Skip to content
సూరాల జాబితా /

النَّحل

النَّحل is chapter 16 of the Quran and has 128 verses. This page presents it in full in the Uthmani script, with a verse-by-verse translation of its meaning.

128 ఆయతులు సూరా సంఖ్య 16
ఆయత్‌కు వెళ్ళండి
తెలుగు · Muhammad
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

أَتَىٰٓ أَمۡرُ ٱللَّهِ فَلَا تَسۡتَعۡجِلُوهُۚ سُبۡحَٰنَهُۥ وَتَعَٰلَىٰ عَمَّا يُشۡرِكُونَ

అల్లాహ్ ఆజ్ఞ (తీర్పు) వచ్చింది! కావున మీరు దాని కొరకు తొందర పెట్టకండి. ఆయన సర్వలోపాలకు అతీతుడు మరియు వారు సాటి కల్పించే భాగస్వాములకు అత్యున్నతుడు.

يُنَزِّلُ ٱلۡمَلَٰٓئِكَةَ بِٱلرُّوحِ مِنۡ أَمۡرِهِۦ عَلَىٰ مَن يَشَآءُ مِنۡ عِبَادِهِۦٓ أَنۡ أَنذِرُوٓاْ أَنَّهُۥ لَآ إِلَٰهَ إِلَّآ أَنَا۠ فَٱتَّقُونِ

ఆయనే తన ఆజ్ఞతో, దేవదూతల ద్వారా, దివ్యజ్ఞానాన్ని (రూహ్ ను) తాను కోరిన, తన దాసులపై అవతరింపజేస్తాడు, వారిని (ప్రజలను) ఇలా హెచ్చరించటానికి: "నిశ్చయంగా, నేను తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు! కావున మీరు నాయందే భయభక్తులు కలిగి ఉండండి!"

Explanation & meanings · 2
  1. అర్ - రూ'హు: అంటే ఇక్కడ దివ్యజ్ఞానం (వ'హీ) అని అర్థం. చూడండి, 40:15, 42:52. అక్కడ కూడా రూ'హ్ అర్థం వ'హీ అని ఉంది. మూడు చోట్లలో ఖుర్ఆన్ లో రూ'హ్, జిబ్రీల్ ('అ.స.) అనే అర్థంతో కూడా వాడబడింది. 19:17, 97.4. వివరాలకు చూడండి, 19:17 వ్యాఖ్యానం 3.
  2. తన సందేశాన్ని ఎవరిపై అవతరింపజేయాలో అల్లాహ్ (సు.తా.) కు బాగా తెలుసు. చూడండి, 6:124 మరియు 40:15.

خَلَقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ بِٱلۡحَقِّۚ تَعَٰلَىٰ عَمَّا يُشۡرِكُونَ

ఆయన ఆకాశాలను మరియు భూమిని సత్యంతో సృష్టించాడు. వారు, ఆయనకు సాటి కల్పించే భాగస్వాముల (షరీక్ ల) కంటే ఆయన అత్యున్నతుడు.

Explanation & meanings · 1
  1. చూడండి, 10:5.

خَلَقَ ٱلۡإِنسَٰنَ مِن نُّطۡفَةٖ فَإِذَا هُوَ خَصِيمٞ مُّبِينٞ

ఆయన మానవుణ్ణి ఇంద్రియ (వీర్య) బిందువుతో సృష్టించాడు, తరువాత ఆ వ్యక్తియే ఒక బహిరంగ వివాదిగా మారిపోతాడు.

وَٱلۡأَنۡعَٰمَ خَلَقَهَاۖ لَكُمۡ فِيهَا دِفۡءٞ وَمَنَٰفِعُ وَمِنۡهَا تَأۡكُلُونَ

మరియు ఆయన పశువులను సృష్టించాడు. వాటిలో మీ కొరకు వెచ్చని దుస్తులు మరియు అనేక లాభాలు కూడా ఉన్నాయి. మరియు వాటిలో నుండి (కొన్నిటి మాంసం) మీరు తింటారు.