Skip to content
సూరాల జాబితా /

الإسرَاء

الإسرَاء is chapter 17 of the Quran and has 111 verses. This page presents it in full in the Uthmani script, with a verse-by-verse translation of its meaning.

111 ఆయతులు సూరా సంఖ్య 17
ఆయత్‌కు వెళ్ళండి
తెలుగు · Muhammad
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

سُبۡحَٰنَ ٱلَّذِيٓ أَسۡرَىٰ بِعَبۡدِهِۦ لَيۡلٗا مِّنَ ٱلۡمَسۡجِدِ ٱلۡحَرَامِ إِلَى ٱلۡمَسۡجِدِ ٱلۡأَقۡصَا ٱلَّذِي بَٰرَكۡنَا حَوۡلَهُۥ لِنُرِيَهُۥ مِنۡ ءَايَٰتِنَآۚ إِنَّهُۥ هُوَ ٱلسَّمِيعُ ٱلۡبَصِيرُ

తన దాసుణ్ణి (ముహమ్మద్ ను), మస్జిద్ అల్ హరామ్ (మక్కా ముకర్రమా) నుండి పరిసరాలను శుభవంతం చేసిన మస్జిద్ అల్ అఖ్సా (బైతుల్ మఖ్దిస్) వరకు రాత్రి వేళ తీసుకు పోయిన ఆయన (అల్లాహ్) సర్వ లోపాలకు అతీతుడు. ఇది మేము అతనికి మా కొన్ని నిదర్శనాలను (ఆయాత్ లను) చూపటానికి చేశాము. నిశ్చయంగా, ఆయన సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు.

Explanation & meanings · 1
  1. 'ఈ ప్రయాణాన్ని మేము మా దాసునికి కొన్ని అద్భుత నిదర్శనాలు, సంకేతాలను చూపటానికి చేయించాము.' ఇంత దూరప్రయాణం రాత్రిపూట స్వల్పకాలంలో పూర్తి చేయించడం కూడా ఒక అద్భుత సూచనయే. ఈ ప్రయాణం రెండు భాగాలలో ఉంది. (1) మొదటి భాగం : ఇస్రా' జిబ్రీల్ ('అ.స.) తెచ్చిన బుర్రాఖ్ పై ఎక్కి అతనితో బాటు, మక్కా ముకర్రమా నుండి బైతుల్-మఖ్దిస్ కు రాత్రిపూట పయనించడం, అక్కడ మహాప్రవక్త ('స'అస) సర్వదైవప్రవక్తలకు ('అలైహిమ్ స.) ఇమాముగా నిలిచి నమా'జ్ చేయించడం. (2) రెండో భాగం మే'రాజ్ : అంటే పైకి ఎక్కించబడటం, లేక పైకి తీసుకొని పోబడటం. బైతుల్-మఖ్దిస్ నుండి ఆకాశాలలోనికి, చివరకు సిద్రతుల్ ముంతహా వరకు పోయిన ప్రయామం. అది 'అర్ష్ క్రింది ఏడవ ఆకాశంపై ఉంది. అక్కడ అతనికి ('స'అస) అల్లాహుతా'ఆలా వ'హీ ద్వారా నమా'జ్ మరియు ఇతర ఆదేశాలు ఇచ్చాడు. ఆ విషయాలు 'స'హీ'హ్ 'హదీస్ లలో పేర్కొనబడ్డాయి. మే'రాజ్ గురించి కొంతవరకు సూరహ్ అన్-నజ్మ్ (53) లో కూడ ఉంది. మే'రాజ్ సమయంలో దైవప్రవక్త ('స'అస), ఆకాశాలలో ఇతర ప్రవక్తలతో కలుసుకున్నారు. ఈ ప్రయాణం దైవప్రవక్త పూర్తి చేసింది కలలో కాదు. అతను శారీరకంగా మేల్కొని ఉండి, పూర్తి స్పృహలో ఉన్న స్థితిలో (Bodily, Fully awake and with Full Consciousness and orientation of Mind) చేశారు. ఈ ప్రయాణం అల్లాహుతా'ఆలా ఆజ్ఞతో జరిగింది. అల్లాహ్ (సు.తా.) తాను కోరినది చేస్తాడు. ఇది జరిగిన కాలం మరియు తేదీలలో భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు రబీ'అ అల్ అవ్వల్ 17 లేక 27వ తేదీలలో అని, మరి కొందరు రజబ్ 27 అని, మరి కొందరు ఇతర నెలలని కూడా అంటారు. (ఫ'త్హ్ అల్-ఖదీర్).

وَءَاتَيۡنَا مُوسَى ٱلۡكِتَٰبَ وَجَعَلۡنَٰهُ هُدٗى لِّبَنِيٓ إِسۡرَٰٓءِيلَ أَلَّا تَتَّخِذُواْ مِن دُونِي وَكِيلٗا

మరియు మేము మూసాకు గ్రంథాన్ని ఇచ్చాము మరియు దానిని ఇస్రాయీల్ సంతతి వారికి మార్గదర్శినిగా చేసి, దాని ద్వారా ఇలా ఆజ్ఞాపించాము: "నన్ను (అల్లాహ్ ను) తప్ప మరెవ్వరినీ సంరక్షకునిగా (కార్యసాధకునిగా) చేసుకోవద్దు.

Explanation & meanings · 1
  1. అల్లాహుతా'ఆలా మూసా ('అ.స.)తో సూటీగా మాట్లాడిన దానికి చూడండి, 4:164, 7:144.

ذُرِّيَّةَ مَنۡ حَمَلۡنَا مَعَ نُوحٍۚ إِنَّهُۥ كَانَ عَبۡدٗا شَكُورٗا

మేము నూహ్ తో బాటు ఓడలో ఎక్కించిన వారి సంతతివారలారా! నిశ్చయంగా అతను (నూహ్) కృతజ్ఞుడైన దాసుడు."

وَقَضَيۡنَآ إِلَىٰ بَنِيٓ إِسۡرَٰٓءِيلَ فِي ٱلۡكِتَٰبِ لَتُفۡسِدُنَّ فِي ٱلۡأَرۡضِ مَرَّتَيۡنِ وَلَتَعۡلُنَّ عُلُوّٗا كَبِيرٗا

మరియు మేము గ్రంథంలో ఇస్రాయీల్ సంతతి వారిని ఇలా హెచ్చరించాము: "మీరు భువిలో రెండు సార్లు సంక్షోభాన్ని రేకెత్తిస్తారు, మరియు గొప్ప అహంకారాన్ని ప్రదర్శిస్తారు!"

فَإِذَا جَآءَ وَعۡدُ أُولَىٰهُمَا بَعَثۡنَا عَلَيۡكُمۡ عِبَادٗا لَّنَآ أُوْلِي بَأۡسٖ شَدِيدٖ فَجَاسُواْ خِلَٰلَ ٱلدِّيَارِۚ وَكَانَ وَعۡدٗا مَّفۡعُولٗا

ఇక ఆ రెంటిలో మొదటి వాగ్దానం రాగా మేము మీపై ఘోర యుద్ధనిపుణులైన మా దాసులను పంపాము. వారు మీ గృహాలలోకి దూసుకెళ్ళారు. మరియు ఈ విధంగా మా వాగ్దానం నెరవేర్చబడింది.

Explanation & meanings · 1
  1. మొదటి శిక్ష దాదాపు క్రీస్తు శ ఆరంభానికి 600 సంవత్సరాలకు ముందు వచ్చింది. ఇది బాబిలోనియన్ పాలకుడు బ'ఖ్త్ న'స్ర్ ఇస్రాయీ'ల్ సంతతి వారిపై జెరూసలంలో చేసిన దౌర్జన్యం. అతడు ఎంతో మంది యూదులను చంపి మిగిలిన వారిని ఖైదీలుగా, బానిసలుగా చేసుకున్నాడు. ఈ శిక్ష వారు దైవప్రవక్తలను చంపినందుకు మరియు తౌరాత్ ఆజ్ఞలను ఉల్లంఘించినందుకు పడింది. కొందరి అభిప్రాయంలో ఈ రాజు జాలూత్. ఆ తరువాత 'తాలూత్ సైన్యాధిపత్యంలో ఉన్న దావూద్ ('అ.స.) జాలూత్ ను సంహరించి వారికి విముక్తి కలిగించారు.