Skip to content
النَّحل /

ఆయత్ 103

16 : 103
النَّحل ఆయతులు 128
సూరా · النَّحل
తెలుగు · Muhammad
16 : 103

وَلَقَدۡ نَعۡلَمُ أَنَّهُمۡ يَقُولُونَ إِنَّمَا يُعَلِّمُهُۥ بَشَرٞۗ لِّسَانُ ٱلَّذِي يُلۡحِدُونَ إِلَيۡهِ أَعۡجَمِيّٞ وَهَٰذَا لِسَانٌ عَرَبِيّٞ مُّبِينٌ

మరియు: "నిశ్చయంగా, ఇతనికి ఒక మనిషి నేర్పుతున్నాడు." అని, వారు అనే విషయం మాకు బాగా తెలుసు. వారు సూచించే (అపార్థం చేసే) వ్యక్తి భాష పరాయి భాష. కాని ఈ (ఖుర్ఆన్) భాష స్వచ్ఛమైన అరబ్బీ భాష.

Explanation & meanings · 2
  1. కొందరు బానిస యూదులు మరియు క్రైస్తవులు ముస్లింలు అయ్యారు. వారికి కొంత బైబిల్ జ్ఞానముండెను. మక్కా ముష్రిక్ లు అనే వారు: 'వారి నుండియే ము'హమ్మద్ ('స'అస) ఖుర్ఆన్ నేర్చుకున్నారు.' అని.
  2. దానికి అల్లాహ్ (సు.తా.) అంటున్నాడు: 'వారి 'అరబ్బీ భాషైతే స్వచ్ఛమైనది కాదు మరియు ఈ ఖుర్ఆన్ స్వచ్ఛమైన 'అరబ్బీ భాషలో ఉంది.' అని.