16 : 43
وَمَآ أَرۡسَلۡنَا مِن قَبۡلِكَ إِلَّا رِجَالٗا نُّوحِيٓ إِلَيۡهِمۡۖ فَسۡـَٔلُوٓاْ أَهۡلَ ٱلذِّكۡرِ إِن كُنتُمۡ لَا تَعۡلَمُونَ
మరియు (ఓ ముహమ్మద్!) నీకు పూర్వం కూడా మేము పంపిన ప్రవక్తలందరూ పురుషులే (మానవులే)! మేము వారిపై దివ్యజ్ఞానాన్ని (వహీని) అవతరింపజేశాము. కావున ఇది మీకు తెలియకపోతే పూర్వ గ్రంథ ప్రజలను అడగండి.
Explanation & meanings · 1
- ఇక్కడ విశదమయ్యేదేమిటంటే ప్రతి సమాజంలో దైవప్రవక్త ('అ.స.)లు పంపబడ్డారు. వారందరూ మానవులే. అయితే ము'హమ్మద్ ('స'అస) మానవుడైతే ఇందులో ఆశ్చర్యమేముంది. ఏ ప్రవక్తకు కూడా అగోచర జ్ఞానం లేదు. మీకు తెలియనిచో పూర్వగ్రంథ ప్రజలను అడగండి. వారి ప్రవక్తలు కూడా మానవులే. ఇంకా చూడండి, 6:50, 7:188, 11:31.