16 : 94
وَلَا تَتَّخِذُوٓاْ أَيۡمَٰنَكُمۡ دَخَلَۢا بَيۡنَكُمۡ فَتَزِلَّ قَدَمُۢ بَعۡدَ ثُبُوتِهَا وَتَذُوقُواْ ٱلسُّوٓءَ بِمَا صَدَدتُّمۡ عَن سَبِيلِ ٱللَّهِ وَلَكُمۡ عَذَابٌ عَظِيمٞ
మరియు మీ ప్రమాణాలను పరస్పరం మోసగించుకోవటానికి ఉపయోగించుకోకండి. అలా చేస్తే స్థిరపడిన పాదాలు జారిపోవచ్చు మరియు మీరు అల్లాహ్ మార్గం నుండి ప్రజలను నిరోధించిన పాప ఫలితాన్ని రుచి చూడగలరు. మరియు మీకు ఘోరమైన శిక్ష పడగలదు.
Explanation & meanings · 1
- ఈ విధంగా ప్రజలు తమ ప్రమాణాలను తెంపుకొని, ఇతరులను మోసగించటానికి పాల్పడితే సమాజంలో ఒకరిపై ఒకరికి ఏ విధమైన విశ్వాసం ఉండదు, అన్యాయం మరియు దౌర్జన్యం నెలకొంటాయి.