16 : 25
لِيَحۡمِلُوٓاْ أَوۡزَارَهُمۡ كَامِلَةٗ يَوۡمَ ٱلۡقِيَٰمَةِ وَمِنۡ أَوۡزَارِ ٱلَّذِينَ يُضِلُّونَهُم بِغَيۡرِ عِلۡمٍۗ أَلَا سَآءَ مَا يَزِرُونَ
కావున పునరుత్థాన దినమున వారు తమ (పాపాల) భారాలను పూర్తిగా మరియు తాము మార్గం తప్పించిన అజ్ఞానుల భారాలలోని కొంతభాగాన్ని కూడా మోస్తారు. వారు మోసే భారం ఎంత దుర్భరమైనదో చూడండి!
Explanation & meanings · 1
- దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: 'ఎవరైతే ప్రజలను సన్మార్గం వైపునకు పిలుస్తారో, వారికి వారందరి పుణ్యఫలితం లభిస్తుంది. ఎవరైతే ప్రజలను దుర్మార్గం వైపునకు పిలుస్తారో, వారు వారందరి పాపభారాలను కూడా మోస్తారు.' (అబూ-దావూద్, కితాబ్ సున్నహ్, బాబ్ ల'జూమ్ అస్సున్నహ్).