Skip to content
సూరాల జాబితా /

الحِجر

الحِجر is chapter 15 of the Quran and has 99 verses. This page presents it in full in the Uthmani script, with a verse-by-verse translation of its meaning.

99 ఆయతులు సూరా సంఖ్య 15
ఆయత్‌కు వెళ్ళండి
తెలుగు · Muhammad
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

الٓرۚ تِلۡكَ ءَايَٰتُ ٱلۡكِتَٰبِ وَقُرۡءَانٖ مُّبِينٖ

అలిఫ్ - లామ్ - రా. ఇవి దివ్యగ్రంథ ఆయత్ లు మరియు (ఇది) ఒక స్పష్టమైన ఖుర్ఆన్.

Explanation & meanings · 2
  1. సూరతుల్ బఖరహ్ లోని మొదటి ఆయతు యొక్క ఫుట్‌నోట్ చూడండి. '
  2. చూడండి, 5:15.

رُّبَمَا يَوَدُّ ٱلَّذِينَ كَفَرُواْ لَوۡ كَانُواْ مُسۡلِمِينَ

సత్యతిరస్కారులు: "మేము అల్లాహ్ కు విధేయులమైతే (ముస్లింలమైతే) ఎంత బాగుండేది!" అని (పునరుత్థాన దినమున), పలుమార్లు కోరుకుంటారు.

ذَرۡهُمۡ يَأۡكُلُواْ وَيَتَمَتَّعُواْ وَيُلۡهِهِمُ ٱلۡأَمَلُۖ فَسَوۡفَ يَعۡلَمُونَ

వారిని తింటూ (త్రాగుతూ) సుఖసంతోషాలను అనుభవిస్తూ (వృథా) ఆశలలో ఉండటానికి విడిచిపెట్టు. తరువాత వారు (సత్యాన్ని) తెలుసుకుంటారు.

وَمَآ أَهۡلَكۡنَا مِن قَرۡيَةٍ إِلَّا وَلَهَا كِتَابٞ مَّعۡلُومٞ

మరియు (దాని వ్యవధి) నిర్ణయించి వ్రాయబడి ఉండనిదే, మేము ఏ నగరాన్నీ కూడా నాశనం చేయలేదు.

Explanation & meanings · 1
  1. ఇంకా చూడండి, 26:208 మరియు 6:131.

مَّا تَسۡبِقُ مِنۡ أُمَّةٍ أَجَلَهَا وَمَا يَسۡتَـٔۡخِرُونَ

ఏ సమాజం కూడా తన నిర్ణీత గడువుకు, ముందు గానీ మరియు వెనుక గానీ కాజాలదు.

Explanation & meanings · 1
  1. చూడండి, 7:34. ఏ నగరం కూడా దాని సత్యతిరస్కారం మరియు అత్యాచారాలకు వెంటనే నాశనం చేయబడలేదు. దానికి ఒక వ్యవధి, నియమిత కాలం అల్లాహుతా'ఆలా తరఫు నుండి ఇవ్వబడుతోంది. ఇక ఆ నియమిత కాలం వచ్చిన తరువాత వారు దాని నుండి వెనుకా ముందు కాలేరు అంటే ఒక్క క్షణం కూడా వ్యవధి పొందలేరు.