16 : 93
وَلَوۡ شَآءَ ٱللَّهُ لَجَعَلَكُمۡ أُمَّةٗ وَٰحِدَةٗ وَلَٰكِن يُضِلُّ مَن يَشَآءُ وَيَهۡدِي مَن يَشَآءُۚ وَلَتُسۡـَٔلُنَّ عَمَّا كُنتُمۡ تَعۡمَلُونَ
ఒకవేళ అల్లాహ్ కోరితే మిమ్మల్ని అందరినీ ఒకే సమాజంగా చేసి ఉండేవాడు. కాని ఆయన తాను కోరిన వారిని మార్గభ్రష్టత్వానికి గురి చేస్తాడు. మరియు తాను కోరిన వారికి సన్మార్గం చూపుతాడు. మరియు నిశ్చయంగా, మీరు చేస్తున్న కర్మలను గురించి మీరు తప్పక ప్రశ్నించబడతారు.
Explanation & meanings · 1
- చూడండి, 14:4 మరియు 2:26-27. అల్లాహుతా'ఆలాకు ప్రతివాని భవిష్యత్తు తెలుసు. కాబట్టి ఎవడైతే సన్మార్గానికి రాడని ఆయనకు తెలుసో అలాంటి వాడిని, మార్గభ్రష్టత్వంలో వదలి పెడతాడే కానీ, ఎవ్వడిని కూడా బలవంతంగా తప్పు దారిలో వేయడని దీని అర్థం.