Skip to content

ఒక స్త్రీ ఫజ్ర్ సమయం పూర్తి కాగానే బహిష్టు నుండి పరిశుద్ధమైతే (తహారతు పొందితే), ఆ రోజు ఆమె తినడం, త్రాగడం మానేసి ఉపవాసం ఉండాలా? ఆ రోజు ఆమె పాటించే ఉపవాసం చెల్లుతుందా లేక ఆ ఉపవసాన్ని ఆమె మళ్ళీ ఖజా చేయవలసి ఉంటుందా?

السؤال

1వ ప్రశ్న:

ఒక స్త్రీ ఫజ్ర్ సమయం పూర్తి కాగానే బహిష్టు నుండి పరిశుద్ధమైతే (తహారతు పొందితే), ఆ రోజు ఆమె తినడం, త్రాగడం మానేసి ఉపవాసం ఉండాలా? ఆ రోజు ఆమె పాటించే ఉపవాసం చెల్లుతుందా లేక ఆ ఉపవసాన్ని ఆమె మళ్ళీ ఖజా చేయవలసి ఉంటుందా?

س1: إذا طهرت الـمرأة بعد الفجر مباشرةً فهل تمسك وتصوم هذا اليوم، ويكون يومها لها، أو عليها قضاء ذلك اليوم؟

الجواب

జవాబు:

ఒకవేళ స్త్రీ ఫజ్ర్ సమయం పూర్తి కాగానే బహిష్టు నుండి పరిశుద్ధత (తహారతు) పొందినట్లయితే, ఆ రోజు ఆమె ఉపవాసం పాటించే విషయంలో ఇస్లామీయ పండితుల మధ్య రెండు అభిప్రాయాలు ఉన్నాయి:

మొదటి అభిప్రాయం: ఆ రోజు ఆమె అన్నపానీయాలు త్యజించటం తప్పనిసరి. కానీ అది ఉపవాసంగా లెక్కించబడదు, తప్పనిసరిగా ఆ రోజు ఉపవాసాన్ని తిరిగి ఖజా చేయాలి. ఇమాం అహ్మద్ రహిమహుల్లాహ్ గారి ప్రముఖ అభిప్రాయం కూడా ఇదే!

రెండవ అభిప్రాయం: ఆ రోజు అన్నపానీయాలు మానేయాల్సిన అవసరం లేదు. ఆ రోజు పాటించే ఉపవాసం చెల్లదు. ఎందుకంటే ఆ రోజు యొక్క తొలిఝాము (సహరీ సమయం) బహిష్టు అవస్థలోనే గడిచి పోయింది. ఆ సమయాన ఆమె పై ఉపవాసం విధి కాదు. ఆమెపై ఉపవాసం విధి కానప్పుడు అన్నపానీయాలు త్యజించడం వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరదు. మరియు ఆ సమయం ఆమె కోసం పవిత్రతమైనది కూడా కాదు. ఎందుకంటే సహరీ సమయంలో ఆమెపై ఉపవాసం విధి కాలేదు. ఆ అపరిశుద్ధ సమయంలో, ఆమె కొరకు ఉపవాసం నిషేధించబడింది.

షరియతు బద్దమైన ఉపవాసం: సర్వశక్తిసంపన్నుడైన అల్లాహ్ ను ఆరాధించే ఉద్దేశ్యంతో, ఉషోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసభంగకాలకు అతీతంగా ఉండాలి.

కాబట్టి ఈ రెండవ అభిప్రాయం మొదటి దాని కంటే చాలా మెరుగైనది. అయినప్పటికీ పైన ప్రస్తావించబడిన రెండు అబిప్రాయాల వెలుగులో స్త్రీ ఆ రోజు యొక్క ఉపవాసం తప్పనిసరిగా మళ్ళీ ఖజా చేయవలసి ఉంది.

ﺟ1: إذا طهرت المرأة بعد طلوع الفجر فللعلماء في إمساكها ذلك اليوم قولان:

القول الأول: أنه يلزمها الإمساك بقية ذلك اليوم، ولكنه لا يحسب لها، بل يجب عليها القضاء، وهذا هو المشهور من مذهب الإمام أحمد رحمه الله.

والقول الثاني: أنه لا يلزمها أن تمسك بقية ذلك اليوم؛ لأنه يومٌ لا يصحّ صومها فيه؛ لكونها في أوله حائضًا ليست من أهل الصّيام، وإذا لم يصح لم يبق للإمساك فائدةٌ، وهذا الزمن زمنٌ غير محترمٍ بالنّسبة لها؛ لأنها مأمورةٌ بفطره في أول النهار، بل محرمٌ عليها صومه في أول النهار،

والصوم الشرعيّ: هو الإمساك عن المفطّرات تعبّدًا لله عز وجل من طلوع الفجر إلى غروب الشمس.

وهذا القول -كما تراه- أرجح من القول بلزوم الإمساك، وعلى كلا القولين يلزمها قضاء هذا اليوم.