య కూర్చున్నట్లుగానే లేచి కూర్చో వలెను.
- అలా కూర్చొని, ఇలా తషహ్హుద్ పఠించ వలెను.
అత్తహియ్యాతు లిల్లాహి వస్సలవాతు వత్తయ్యిబాతు, అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు, వ రహ్మతుల్లాహి వ బరకాతుహు, అస్సలాము అలైనా వ అలా ఇబాదిల్లాహిస్సాలిహీన్, అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు, వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహు. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్.
ఆ తరువాత తన ప్రభువుతో ఇహపరలోకాలలో ప్రయోజనం చేకూర్చేలా తనకు ఇష్టమైన దుఆ చేసుకోవలెను,
- ఆ తరువాత అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహ్ అని పలుకుతూ కుడివైపు తల త్రిప్పవలెను. ఆ తరువాత అలాగే పలుకుతూ ఎడమవైపు కూడా తల త్రిప్పవలెను.
- ఒకవేళ మూడు లేదా నాలుగు రకాతుల నమాజు చేస్తున్నట్లయితే, మొదటి తషహ్హుద్ లో అష్ హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు వద్ద ఆపి వేయవలెను.
- ఆ తరువాత అల్లాహు అక్బర్ అని పలుకుతూ, రెండు చేతులు మరలా ఖిబ్లా వైపు భుజాల వరకు ఎత్తి, మూడవ రకాతు కొరకు లేచి నిలబడ వలెను.
- ఆ తరువాత రెండవ రకాతు చేసినట్లుగానే మూడవ రకాతులో చేయవలెను. అయితే, సూరతుల్ ఫాతిహా పఠనం తరువాత ఖుర్ఆన్ లోని మరోభాగం పఠించనవసరం లేదు.
- మొదటి తషహ్హుద్ లో కూర్చున్నట్లుగానే ఎడమ పాదం మీద కూర్చొని; కుడి పాదం నిటారుగా ఉంచి లేదా కుడికాలి క్రింద ఎడమ కాలు వాలుగా తీసుకు వచ్చి, ఎడమ పిరుదుపై కూర్చుని; కుడి చేతిని తొడ అంచున, మోకాలికి కొంచెం పైన ఉంచి; చిన్న మరియు ఉంగరపు వేళ్లను బిగించి, చూపుడు వేలును పైకెత్తి, దుఆ చేసేటప్పుడు దానిని కదిలిస్తూ. ; వృత్తాకారంగా చేయడానికి మధ్య వేలు యొక్క కొనతో బొటనవేలు యొక్క కొనను కలపి; ఎడమ చేతిని, వేళ్లు విస్తరించి, తొడ అంచున, మోకాలి పైన ఉంచి ప్రశంతంగా కూర్చోవలెను. (గమనిక: ఒకవేళ నాలుగు రకాతుల సలాహ్ చేస్తున్నట్లయితే, మూడవ రకాతులో కూర్చోకుండా, లేచి నిలబడి రెండవ రకాతు పూర్తి చేసినట్లుగానే నాలగవ రకాతు పూర్తి చేసి, రెండవ సజ్దా తరువాత కూర్చుని తషహ్హుద్ లోని రెండవ భాగాన్ని పఠించి, సలాము పలుకుతూ నమాజును పూర్తి చేయవలెను.)
- అలా ప్రశాంతంగా కూర్చుని, తషహ్హుద్ లో మిగిలిన భాగాన్ని పూర్తి చేయవలెను.
జవాబు: మూడు సార్లు అస్'తగ్'ఫిరుల్లాహ్ (ఓ అల్లాహ్ నన్ను క్షమించు) అని పలకాలి.
అల్లాహుమ్మ అంత'స్సలాము, వ మిన్'కస్సలాము. తబారక్'త యా జల్'జలాలి వల్'ఇక్రామ్ (ఓ అల్లాహ్ నీవు శాంతి ప్రధాతవు, నీ వద్ద నుండే శాంతి ప్రాప్తిస్తుంది. ఓ వైభవోపేత, గౌరవోన్నతుడా సకల శుభాలు కలవాడవు నీవే).
లా ఇలాహ ఇల్లల్లాహు వహ్'దహు లా షరీకలహు, లహుల్ ముల్కు వలహుల్'హమ్'దు, వహువ అలా కుల్లి షైయిన్ ఖదీర్. అల్లాహుమ్మ లా మానిఅ లిమా ఆతైత, వలా ము'అ'తియ లిమా మనఆత, వలా యన్'ఫఉ జల్ జద్ది మిన్'కల్ జద్. (అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవడూ లేడు. ఆయన ఒక్కడే, ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరు. రాజ్యాధికారము ఆయనదే. సర్వస్తోత్రములు ఆయనకే చెల్లును,ఆయనే అన్నింటిపై అధికారం కలవాడు). (మూడు సార్లు)
లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీకలహు, లహుల్ ముల్'కు వ లహుల్ హమ్'దు, వహువ అలా కుల్లి షైయిన్ ఖదీర్. లాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్, వలా న'ఆబుదు ఇల్లాహ్ ఇయ్యాహు, లహున్నేమతు వలహుల్ ఫద్'ల్, వ లహుస్సనాఉల్ హసన్, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముఖ్లిసీన లహుద్దీన వ లౌ కరిహల్ కాఫిరూన్. (అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవడూ లేడు. ఆయన ఒక్కడే. ఆయనకు భాగస్వాములు ఎవ్వరూ లేరు. రాజ్యాధికారము ఆయనదే. సర్వ స్తోత్రములు ఆయనకే చెల్లును. ఆయనే అన్నింటిపై అధికారం కలవాడు. అల్లాహ్ ప్రసాదించిన శక్తి సామర్థ్యాలు తప్ప మరేది లేదు. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఆయన్ని తప్ప మరెవరినీ ఆరాధించము. అనుగ్రహాలు ఆయనవే. కృపావరములు ఆయనవే. మంచి పొగడ్తలు ఆయనకే సొంతం. ఆయన తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవడూ లేడు. చిత్తశుద్ధితో మా ఆరాధనలను ఆయనకే అంకితం చేస్తాము. తిరస్కారులకు అది ఎంతగా సహించరానిదైనా సరే).
సుబహానుల్లాహ్ అని ముప్పై మూడు సార్లు పఠించాలి.
అల్హమ్దులిల్లాహ్ అని ముప్పై మూడు సార్లు పఠించాలి.
అల్లాహు అక్బర్ ముప్పై మూడు సార్లు పఠించాలి.
చివరిగా దీనిని ముగిస్తూ, ఇలా పలుక వలెను:
లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీకలహు లుహుల్ ముల్'కు వ లహుల్ హమ్'దు వహుల అలా కుల్లి షైయిన్ ఖదీర్. (అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవడూ లేడు. ఆయన ఒక్కడే. ఆయనకు భాగస్వాములు ఎవ్వరూ లేరు. రాజ్యాధికారము ఆయనదే, సర్వస్తోత్రాలన్ని ఆయనకే చెందుతాయి. ఆయనే అన్నింటిపై అధికారం కలవాడు).
ఆ తరువాత ఫజ్ర్ మరియు మగ్రిబ్ నమాజులలో సూరతుల్ ఇఖ్లాస్ (112వ సూరహ్) మూడు సార్లు, సూరతుల్ ఫలఖ్ మూడు సార్లు (113వ సూరహ్) మరియు సూరతున్నాస్ మూడు సార్లు (114వ సూరహ్) పఠించ వలెను. మిగతా నమాజులలో ఒక్కొక్కసారి పఠించవలెను.
ఆ తరువాత ఒకసారి ఆయతుల్ కుర్సీ (2:255) పఠించ వలెను.
జవాబు: ఫజ్ర్ నమాజు కంటే ముందు రెండు రకాతులు
జుహర్ నమాజుకు ముందు నాలుగు రకాతులు (రెండు రెండు రకాతుల చొప్పున)
జుహర్ నమాజ్ తరువాత రెండు రకాతులు
మగ్రిబ్ నమాజ్ తరువాత రెండు రకాతులు
ఇషా నమాజ్ తరువాత రెండు రకాతులు
వాటి ఘనత : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
ఎవరైతే రాత్రింబవళ్ళలో పన్నెండు రకాతులు నమాజ్ చేస్తారో, వారి కోసం అల్లాహ్ స్వర్గంలో ఒక ఇల్లు నిర్మిస్తాడు.
ముస్లిం, అహ్మద్, ఇంకా ఇతర హదీసు గ్రంధాలు ఉల్లేఖించాయి.
జవాబు: వారం రోజులలో శుక్రవారం రోజు ఉత్తమమైనది. నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
మీ దినాలలో అత్యంత శ్రేష్ఠమైన దినం శుక్రవారం; ఆ దినముననే ఆదమ్ సృష్టించబడ్డాడు, ఆ దినముననే అతను మరణించాడు, ఆ దినముననే చివరి (ప్రళయ) శంఖం ఊదబడుతుంది, ఆ దినముననే (ప్రళయ) ఆర్తనాదాలు వినబడతాయి. కాబట్టి ఆ దినము నాపై మరింత ఎక్కువగా దరూద్ పంపండి, ఎందుకంటే మీ దరూద్ లు నాకు సమర్పించబడతాయి.
దానికి ప్రజలు ఇలా అడిగారు: ఓ రసూలుల్లాహ్, మీ భౌతిక శరీరం కుళ్ళిపోయిన తరువాత కూడా మా దరూద్ లు మీకు ఎలా చేరతాయి? అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా జవాబిచ్చారు:
నిశ్చయంగా మహోన్నతుడైన అల్లాహ్ ప్రవక్తల శరీరాలు కుళ్ళకుండా భూమిని నిషేధించాడు.
అబూ దావూద్, ఇంకా తదితరులు ఉల్లేఖించారు.
జవాబు: ఇది యుక్తవయస్సుకు చేరిన, మతిస్థిమితం కలిగిఉన్న, స్థిరంగా ఒకచోట నివాసం ఉంటున్న ప్రతి ముస్లిం పురుషుడిపై తప్పనిసరి వ్యక్తిగత విధి.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
{ఓ విశ్వాసులారా! శుక్రవారం (జుముఅహ్) రోజు నమాజ్ కొరకు పిలుపు ఇవ్వబడినప్పుడు, మీరు మీ వ్యాపారాలను విడిచి అల్లాహ్ స్మరణ వైపునకు పరుగెత్తండి. మీరు తెలుసుకోగలిగితే అది మీకు ఎంతో ఉత్తమమమైనది.}
[జుమ్అహ్ : 9]
జవాబు: సరైన షరయీ కారణం లేకుండా జుముఅహ్ సలాహ్ కు (నమాజుకు) హాజరుకాకుండా ఉండేందుకు అనుమతి లేదు. దీని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు,
ఎవరైనా నిర్లక్ష్యంతో వరుసగా మూడు జుముఅహ్ నమాజులు గైరుహాజరు అయితే, అల్లాహ్ అతని హృదయంపై ముద్ర వేస్తాడు.
అబూ దావూద్, ఇంకా తదితరులు ఉల్లేఖించారు.
జవాబు :1.గుసుల్ చేయటం.
నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనాలు:
“యుక్తవయస్కుడైన ప్రతి ముస్లిం పురుషునిపై శుక్రవారం నాడు గుసుల్ చేయుట (తల స్నానం చేయుట) విధి.
దీనిని బుఖారీ ఉల్లేఖించారు.
- సుగంద ద్రవాలు పూసుకోవడం.
హదీసు:
ముస్లింలపై శుక్రవారం రోజు స్నానం చేయడం హక్కుగా ఉంది. వారిలో ప్రతి ఒకరు తన కుటుంబం నుండి సుగంధ ద్రవ్యాన్ని పూసుకోవాలి."
అహ్మద్ మరియు అత్తిర్మిజి దీనిని ఉల్లేఖించారు.
- మంచి దుస్తులు ధరించడం.
"మీలో ఎవరికైనా స్థోమత ఉంటే, జుముఅహ్ రోజు కోసం వారి రోజు వారీ పనికోసం ఉపయోగించే దుస్తులను తప్పించి రెండు ప్రత్యేక వస్త్రాలను ఏర్పాటు చేసుకోవటం మంచిది."
దీనిని ఇబ్నె మాజ మరియు మాలిక్ ముఅత్తాలో ఉల్లేఖించారు.
- ముందుగానే మస్జిదుకు వెళ్ళడం.
- మస్జిదుకు కాలినడకన వెళ్ళడం.
"జుమా రోజు స్నానం చేసినవాడు, శుభ్రపరిచినవాడు, తొందరగా వెళ్లినవాడు, మొదటగా చేరుకున్నవాడు, సమీపంగా కూర్చున్నవాడు, నిశ్శబ్దంగా ఉన్నవాడు, శ్రద్ధగా విన్నవాడు, అతనికి ప్రతి అడుగుకు ఏడాది రోజుల ఉపవాసం మరియు ఎడాది రాత్రుల ప్రార్థనల పుణ్యం లభిస్తుంది."
దీనిని తిర్మిజీ మరియు నసాయీ ఉల్లేఖించారు.
- దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై దరూద్ అధికంగా పఠించడం.
ఆయన అలైహిస్సలాతు వస్సలాం ఇలా తెలియ చేశారు:
"జుముఅహ్ రోజున నా మీద అధికంగా దురూద్ పంపండి, ఎందుకంటే ఆ రోజు హాజరు చేయబడును.అందులో దైవదూతలు హాజరు అవుతారు. ఎవ్వరైనా నా మీద దురూద్ పంపినప్పుడు, అది పూర్తయ్యే వరకు ఆ దురూద్ నా వద్ద ప్రదర్శించబడుతుంది."
దీనిని ఇబ్నె మాజ ఉల్లేఖించారు
- సూరతుల్ కహఫ్ పారాయణం
"జుముఅహ్ రోజున ఎవరు సూరతుల్-కహఫ్ చదివితే, రెండు జుమా రోజుల మధ్య వారికి ఒక కాంతి వెలుగుతుంది."
హాకిమ్ మరియు ఇతరులు దీనిని ఉల్లేఖించారు.
- దుఆలు ఎక్కువగా ఆమోదించబడే అవకాశం ఉన్న ఘడియను అన్వేషించడం (ఆ ఘడియ దుఆలలో గడపడం).
"అబూ హురైరా రజియల్లాహు అన్హు నుండి,దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జుమా రోజు గురించి పేర్కొంటూ ఇలా అన్నారు:
ఆ రోజులో ఒక ఘడియ ఉంది. ఏ ముస్లిం దాసుడయినా ఆ ఘడియను పొంది, ఆ సమయంలో అతను నిలబడి నమాజు చేస్తూ అల్లాహ్ ని ఏదయినా అడిగితే అల్లాహ్ తప్పకుండా ఇస్తాడు.
ముత్తఫఖున్ అలైహి
జవాబు: మనస్సును, శరీరాన్ని స్థిమితంగా, ప్రశాంతంగా హాజరు పరచి, పూర్తి ఏకాగ్రతతో, అణుకువ, వినమ్రతతో, విధేయతతో (బయటి ప్రపంచాన్ని మరచి) నమాజులో లీనమై పోవడం.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
{వాస్తవానికి విశ్వాసులు సాఫల్యం పొందుతారు;1
వారే! ఎవరైతే తమ సలాహ్ లో ఖుషు (వినమ్రత) పాటిస్తారో!2}
[అల్ ముమినూన్ :1 - 2]
జవాబు: ఇది ఒక నిర్దిష్ట రకమైన ఆస్తిపై, ఒక నిర్దిష్ట సమయంలో, నిర్దిష్ట వ్యక్తులకు ఇవ్వబడే ఆర్థిక హక్కు.
ఇది ఇస్లాం యొక్క మూలస్తంభాలలో ఒకటి మరియు తప్పనిసరిగా ధనవంతుల నుండి తీసుకోబడి, పేదలకు అందించబడే విధి దానం.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
{మరియు మీరు జకాత్ చెల్లించండి}.
[అల్ బఖర: 50]
జవాబు: ఉపవాసం పాటించాలనే సంకల్పంతో, తెల్లవారుజాము నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసాన్ని నిర్వీర్యం చేసే వాటన్నింటి నుండి దూరంగా ఉండటం ద్వారా అల్లాహ్ ను ఆరాధించడం. ఇది రెండు రకాలు:
- సియాము వాజిబ్ అంటే విధిగావించబడిన తప్పనిసరి ఉపవాసాలు: ఇస్లాం యొక్క మూలస్థంభాలలో ఒకటైన రమజాన్ నెల ఉపవాసాల వంటివి.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
{ఓ విశ్వాసులారా! ఉపవాసం మీకు విధిగా నిర్ణయించబడింది, ఏ విధంగానైతే మీ పూర్వికులకు విధిగా నిర్ణయించబడి ఉండెనో బహుశా మీరు దైవభీతిపరులై ఉంటారని!}
[అల్ బఖర: 50]
2. స్వచ్ఛంద ఉపవాసం: సోమవారం మరియు గురువారాల్లో ఉపవాసం; ప్రతి నెలా మూడు రోజుల ఉపవాసం, వీటిలో ఉత్తమమైనవి ప్రతి చంద్రమాన నెలలో తెల్లటి దినాల ఉపవాసాలు (13, 14, 15) మొదలైన తప్పనిసరి విధిగావించ బడని ఉపవాసాలు.