ستون سؤالا في أحكام الحيض والنفاس
*
These files are generated automatically from the book's text; their layout may differ from the printed edition.
*
*
1వ ప్రశ్న:
జవాబు:
2వ ప్రశ్న:
జవాబు:
3వ ప్రశ్న:
జవాబు:
4వ ప్రశ్న:
జవాబు:
5వ ప్రశ్న:
జవాబు:
6వ ప్రశ్న:
జవాబు:
7వ ప్రశ్న:
జవాబు:
8వ ప్రశ్న:
జవాబు:
9వ ప్రశ్న:
జవాబు:
10వ ప్రశ్న:
జవాబు:
11వ ప్రశ్న:
జవాబు:
12 వ ప్రశ్న:
జవాబు:
13వ ప్రశ్న:
జవాబు:
14వ ప్రశ్న:
జవాబు:
15 వ ప్రశ్న:
జవాబు:
16వ ప్రశ్న:
జవాబు:
17వ ప్రశ్న:
జవాబు:
18వ ప్రశ్న:
జవాబు:
19వ ప్రశ్న:
జవాబు:
20వ ప్రశ్న:
జవాబు:
21 వ ప్రశ్న:
జవాబు:
22 వ ప్రశ్న:
జవాబు:
23 వప్రశ్న:
జవాబు:
24వ ప్రశ్న:
జవాబు:
25వ ప్రశ్న:
జవాబు:
26వ ప్రశ్న:
జవాబు:
27 వ ప్రశ్న:
జవాబు:
28 వ ప్రశ్న:
జవాబు:
29వ ప్రశ్న:
జవాబు:
30వ ప్రశ్న:
జవాబు:
31వ ప్రశ్న:
జవాబు:
32వ ప్రశ్న:
జవాబు:
33 వ ప్రశ్న:
జవాబు:
34వ ప్రశ్న:
జవాబు:
35 వ ప్రశ్న:
జవాబు:
36 వ ప్రశ్న:
జవాబు:
37 వ ప్రశ్న:
జవాబు:
38వ ప్రశ్న:
జవాబు:
39 వ ప్రశ్న:
జవాబు:
40 వ ప్రశ్న:
జవాబు:
41 వ ప్రశ్న:
జవాబు:
42 వ ప్రశ్న:
జవాబు:
43 వ ప్రశ్న:
జవాబు:
44 వ ప్రశ్న:
జవాబు:
45వ ప్రశ్న:
జవాబు:
46వ ప్రశ్న:
జవాబు:
47 వ ప్రశ్న:
47వ జవాబు:
ఎందుకంటే అబూబకర్ రదియల్లాహ్ అన్హు భార్య అస్మా బింతు ఉమైస్ దుల్ హులైఫా లో నిఫాసు పురుటి ముట్టుతో ఉండి ఈ విషయమై భాధపడినప్పుడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఆదేశించారు: గుసుల్ చేసుకోవాలి, మర్మాంగంపై వస్త్రాన్ని కట్టుకోవాలి, శుభ్రత పొందనంతవరకు ఇహ్రాం పైనే ఉండాలి. తరువాత అల్లాహ్ గృహపు ప్రదక్షిణ మరియు సఫా మర్వాల సయీ చేయాలి.
48 వ ప్రశ్న:
జవాబు:
49వ ప్రశ్న:
జవాబు:
50వ ప్రశ్న:
జవాబు:
51 వ ప్రశ్న:
జవాబు:
52 వ ప్రశ్న:
జవాబు:
53వ ప్రశ్న:
జవాబు:
54 వ ప్రశ్న:
జవాబు:
55 వ ప్రశ్న:
జవాబు:
56 వ ప్రశ్న:
జవాబు:
57వ ప్రశ్న:
జవాబు:
58వ ప్రశ్న:
జవాబు:
59వ ప్రశ్న:
జవాబు:
60వ ప్రశ్న:
జవాబు:
ఎందుకంటే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బహిష్టులో ఉన్న స్త్రీకు బైతుల్లాహ్ యొక్క తవాఫు చేయకూడదని నిరోధించారు మరియు ఈ విషయంలో పురుటి ముట్టులో ఉన్న స్త్రీకు కూడా బహిష్టులో ఉన్న స్త్రీ యొక్క ఆదేశమే వర్తిస్తుంది.
[1]الخمرة: సలాహ్ చేసే సజ్జాదహ్. దీనిని 'ఖమ్ర' అని పిలుస్తారు. ఎందుకంటే ఇది ముఖాన్ని కప్పివేస్తుంది.
బహిష్టు మరియు పురుటి ఆదేశములకు సంబంధించిన అరవై ప్రశ్నలు.
*
అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో,
ముందుమాట
అల్హందులిల్లాహి వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ ముహమ్మద్ బిన్ అబ్దిల్లాహ్ వ ఆలిహి వ అస్'హాబిహి వమన్ సార అలా దర్బీహీ ఇలా యౌమిద్దీన్, వ'బాదు: సకల ప్రశంసలు, కృతజ్ఞతలు అల్లాహ్ కే శోభిస్తాయి. అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, ఆయన కుటుంబీకులపై, ఆయన సహచరులపై మరియు అంతిమదినం వరకు సన్మార్గంలో నడిచే ఉత్తములపై అల్లాహ్ యొక్క శాంతి, కృప కురుయు గాక!
నా ఇస్లామీయ సోదరీమణులారా!
ఆరాధన విషయంలో బహిష్టుకు సంబంధించిన ఆదేశాల, నియమాల గురించి ఇస్లామీయ పండితుల వద్దకు అత్యధికంగా వచ్చే ప్రశ్నలను దృష్టిలో ఉంచుకుని, తరచుగా పునరావృతమయ్యే ప్రశ్నలను విపులంగా కాకుండా సంక్షిప్తంగా సమీకరించాలని మేము భావించాము.
నా ఇస్లామీయ సోదరీమణులారా!
ఈ పుస్తకం అనునిత్యం మీ చేతిలో ఉండేలా ఈ ప్రశ్నల సేకరణ మరియు అమరిక పై మేము చాలా శ్రద్ద చూపాము. ఎందుకంటే దైవిక చట్టమైన ఈ షరియతు యొక్క ఫిఖ్ జ్ఞానానికి చాలా ప్రాధాన్యత ఉంది. అంతేకాదు సరైన జ్ఞానంతో, మనస్ఫూర్తిగా అల్లాహ్'ను ఆరాధిస్తూ, ఆయనకు దాస్యం చేయడంలో మీకు ఇది తోడ్పడుతుంది.
గమనిక: ఈ పుస్తకంలోని పేజీలను మొదటిసారి చదివే వ్యక్తికి, ఇందులో కొన్ని ప్రశ్నలు పునరావృతం అయినట్లు అనిపించవచ్చు. కానీ జాగ్రత్తగా అధ్యయనం చేస్తే, ఒక ప్రశ్నకు ఇవ్వబడిన సమాధానంలో లేని వివరాలు మరొక ప్రశ్నకు ఇవ్వబడిన సమాధానంలో ఉండటాన్ని గమనిస్తూ, తమ జ్ఞానంలో పెంపుదలను గుర్తిస్తారు. మరియు ఈ జ్ఞానాన్ని సంపాదించటంలో ఏమరుపాటు ధోరణి సబబు కాదని మేము భావించాము.
సల్లల్లాహు వసల్లం అలా నబీయ్యినా ముహమ్మదిన్ వ ఆలిహీ వ అస్ హాబిహీ అజ్మయీన్.
సలాహ్ (నమాజు) మరియు ఉపవాసాల విషయాలలో బహిష్టుకు సంబంధించిన కొన్ని ఇస్లామీయ ఆదేశాలు:
ఒక స్త్రీ ఫజ్ర్ సమయం పూర్తి కాగానే బహిష్టు నుండి పరిశుద్ధమైతే (తహారతు పొందితే), ఆ రోజు ఆమె తినడం, త్రాగడం మానేసి ఉపవాసం ఉండాలా? ఆ రోజు ఆమె పాటించే ఉపవాసం చెల్లుతుందా లేక ఆ ఉపవసాన్ని ఆమె మళ్ళీ ఖజా చేయవలసి ఉంటుందా?
ఒకవేళ స్త్రీ ఫజ్ర్ సమయం పూర్తి కాగానే బహిష్టు నుండి పరిశుద్ధత (తహారతు) పొందినట్లయితే, ఆ రోజు ఆమె ఉపవాసం పాటించే విషయంలో ఇస్లామీయ పండితుల మధ్య రెండు అభిప్రాయాలు ఉన్నాయి:
మొదటి అభిప్రాయం: ఆ రోజు ఆమె అన్నపానీయాలు త్యజించటం తప్పనిసరి. కానీ అది ఉపవాసంగా లెక్కించబడదు, తప్పనిసరిగా ఆ రోజు ఉపవాసాన్ని తిరిగి ఖజా చేయాలి. ఇమాం అహ్మద్ రహిమహుల్లాహ్ గారి ప్రముఖ అభిప్రాయం కూడా ఇదే!
రెండవ అభిప్రాయం: ఆ రోజు అన్నపానీయాలు మానేయాల్సిన అవసరం లేదు. ఆ రోజు పాటించే ఉపవాసం చెల్లదు. ఎందుకంటే ఆ రోజు యొక్క తొలిఝాము (సహరీ సమయం) బహిష్టు అవస్థలోనే గడిచి పోయింది. ఆ సమయాన ఆమె పై ఉపవాసం విధి కాదు. ఆమెపై ఉపవాసం విధి కానప్పుడు అన్నపానీయాలు త్యజించడం వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరదు. మరియు ఆ సమయం ఆమె కోసం పవిత్రతమైనది కూడా కాదు. ఎందుకంటే సహరీ సమయంలో ఆమెపై ఉపవాసం విధి కాలేదు. ఆ అపరిశుద్ధ సమయంలో, ఆమె కొరకు ఉపవాసం నిషేధించబడింది. షరియతు బద్దమైన ఉపవాసం: సర్వశక్తిసంపన్నుడైన అల్లాహ్ ను ఆరాధించే ఉద్దేశ్యంతో, ఉషోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసభంగకాలకు అతీతంగా ఉండాలి.
కాబట్టి ఈ రెండవ అభిప్రాయం మొదటి దాని కంటే చాలా మెరుగైనది. అయినప్పటికీ పైన ప్రస్తావించబడిన రెండు అబిప్రాయాల వెలుగులో స్త్రీ ఆ రోజు యొక్క ఉపవాసం తప్పనిసరిగా మళ్ళీ ఖజా చేయవలసి ఉంది.
స్త్రీ తహారతు శుద్ధి పొందింది. ఫజ్ర్ తర్వాత గుసుల్ చేసి నమాజు చేసింది. ఆ రోజు ఉపవాసం కూడా పూర్తి చేసింది. అప్పుడు ఆమె పాటించిన ఈ ఉపవాసం తిరిగి ఖజా చేయడం తప్పనిసరి (వాజిబు) అవుతుందా?
బహిష్టులో ఉన్న స్త్రీ ఫజ్ర్ సమయానికి ఒక నిమిషం ముందు తహారతు శుద్ది పొందినట్లు దృఢమైన నమ్మకం కలిగి, అది రమదాన్ మాసం అయి ఉంటే, ఆమెపై ఆ రోజు ఉపవాసం పాటించడం తప్పనిసరి (వాజిబు) అవుతుంది మరియు ఆ ఉపవాసం సరైనదిగా లెక్కించ బడుతుంది, దానికి బదులుగా ఖజా చేయ వలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె పరిశుద్ధ (తహరతు) స్థితిలో ఉపవాసం పాటించింది. ఒకవేళ ఆమె ఫజ్ర్ సమయం తర్వాత గుస్ల్ చేసినా తప్పు లేదు. పురుషుడికి వర్తించినట్లుగానే అంటే ఒక పురుషుడు లైంగిక సంపర్కం లేదా స్వప్నస్కలనం వలన అశుద్దావస్థ పొంది, సమయం లేకపోవడం వలన గుసుల్ చేయకుండానే సహరీ భోజనం చేస్తాడు. సహరీ సమయం తర్వాత గుసుల్ చేస్తాడు. అయినా అతని ఆ ఉపవాసం చెల్లుతుంది.
ఈ సందర్భంలో నేను స్త్రీలకు సంబంధించిన మరొక సమస్యను మీ దృష్టికి తీసుకు రావాలని భావిస్తున్నాను. అదేమిటంటే, ఒక స్త్రీ ఉపవాసం పూర్తి చేసి, ఉపవాసం విరమించిన తర్వాత ఇషా నమాజు చేయక ముందు ఋతుస్రావం మొదలైతే ఆ రోజు ఉపవాసం నిర్వీర్యం అయిపోయిందని కొందరు మహిళలు భ్రమపడతారు. కానీ ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. బదులుగా స్త్రీకు సూర్యాస్తమయమై, ఒక నిమిషం గడవకనే ఋతుస్రావం మొదలైనా, ఆ ఉపవాసం పూర్తి అవుతుంది, చెల్లుతుంది.
స్త్రీ పురుటి ముట్టు నుండి నలభై రోజులకు ముందుగానే (రమదాన్ నెలలో) పరిశుద్దత (తహారత్) పొందినట్లయితే, ఆ స్త్రీ పై ఉపవాసం తప్పనిసరిగా విధి అవుతుందా?
అవును! ప్రసవించిన స్త్రీ, ఒకవేళ నలభై రోజులకు ముందుగానే రమదాను మాసంలో పరిశుద్దత (తహారత్) పొందినట్లయితే, ఆ స్త్రీ తప్పనిసరిగా ఉపవాసాలు పాటించాలి మరియు సలాహ్ (నమాజులు) విధిగా ఆచరించాలి. భర్త ఆమెతో శారీరకంగా కలవ వచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆమె పరిశుద్దత (తహారత్) పొందింది. నమాజులు, ఉపవాసాలు మరియు భర్తతో కలవటాన్ని నిరోధించే కారణం ఇప్పుడు చెల్లదు.
సాధారణంగా ఒకస్త్రీ యొక్క ఋతుకాలం ఏడు లేక ఎనిమిది రోజులు ఉంటుంది. అయితే ఒకటి, రెండు సార్లు ఎనిమిది దినాలకు మించి ఋతుకాలం కొనసాగితే, దాని ఆదేశం ఏమిటి?
సాధారణంగా ఒక స్త్రీ ఋతుకాలం 6 లేదా 7 రోజులు ఉంటుంది. కొన్నిసార్లు అది 8, 9, 10 లేదా 11 రోజుల వరకు కొనసాగ వచ్చు. ఆ సందర్భంలో ఆమె పరిశుద్ధత (తహారత్) పొందేంత వరకు సలాహ్ (నమాజు) చేయకూడదు, ఉపవాసం పాటించకూడదు. ఎందుకంటే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఋతుకాలానికి సంబంధించి ఒక నిర్దిష్ట సమయాన్ని ఖరారు చేయలేదు. అల్లాహు తఆల ఇలా సెలవిచ్చాడు: {وَيَسْأَلُونَكَ عَنِ الْمَحِيضِ قُلْ هُوَ أَذًى} [البقرة:222] "మరియు వారు నిన్ను స్త్రీల ఋతుకాలం గురించి అడుగుతున్నారు. నీవు వారికి ఇలా తెలుపు: "అదొక అపరిశుద్ధ (హానికరమైన) స్థితి. కనుక ఈ రక్తస్రావం ఎప్పటి వరకు కొనసాగుతూ ఉంటుందో, అప్పటి వరకు స్త్రీ అదే అపరిశుద్ధ స్థితిలో ఉంటుంది. చివరికి పరిశుద్ది పొంది, గుసుల్ ఆచరించే వరకు వేచి ఉండాలి. ఆ తరువాత మాత్రమే సలాహ్ (నమాజు) ఆచరించవలసి ఉంటుంది. తదుపరి నెలలో మునుపటి నెలసరి వ్యవధి కంటే ముందే శుద్ది పొందినట్లయితే, వెంటనే గుసుల్ ఆచరించాలి, అది మునుపటి నెలసరి సమయం కంటే తక్కువైనా సరే!
కావున స్త్రీ బహిష్టులో ఉన్నంత వరకు నమాజు చేయరాదు. ఆ ఋతుస్రావం మునుపటి నెల ప్రకారంగా ఉన్నా, పెరిగినా లేక తరిగినా సరే శుద్ది పొందగానే గుసుల్ చేసి సలాహ్ (నమాజు) ఆచరించ వలసి ఉంటుంది.
ప్రసవానంతరం స్త్రీలు తప్పనిసరిగా నలభై రోజుల పాటు సలాహ్ (నమాజు) ఆచరించకుండా మరియు ఉపవాసం పాటించకుండా కూర్చోవాలా? లేదా 40 రోజుల లోపలే ప్రసవానంతర రక్తస్రావం ఆగిపోయే అవకాశం ఉందని భావించవచ్చా? రక్తస్రావం ఆగిపోయిన వెంటనే, ఆమె గుసుల్ చేసుకొని, సలాహ్ (నమాజు) ఆచరించడం ప్రారంభించాలా? అలాగే, పరిశుద్ధత (తుహ్ర్) కొరకు ప్రసవానంతర రక్తస్రావం (నిఫాస్) యొక్క కనీస వ్యవధి ఏమిటి?
ప్రసవానంతర రక్తస్రావానికి (నిఫాస్ కు) నిర్ణీతకాల వ్యవధి లేదు. కానీ రక్తస్రావం కొనసాగే వరకు స్త్రీ సలాహ్ (నమాజు) మరియు ఉపవాసం మానేయాలి. అలాగే భర్త ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు.
ఒకవేళ పురుటి ముట్టులో (నిఫాస్'లో) ఆమెకు కేవలం పది లేక పదిహేను రోజుల సమయంలోనే పరిశుద్దత (తుహ్ర్) చిహ్నాలు కనబడితే, నలభై రోజులు ఇంకా పూర్తి కాకపోయినా - ఆమె సలాహ్ (నమాజు) మరియు ఉపవాసం ఆచరించడం ప్రారంభించాలి, భర్త ఆమెతో సంభోగించవచ్చు. ఇందులో ఎలాంటి దోషమూ లేదు.
ఇక్కడ ముఖ్యవిషయం ఏమిటంటే, పురుటి ముట్టు (నిఫాస్) అనేది ఇంద్రియాలకు సంబంధించిన విషయం. నిఫాసు చిహ్నాలు ఉనికిలోకి రావడం, నిర్ణీత సమయం తర్వాత మాయమైపోడాన్ని బట్టి ధార్మిక ఆదేశాలు వర్తిస్తాయి. కాబట్టి ఎప్పుడైతే ఆ అపరిశుద్ధ అవస్థ ఉనికిలోకి వస్తుందో దాని ఆదేశాలు కూడా ఆచరణలోకి వస్తాయి. మరి, ఎప్పుడైతే ఆ స్థితి నుండి పరిశుద్ది పొందుతారో, ఆ ఆదేశాలు ఆగి పోతాయి.
కానీ ఒకవేళ అరవై రోజులకు మించి పురుటి ముట్టు కొనసాగుతూ ఉన్నట్లయితే, అప్పుడు ఆమె ముస్తహాదాగా పరిగణించ బడుతుంది. సాధారణంగా వర్తించే నిర్ణీత వ్యవధిని గడిపి, ఆమె గుసుల్ స్నానం చేయాలి మరియు సలాహ్ (నమాజు) ఆచరించడం మొదలు పెట్టాలి.
ఒక స్త్రీకు రమదాను మాసంలో పగటి సమయంలో రక్తపు బిందువులు కనబడసాగాయి. రమదాను నెలంతా అలా జరుగుతూనే ఉంది. అదే స్థితిలో ఆమె ఉపవాసాలు పాటించింది. అలాంటప్పుడు ఆమె ఉపవాసాలు చెల్లుతాయా?
అవును! ఆమె ఉపవాసం చెల్లుతుంది. ఆ రక్తపు బిందువులు పరిగణలోకి తీసుకోబడవు, ఎందుకంటే అవి నరాల నుండి స్రవిస్తాయి. అలీ రదియల్లాహు అన్హు వాక్కు మేరకు ఆయన ఇలా పలికారు: 'ఈ రక్తం ముక్కు నుండి వెలువడే రక్తం లాంటిది. అది నెలసరి రక్తంగా పరిగణించ బడదు.
బహిష్టులో ఉన్న స్త్రీ లేదా పురుటి ముట్టులో ఉన్న స్త్రీ ఒకవేళ ఫజ్ర్ కంటే ముందు శుద్ది పొంది, ఫజ్ర్ సమయం తరువాత గుసుల్ చేసినట్లయితే, ఆమె ఉపవాసం చెల్లుతుందా? చెల్లదా?
అవును చెల్లుతుంది! ఋతుకాలపు స్త్రీ, అలాగే పురుటి ముట్టులో ఉన్న స్త్రీ, ఫజ్ర్ కంటే ముందు శుద్ది పొంది. ఫజ్ర్ సమయం తరువాత గుసుల్ చేసిన పక్షంలో ఆమె ఉపవాసం చెల్లుతుంది. ఎందుకంటే శుద్ది పొందిన సమయం, ఆమె ఉపవాసం ప్రారంభించేందుకు యోగ్యమైన సమయం యొక్క పరిధిలోనే ఉంది. కనుక ఆమె కూడా, ఫజ్ర్ సమయం తరువాత అశుద్దావస్థలో సహరీ చేసిన పురుషుడితో సమానం. అందువల్ల ఆమె ఉపవాసం కూడా చెల్లుతుంది. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:{فَالآنَ بَاشِرُوهُنَّ وَابْتَغُواْ مَا كَتَبَ اللّهُ لَكُمْ وَكُلُواْ وَاشْرَبُواْ حَتَّى يَتَبَيَّنَ لَكُمُ الْخَيْطُ الأَبْيَضُ مِنَ الْخَيْطِ الأَسْوَدِ مِنَ الْفَجْرِ}[అల్ బఖర:187] "...ఇక నుండి మీరు మీ భార్యలతో సంభోగం (బాషిర్) చేయండి మరియు అల్లాహ్ మీ కొరకు వ్రాసిన దానిని కోరండి. మరియు ఉదయకాలపు తెల్లరేఖలు రాత్రి నల్లచారల నుండి స్పష్టపడే వరకు, మీరు తినండి, త్రాగండి". (2:187) అల్లాహు తఆల ఉషోదయ సమయం (ఫజ్రె సాదిఖ్) వరకు సంభోగానికి అనుమతి ఇచ్చాడు దీని నుండి ఉషోదయం గడిచిన తరువాత కూడా గుసుల్ చేసి, ఉపవాసాన్ని కొనసాగించ వచ్చని అర్ధమవుతుంది. ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖనం : దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన భార్యలతో రమించి అశుద్దావస్థలోనే సహరీ చేసేవారు. అదే స్థితిలో ఉపవాసం మొదలు పెట్టి, తరువాత గుసుల్ చేసేవారు. (ఫజ్ర్ సలాహ్ కంటే ముందే గుసుల్ చేసేవారు). అనగా: దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉషోదయం తరువాత జనాబతు అశుద్దత నుండి గుసుల్ ఆచరించి ఉన్నారు.
ఒక స్త్రీకు రక్తస్రావమైనట్లు అనిపించింది లేదా ఋతుస్రావపు నొప్పి మొదలు అయినట్లు గ్రహించింది. కానీ సూర్యాస్తమయం కంటే ముందు రక్తం కనబడలేదు. అలాంటప్పుడు ఆ రోజు పాటించిన ఆమె ఉపవాసం చెల్లుతుందా లేక తిరిగి మళ్ళీ ఆచరించాలా?
ఒక స్త్రీ ఉపవాసంలో ఉన్నప్పుడు బహిష్టు రక్తస్రావం మొదలైనట్లు అనిపించినా, సూర్యాస్తమయం తర్వాత మాత్రమే ఆమెకు బహిష్టు రక్తస్రావం మొదలు అయినట్లయితే, ఆ రోజు యొక్క ఆమె ఉపవాసం చెల్లుతుంది. కాబట్టి, అది విధి ఉపవాసమైన, దానిని పునరావృతం చేయవలసిన అవసరం లేదు. మరియు అది నఫిల్ ఉపవాసమైనా దాని ప్రతిఫలం ప్రభావితమవ్వదు.
స్త్రీ రక్తం చిహ్నాలు చూసింది కానీ అది బహిష్టుకు చెందిన రక్తస్రావమేనా కాదా అనేది నిర్దారణ చేయలేకపోయింది. అలాంటప్పుడు ఆ రోజున ఆమె పాటించిన ఉపవాసం గురించి ఆదేశం ఏమిటి?
ఇక్కడ పేర్కొన్న స్త్రీ పాటించిన ఆరోజు ఉపవాసం చెల్లుతుంది. ఎందుకంటే నెలసరి మొదలైందనే ఖచ్చిత నిర్దారణ తెలియనంత వరకు నెలసరి మొదలు కాలేదన్నది ప్రాథమిక నియమం.
కొన్నిసందర్భాలలో నెలసరి మొదలయ్యే దినాలలో స్త్రీ ఒక దినములోని వేర్వేరు సమయాల్లో రక్తపు చిహ్నాలను లేదా చిన్న చిన్న బిందువులను చూస్తుంది. కానీ నిజానికి, ఋతుస్రావం ఇంకా మొదలై ఉండదు. ఇంకోసారి నెలసరి రోజులలో కాకుండా ఇతర రోజులలో చూస్తుంది. పైన పేర్కొన్న ఈ రెండు పరిస్థితులలో ఆమె ఉపవాసం యొక్క ఆదేశం ఏమిటి?
ఇంతకుముందు ఇలాంటి ఒక ప్రశ్నకు జవాబు ఇవ్వబడింది. అయితే ప్రశ్న యొక్క మరో భాగం మాత్రం మిగిలిపోయింది. అదేమంటే, రక్తపు బిందువులు ఒకవేళ నెలసరి రోజుల్లో కనిపించి, అది ఆమెకు సాధారణ ఋతుస్రావంగా అనిపించి నట్లయితే, అప్పుడు నిశ్చయంగా అది ఋతుకాలపు రక్తస్రావమే అవుతుంది.
బహిష్టులో ఉన్న స్త్రీలు మరియు పురుడు పోసుకున్న స్త్రీలు రమదాన్ మాసపు పగటి వేళల్లో తినడం, త్రాగడం చేయవచ్చా?
అవును! బహిష్టులో ఉన్న స్త్రీలు మరియు ప్రసవించిన స్త్రీలు రమదాన్ మాసంలో తినవచ్చు, త్రాగవచ్చు. కానీ ఇంట్లో పిల్లలు ఉంటే,వారికి కనబడకుండా రహస్యంగా తినడం, త్రాగడం మంచిది. ఎందుకంటే అలా చేయడం వల్ల ఆ చిన్నపిల్లల మనస్సులో సందేహాలు కలుగుతాయి.
బహిష్టులో ఉన్న స్త్రీ లేదా పురుటి ముట్టులో ఉన్న స్త్రీ, అస్ర్ సమయంలో శుద్ది పొందిన పక్షంలో, ఆమె అస్ర్ సలాహ్ (నమాజు)తో పాటు జుహ్ర్ సలాహ్ కూడా చేయాలా? లేక కేవలం అస్ర్ సలాహ్ మాత్రమే చేయవలసి ఉంటుందా ?
ఈ విషయంలో బలమైన అభిప్రాయం ప్రకారం పైన పేర్కొన్న స్త్రీ కేవలం అస్ర్ సలాహ్ (నమాజు) మాత్రమే చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఆమెపై జుహ్ర్ సలాహ్ కూడా విధి అవుతుంది అనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. మరియు నియమం ఏమిటంటే (براءة الذّمة) బాధ్యత నుండి అనుమతి ఇవ్వబడింది. ఇంకా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చి ఉన్నారు: "ఎవరైతే సూర్యాస్తమయానికి ముందు అస్ర్ యొక్క కనీసం ఒక రకాతు చేయగలిగారో, వారు పూర్తిగా అస్ర్ సలాహ్ (నమాజును) పొందారు". "ఈ హదీథులో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జుహ్ర్ సలాహ్ (నమాజు) పొందాడు" అని చెప్పలేదు. ఈ సందర్భంలో ఒకవేళ జుహ్ర్ సలాహ్ కూడా విధి అయి ఉన్నట్లయితే ఆయన దాని గురించి ఖచ్చితంగా చెప్పే వారు. పైన పేర్కొన్న సందర్భంలో స్త్రీపై జుహ్ర్ సలాహ్ వాజిబ్ చేయకపోవడానికి మరొక కారణం కూడా ఉంది. అదేమిటంటే, ఒకవేళ జుహ్ర్ సమయం తర్వాత స్త్రీకి బహిష్టు ప్రారంభమై నట్లయితే, జుహ్ర్ 'ను అస్ర్' తో కలిపి చేసే అవకాశం ఉన్నప్పటికీ ఆమె జుహ్ర్ సలాహ్ మాత్రమే తిరిగి పూర్తిచేయవలసి ఉంటుందే కానీ అస్ర్ సలాహ్ కాదు. మరియు ఈ విషయంలోనూ మరియు పై ప్రశ్నలో పేర్కొన్నదానిలోనూ ఎలాంటి వ్యత్యాసంలేదు.
కాబట్టి, కొన్ని హదీథుల మరియు ఖియాసుల వెలుగులో, పైన పేర్కొన్న స్త్రీ అస్ర్ సలాహ్ మాత్రమే చేయవలసి ఉంటుంది. అలాగే, ఆమె ఇషా సమయం ముగిసే ముందు పరిశుద్దత పొందినట్లయితే, ఇషా సలాహ్ మాత్రమే చేయవలసి ఉంటుంది, మగ్రిబ్ సలాహ్ కూడా ఆచరించడం ఆమెపై తప్పనిసరి విధి కాదు.
గర్భవతుల్లో రక్తస్రావం జరిగితే, అది ఈ రెండు స్థితుల్లో ఏదో ఒక స్థితి అయి ఉంటుంది: మొదటిది పిండం ఎదుగుదల మొదలు కాకముందే గర్భస్రావం జరిగి ఉంటుంది. లేదా పిండం అభివృద్ది చెంది అవయవాలు రూపుదిద్దుకున్న తర్వాత గర్భస్రావం జరిగి ఉంటుంది ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే గర్భస్రావం జరిగిన రోజు యొక్క ఉపవాసం గురించి ఆదేశం ఏమిటి? ఆమె రక్తస్రావం చూస్తున్న దినాల్లో ఉపవాసం గురించి ఆదేశం ఏమిటి?
ఒకవేళ పిండం ఏర్పడక పోతే, ఈ రక్తస్రావం పురుటి ముట్టు (నిఫాస్) రక్తస్రావం అవ్వదు, కనుక ఆ స్త్రీ సలాహ్ (నమాజు) చేస్తుంది, ఉపవాసం పాటిస్తుంది. ఆమె చేసే సలాహ్, పాటించే ఉపవాసం చెల్లుతాయి.
ఒకవేళ పిండం ఏర్పడితే ఈ రక్తస్రావం పురుటి ముట్టు (నిఫాస్) రక్తస్రావంగా పరిగణించబడుతుంది కనుక ఈ స్థితిలో సలాహ్ చేయడానికి, ఉపవాసం ఉండటానికి అనుమతి లేదు.
ఈ సమస్యలో నియమం ఏమిటంటే ఒకవేళ పిండం ఏర్పడి ఉంటే గర్భస్రావం తరువాత వచ్చే రక్తం పురుటి ముట్టు (నిఫాస్) రక్తంగా పరిగణించబడుతుంది ఈ సందర్భంలో ఆమెపై పురుటి ముట్టు (నిఫాస్) రక్తస్రావం స్థితిలో ఉన్న స్త్రీపై నిషేధించబడిన విషయాలన్నీ ఆమెపై కూడా వర్తిస్తాయి. ఒకవేళ ఇంకా గర్భంలో పిండం ఏర్పడక పోతే ఆ రక్తస్రావం పురుటి ముట్టు (నిఫాస్) రక్తస్రావం కాదు. కనుక పురుటి ముట్టు (నిఫాస్) స్థతిలో ఉన్న స్త్రీపై గల నిషేధాలు ఆమెకు వర్తించవు.
రమదాను సమయంలో పగటిపూట గర్భవతికి రక్తస్రావం జరిగితే అప్పుడు ఆమె ఉపవాసం భంగమవుతుందా?
స్త్రీ ఉపవాసం ఉన్నప్పుడు బహిష్టు రక్తస్రావం మొదలైతే, ఆమె ఉపవాసం చెల్లదు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క పలుకులు: స్త్రీ బహిష్టులో సలాహ్ (నమాజు) పాటించదా, ఉపవాసం పాటించదా?' అందువలన బహిష్టు, ఉపవాసాన్ని భంగం చేసేదిగా పరిగణించబడింది మరియు పురుటి ముట్టు (నిఫాస్) గురించి ఆదేశం కూడా ఇదే! కనుక బహిష్టు మరియు పురుటి ముట్టు వలన ఉపవాసం భంగమవుతుంది.
ఇకపోతే గర్భవతికి రమదానులో పగటి వేళ రక్తస్రావం జరిగితే, అది ఋతుస్రావమే అయితే ఆమెకు సాధారణ స్త్రీకు వర్తించే బహిష్టు స్థితికి సంబంధించిన ఆదేశమే వర్తిస్తుంది. అంటే ఆమె ఉపవాసం భంగమవుతుంది ఒకవేళ అది బహిష్టు రక్తస్రావం కాకపోతే, ఉపవాసానికి భంగం వాటిల్లదు!
గర్భవతికి కలిగే రక్తస్రావం ఏమిటంటే ఆమెకు గర్భం దాల్చినప్పటి నుండి నెలసరి రక్తస్రావం ఆగిపోలేదు బదులుగా అలవాటు ప్రకారం వస్తూ ఉంటుంది. ప్రామాణిక బద్దమైన వాక్కు ఏమిటంటే అది ఋతుస్రావంగా పరిగణించబడుతుంది ఆమెకు నెలసరి స్త్రీ ఆదేశాలు వర్తిస్తాయి.
ఒకవేళ ఆమె నెలసరి ఆగిపోయి, ఆ తరువాత సాధారణంగా అయ్యే రక్తస్రావాన్ని చూసినట్లయితే దాని వల్ల ఆమె ఉపవాసం భంగం కాదు ఎందుకంటే అది నెలసరి రక్తస్రావం కాదు.
స్త్రీ ఒకవేళ బహిష్టు సమయంలో ఒకరోజు రక్తస్రావం చూసి, మరొక రోజు చూడకపోతే, ఆమెపై గల ఆదేశంఏమిటి?
బాహ్యంగా తెలిసిందేమిటంటే ఆ స్త్రీ తన నెలసరి సమయంలో చూసిన తుహ్ర్' లేక పొడి నెలసరికి చెందినది కనుక దాని నుండి నెలసరి స్త్రీ వలె ఆరాధనలకు దూరంగా ఉండాలి.
అయితే కొంతమంది ఇస్లామీయ పండితుల అభిప్రాయం ప్రకారం, స్త్రీ నెలసరి సమయంలో ఒకరోజు రక్తస్రావం చూసి మరొక రోజు రక్తస్రావం చూడకపోతే, ఆ రక్తం నెలసరి క్రిందికే వస్తుంది. పొడిగా ఉన్న రోజు తుహ్ర్'గా పరిగణించబడుతుంది, అలా పదిహేను రోజులు గడిచిపోయే వరకు. పదిహేను రోజుల తర్వాత అది ఇస్తహాదాగా పరిగణించబడుతుంది, ఇమాం అహ్మద్ బిన్ హంబల్ రహిమహుల్లాహ్ యొక్క ప్రసిద్ధ అభిప్రాయం కూడా ఇదే!
బహిష్టు చివరి దశ దినాలలో పరిశుద్దతకు ముందు స్త్రీ రక్తపు చిహ్నాలు చూడకపోతే ఆ రోజు ఆమె ఉపవాసం ఉండవచ్చునా? అప్పటికీ ఆమెకు ఇంకా తెలుపు కనబడలేదు. ఆ స్థితిలో ఆమె ఏమి చేయాలి?
ఒకవేళ ప్రస్తావించబడిన మహిళ యొక్క అలవాటు ప్రకారం ఋతుస్రావం తదుపరి తెలుపు చూడకపోవటం వంటిది కొంతమందిలో జరుగుతుంది. అప్పుడు ఆమె ఉపవాసం పాటించాలి మరియు ఒకవేళ ఆమె ఋతుస్రావం అనంతరం అలవాటు ప్రకారం తెలుపు కనబడని పక్షంలో, ఆమె ఉపవాసం ఉండకూడదు.
బహిష్టు మరియు పురుటి ముట్టు రక్తస్రావపు మహిళ అవసరం మేరకు అనగా విధ్యార్థిని లేదా ఉపాధ్యాయురాలు అయినప్పుడు ఖుర్ఆను చూస్తూ లేదా చూడకుండా పారాయణం చేయడం గురించి ఆదేశం ఏమిటి?
అవసరం మేరకు బహిష్టులోని స్త్రీ లేదా పురుటి ముట్టులోని స్త్రీ అనగా విధ్యార్థిని లేక ఉస్తాద్ కోసం రాత్రింబవళ్ళలో ఏ సమయంలోనైనా ఖుర్ఆన్ పారాయణం చేయడం లేదా దానిని మురాజా (పునరావృతం) చేయడంలో ఎలాంటి సమస్య లేదు.
కానీ పుణ్యఫలాల రీత్యా ఖుర్ఆన్ పారాయణం చేయకపోవడమే ఉత్తమం. ఎందుకంటే చాలామంది ఇస్లామీయ విధ్యావేత్తల అభిప్రాయం మేరకు బహిష్టులోని స్త్రీ కోసం ఖుర్ఆన్ పారాయణం చేయడం అయిష్టకరమైన చర్య.
బహిష్టు పూర్తి అయిన స్త్రీ, పరిశుద్దావస్థ పొందిన తర్వాత తన దుస్తులపై ఎలాంటి రక్తం కానీ లేదా మలినం గానీ వాటికి అంటుకోక పోయినా, దుస్తులు మార్చుకోవడం తప్పనిసరియా?
లేదు, దుస్తులు మార్చుకోవడం తప్పనిసరి కాదు. ఎందుకంటే ఋతుస్రావం వల్ల శరీరం అశుద్దమవ్వదు బదులుగా ఆ రక్తం అంటిన దుస్తులు మాత్రమే అశుద్దమవుతాయి అంచేత దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్త్రీలకు ఒకవేళ దుస్తులకు ఋతుస్రావ రక్తం అంటి నట్లయితే వాటిని శుభ్రపర్చుకుని ఆ దుస్తుల్లో సలాహ్ (నమాజు) ఆచరించవచ్చని తెలిపినారు.
ఒక స్త్రీ పురుటి ముట్టు వలన రమదాను యొక్క ఏడు ఉపవాసాలు ఆచరించలేదు, ఆ పై రాబోయే రమదాను వరకు కూడా ఆమె ఆ ఉపవాసాల ఖజాను పూర్తి చేయలేదు. మళ్ళీ తరువాత రమదానులో కూడా పిల్లకు పాలు పట్టించడం వలన. ఏడు ఉపవాసాలు పాటించలేదు అలా మరో రమదాను కూడా సమీపించింది అప్పుడు ఆ స్త్రీ ఏం చేయాలి ? సమాధాం ఇచ్చి మాకు మార్గదర్శకత్వం చేయగలరు. అల్లాహు తాలా మీకు పుణ్యఫలాలు ప్రసాదించుగాక!
పురుటి ముట్టులో ఉన్న స్త్రీ, వాస్తవంగా రోగగ్రస్తురాలై ఉపవాసం పాటించే శక్తి లేనట్లయితే, ఎప్పుడు ఆమెకు ఉపవాసాలు పాటించే శక్తిసామర్థ్యం కలుగుతుందో అప్పుడు ఆ తప్పిపోయిన ఉపవాసాలు పూర్తి చేయాలి చివరికి రెండవ రమదాను వచ్చినా సరే ఎందుకంటే ఆమె వద్ద తగిన కారణం ఉంది.
అయితే, కేవలం బద్దకం వలన ఒక రమదానులో మిగిలి పోయిన ఉపవాసాలు మరో రమదాను వరకు ఖజా చేయకుండా వాయిదా వేయడం సమంజసం కాదు. ఆయిషా రదియల్లాహు అన్హా కథనం: నా పై (రమదాను) ఉపవాసాలు మిగిలి ఉండేవి నేను వాటిని షాబానులో మాత్రమే పూర్తి చేయగలిగే దానిని.
కనుక అలాంటి స్త్రీ తన గురించి ఒకసారి గంభీరంగా ఆలోచించుకోవాలి ఒకవేళ ఆమే వద్ద షరియతు పరమైన కారణం లేనట్లయితే, ఆమె పాపం చేసినట్లు అవుతుంది. ఆమె ముందుగా తప్పిపోయిన ఉపవాసాలను పూర్తిచేయాలి. కానీ ఒకవేళ ఆమె నిజంగా తగిన కారణం వలన తప్పిపోయిన రమదాను ఉపవాసాలు ఖజా చేయడంలో ఒకటి రెండు సంవత్సరాలు ఆలస్యం అయినా అందులో ఎలాంటి దోషమూ లేదు.
కొంతమంది స్త్రీలు మరొక రమదానులో ప్రవేశిస్తారు కానీ గడిచి పోయిన రమదానులో తప్పిపోయిన ఉపవాసాలు ఖజా చేయకుండా ఉంటారు. ఇలాంటి స్త్రీలపై తప్పనిసరి విధి (వాజిబు) ఏమిటో తెలియజేయగలరు.
అలాంటి వారిపై విధిగా ఉన్నదేమిటంటే అలా చేసినందుకు తప్పనిసరిగా అల్లాహ్’ వద్ద చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా తౌబా చేసుకోవాలి. రెండవ రమదాను ముగియగానే ఆ ఉపవాసాలు ఖజా చేసుకోవాలి. ఎందుకంటే ఎలాంటి కారణం లేకుండా రమదానులో తప్పిపోయిన ఉపవాసాల ఖజా మరో రమదాను వరకు వాయిదా వేయడం అనుమతించబడలేదు. ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖించిన హదీథు:"నా పై రమజాను ఉపవాసాలు మిగిలి ఉండేవి వాటిని నేను షాబానులో మాత్రమే ఖజా చేయగలిగేదాన్ని".
ఈ హదీథు నిర్ధారించే విషయం ఏమిటంటే ఒక రమదాను ఉపవాసాల ఖజా మరో రమదాను తర్వాత వరకు వాయిదా వేయడం కుదరదు. కనుక ఇటువంటి స్త్రీలు అల్లాహు తఆలాతో మనస్పూర్తిగా స్వచ్ఛమైన తౌబా చేసుకోవాలి మరియు తరువాత రమదాను అనంతరం వదిలిన ఉపవాసాలను త్వరగా పూర్తిచేసుకోవాలి.
ఒక మహిళకు మధ్యాహ్నం తర్వాత అంటే ఒంటి గంట తరువాత ఋతుస్రావం మొదలైంది. ఒకవేళ ఆమె అప్పటి వరకు జొహ్ర్ సలాహ్ (నమాజు) చేయనట్లయితే, శుద్ది పొందిన తరువాత ఆమె ఆ జొహ్ర్ సలాహ్ ను ఖజా చేయవలసింది ఉంటుందా?
ఈ విషయంలో ఉలమాల మధ్య అభిప్రాయభేదాలు ఉన్నాయి. కొందరి అభిప్రాయం ప్రకారం పైన ప్రస్తావించబడిన ఆ జొహ్ర్ సలాహ్ తప్పనిసరిగా ఖజా చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆమె ఎటువంటి తప్పు చేయలేదు. ఎందుకంటే సలాహ్ ను దాని అంతిమఘడియ వరకు వాయిదా వేయడం అనుమతించబడినది.
కానీ మరికొంత మంది ఉలమాల అభిప్రాయం ప్రకారం ఆమెపై ఆ సలాహ్ ఖజా పూర్తి చేయడం తప్పనిసరి. ఎందుకంటే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన హదీథులో ఇలా ఉంది: ‘ఎవరైతే సలాహ్ యొక్క ఒక్క రకాతు (దాని సమయం లోపల) పొందినా అతను పూర్తి సలాహ్ ను పొందినట్లే’.
అయితే జాగ్రత్త నిమిత్తం ఆ సలాహ్ యొక్క ఖజా ను ఆమె పూర్తి చేయడం మంచిది. ఎందుకంటే ఖజా చేయవలసినది ఒక్కటే సలాహ్ కాబట్టి దానిని పూర్తి చేయడంలో ఒక స్త్రీ పై ఎలాంటి భారమూ ఉండదు.
గర్భవతి ఒకవేళ కాన్పుకు ఒకటి లేక రెండు రోజుల ముందు రక్తం చూసినట్లయితే దాని వలన ఆమె సలాహ్ (నమాజు) మరియు ఉపవాసం విడిచిపెట్టవలసి ఉంటుందా?
గర్భవతి కాన్పుకు ఒకటి లేక రెండు రోజుల ముందు రక్తం చూడటం మరియు ప్రసవ నొప్పులు మొదలు కావటం జరిగితే అది పురుటి ముట్టుగా భావించబడుతుంది. కనుక దాని కారణం వలన స్త్రీ సలాహ్ మరియు ఉపవాసం పాటించకూడదు కానీ రక్తం స్రవిస్తున్నా, పురుటి నొప్పులు కలగనట్లయితే అది చెడు రక్తంగా భావించ బడుతుంది, పురుటి ముట్టుగా పరిగణించబడదు మరియు ఈ రక్తస్రావం సలాహ్ కు, ఉపవాసాలకు ఆటంకం కాదు.
అందరితో కలిసి ఉపవాసాలు పాటించేందుకు బహిష్టును నిరోధించే మాత్రలు ఉపయోగించడం గురించి మీ అభిప్రాయం ఏమిటి?
నేను ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే నిపుణులైన వైద్యుల వద్ద ఈ మాత్రలు వాడటం వల్ల తీవ్రమైన నష్టాలు కలుగుతాయనే ప్రామాణిక ఋజువులు ఉన్నాయి. కనుక స్త్రీలకు చెప్పేదేమిటంటే ‘ఈ అవస్థ అందరి స్త్రీల కొరకు స్వాభావిక విధిగా నిర్ధారించబడింది అందుచేత అల్లాహ్ ద్వారా నిర్ధారీతమైన ఈ విధి పట్ల సంతృప్తిగా ఉండండి మరియు షరియతు పరమైన అవరోధం లేనట్లయితే ఉపవాసం ఉండండి. షరియతు పరమైన అవరోధం కల్గితే అల్లాహ్ తఆలాచే నిర్దారిత విధి పట్ల సంతృప్తిగా ఉంటూ ఉపవాసం మానుకోండి.
ఒక స్త్రీకి పురిటి ముట్టు ముగిసి రెండు నెలలు గడిచిన తరువాత,శుద్ది పొందిన తర్వాత రక్తపు చిన్న చిన్న బిందువులు కనబడుతున్నాయి, ఇప్పుడు ఈ స్థితిలో ఆమె నమాజు మరియు ఉపవాసం విడిచిపెట్టాలా లేక ఏం చేయాలి?
బహిష్టు, పురుటి ముట్టుకు సంబంధించి స్త్రీల సమస్యలు తీరం లేని సముద్రం మాదిరిగా ఉన్నాయి. దీనికి గల కారణం బహిష్టు నిరోధకమాత్రలు మరియు గర్భనిరోధక మాత్రల వాడకం, ఇలాంటి సమస్యలను మన పూర్వీకులు ఎదుర్కోలేదు. అయితే దైవప్రవక్త ప్రభవించిన తర్వాత, ఇంకా చెప్పాలంటే స్త్రీ జాతి ఆవిర్భవించిన రోజు నుండి ఇలాంటి సమస్యలు ఉన్నాయి. కానీ సమస్యలు కుప్పలు కుప్పలుగా ఉండటం వలన మనిషి ఆ సమస్యలను పరిష్కరించడంలో ఆందోళన పడుతూ వ్యధకు గురవుతాడు, ఇది చాలా చింతించవలసిన విషయం.
కానీ ఈ విషయంలో ఒక సాదారణ నియమం ఏమిటంటే స్త్రీ ఖచ్చితంగా పరిశుద్దత పొంది బహిష్టు తరువాత పరిశుద్దతను అంటే ద్రవాన్ని చూసినట్లయితే అది మట్టిరంగులో గానీ ,పసుపు రంగులో గానీ, బిందువులుగా గానీ, తడిగా గానీ ఉంటే అది బహిష్టులో భాగంగా పరిగణించబడదు కనుక అది ఉపవాసం, సలాహ్ నుండి నిరోధించదు మరియు భర్తతో సంభోగానికి అడ్డు పడదు, ఎందుకంటే అదంతా బహిష్టుగా పరిగణించబడదు గనుక. ఉమ్మే అతియ్య రదియల్లాహు అన్హా ఉల్లేఖనం : మేము పసుపురంగు, మట్టి రంగు ద్రవాన్నిపట్టించుకునేవారము కాదు’ ఈ హదీథును ఇమాం బుఖారీ నమోదు చేసారు. మరియు ఇమాం అబూ దాఊదు,ఇందులో ‘ తుహుర్’ అనే పదాన్ని జోడించారు. అంటే పరిశుద్ది పొందిన తరువాత మేము పసుపు, మట్టి రంగు ద్రవాన్ని ఏ రక్రస్రావంగానూ పరిగణించే వారం కాదు, ఈ హదీథు యొక్క సనద్ ప్రామాణికమైనది.
దీని వలన మేము చెప్పేది ఏమిటంటే పరిశుద్దత నమ్మకం కలిగిన తర్వాత ఇలాంటి ఏ రకమైన పదార్ధం వెలువడినా అది స్త్రీ పరిశుద్ధతకు హానీ కలిగించదు. కానీ ఆమె పై విధి ఏమిటంటే శుద్దత చూడనంత వరకు తొందర పడకూడదు. ఎందుకంటే కొంతమంది స్త్రీలకు రక్తస్రావం కలిగిన వెంటనే శుద్దత కొరకు వేచి చూడకుండానే తొందరగా గుసులు చేసేస్తారు. ఈ కారణంగా సహాబియాతులు ఉమ్ముల్ మూమినీన్ ఆయిషా రదియల్లాహు అన్హా వద్దకు దూదిని పంపేవారు అప్పుడు ఆమె వారికి సమాధానంగా 'తెలుపు చూడనంత వరకు తొందర పడకండి’ అని చెప్పేవారు.
కొంతమంది స్త్రీలకు అవిరామంగా రక్తం వెలువడుతుంది మరియు కొన్నిసార్లు ఒకటి, రెండు రోజులు ఆగినప్పటికీ మరలా రక్తస్రావం కొనసాగుతుంది. ఇలాంటి పరిస్థితిలో వారి కొరకు సలాహ్, ఉపవాసం మరియు ఇతర ఆరాధనల గురించిన ఆదేశం ఏమిటి?
చాలామంది ఇస్లామీయ విద్వాంసుల దృష్టిలో మామూలుగా సంభవించే బహిష్టు కాలం అంటే నిర్ధారిత ఋతుస్రావ దినాల సంఖ్య ఒక్కో స్త్రీ కొరకు ఒక్కో విధంగా ఉంటుంది. ఆ మామూలు బహిష్టు దినాలు ముగిసిన తర్వాత, గుసుల్ ఆచరించాలి మరియు సలాహ్ చేయటం మొదలు పెట్టాలి. ఉపవాసాలు పాటించాలి. పరిశుద్ధమైన రెండు లేదా మూడు రోజుల తర్వాత ఆమెకు కనబడే రక్తం బహిష్టు రక్తం కాదు, ఎందుకంటే ఈ విద్వాంసుల దృష్టిలో పరిశుద్దత యొక్క గరిష్ట వ్యవధి 13 రోజులు మాత్రమే.
మరియు కొంతమంది ఇతర విద్వాంసుల అభిప్రాయంలో రక్తం చూసినప్పుడు ఆమె బహిష్టు మహిళగా పరిగణించబడుతుంది. మరియు అలా రక్తస్రావం చూడనప్పుడు ఆమె పరిశుద్దమైనదిగా పరిగణించబడుతుంది. రెండు ఋతుస్రావాల మధ్య 13 రోజుల విరామం లేకపోయినా సరే!
రమదాను మాసంలో స్త్రీలు ఇంట్లో సలాహ్ (నమాజు) ఆచరించడం ఉత్తమమా? లేక మస్జిదు వెళ్ళి ఆచరించడం ఉత్తమమా? మరీ ముఖ్యంగా మస్జిదులో ప్రసంగాలు, హితబోధనలు కొనసాగుతున్నప్పుడు అయితే మస్జిదులో సలాహ్ చేసేందుకు వెళుతున్న స్త్రీలకు మీరేమని హితబోధ చేస్తారు?
స్త్రీలు తమ ఇంట్లో సలాహ్ చేయడం ఉత్తమం ఎందుకంటే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఒక హదీథులో ఇలా ఉన్నది: "మరియు స్త్రీల విషయంలో వారి ఇల్లు సలాహ్ కొరకు ఎంతో ఉత్తమమైనది". ఎందుకంటే స్త్రీలు తమ ఇంటి నుండి బయటికి వెళ్ళడం చాలా సందర్భాలలో చెడుకు దారి తీయవచ్చు అందుచేత ఆమె తన ఇంట్లోనే సలాహ్ చేయడమనేది, మస్జిదుకు వెళ్లడం కంటే ఎంతో ఉత్తమమైనది. ఇక ప్రసంగాలు, హితబోధల విషయానికొస్తే వాటిని క్యాసెట్ల ద్వారా, ఆన్ లైన్ లో కూడా వినవచ్చు.
ఇక సలాహ్ కోసం మస్జిదుకు వెళ్ళే స్త్రీల విషయంలో వారికి నేను చేసే హితబోధ ఏమిటంటే వారు ఎటువంటి అలంకరణలు లేకుండా సువాసనలు పూసుకోకుండా వెళ్ళాలి.
రమదాను మాసపు ఉపవాసం పాటిస్తున్న స్త్రీ వంటకాల రుచి చూడడానికి సంబంధించిన ఆదేశం ఏమిటి?
ధార్మిక ఆదేశం: తప్పనిసరి అయితే, వంటకాలను రుచి చూడటంలో ఎలాంటి దోషమూ లేదు కానీ రుచి చూసిన తర్వాత దాన్ని ఉమ్మి వేయాలి.
ఒక మహిళ యొక్క గర్భం ప్రాథమిక దశలో ఉంది అప్పుడు ఆమెకు ఒక దుర్ఘటన జరిగి, చాలా రక్తస్రావం జరిగింది. దాని వలన గర్భంలోని శిశువు మరణించింది. ఇలాంటి సందర్భంలో ఆమె ఉపవాసాలు విరమించాలా లేక కొనసాగించాలా? ఒకవేళ ఉపవాసం విరమిస్తే అది పాపం అవుతుందా?
నా అబిప్రాయం మేరకు గర్భవతికి ఋతుస్రావం జరుగదు, ఇమాం అహ్మద్ రహిమహుల్లాహ్ ప్రవచనం మేరకు స్త్రీలకు ఋతుస్రావం ఆగిపోవడం ద్వారా తన గర్భం గురించి తెలుస్తుంది. మరియు కొంతమంది విద్వాంసుల అభిప్రాయం ప్రకారం, ఋతుస్రావాన్ని అల్లాహ్ సృష్టించడం వెనుక గల వివేకం ఏమిటంటే తల్లి గర్భంలోని శిశువు కోసం అది ఆహారంగా పనిచేస్తుంది. అందువలన గర్భం దాల్చగానే ఋతుస్రావం ఆగిపోతుంది.
కానీ కొంతమంది స్త్రీలకు గర్భందాల్చిన తరువాత కూడా ఋతుస్రావం కొనసాగుతుంది. అప్పుడు ఇలాంటి స్త్రీ నుండి వెలువడే రక్తం నిజమైన ఋతుస్రావంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే అది గర్భధారణ ప్రభావం కూడా చూపకుండా కొనసాగుతుంది. ఇలాంటి రక్తస్రావం కూడా ఋతుస్రావ స్త్రీలను నిరోధించిన ప్రతి దాన్నీ నిరోధిస్తుంది మరియు ఋతుస్రావ స్త్రీలకు తప్పనిసరి విధి గావించబడిన ప్రతిదీ ఈమెకు కూడా విధి అవుతుంది.
సారాంశం ఏమింటంటే, గర్భవతి నుండి వెలువడే రక్తస్రావం రెండు రకాలు:
ఒక రకమైన రక్తస్రావం ఋతుస్రావంగా భావించబడుతుంది. మరియు ఈ రక్తం గర్భం దాల్చిన తర్వాత కూడా మొదటి లాగానే స్రవిస్తుంది. దీని అర్ధం ఏమిటంటే అది గర్భం యొక్క ప్రభావానికి లోను కాలేదు కనుక అది ఋతుస్రావంగా పరిగణించబడుతుంది.
రెండవ రకం: ఈ రక్తస్రావం ఏదైనా దుర్ఘటన కారణంగానో లేదా బరువైన వస్తువులు ఎత్తడం వల్లనో లేదా పడిపోవడం వల్లనో వెంటనే స్రవిస్తుంది అప్పుడు అది ఋతురక్తస్రావం కాదు అది నరం నుండి స్రవించే రక్తమై ఉంటుంది. అది నమాజులను, ఉపవాసాలను నిరోధించదు. బదులుగా ఆమె పరిశుద్దురాలుగానే పరిగణించ బడుతుంది.
ఒకవేళ ప్రమాదవశాత్తు దుర్ఘటన వలన కడుపులోని బిడ్డ లేదా గర్భం పడిపోతే ఇస్లామీయ విద్వాంసులు అభిప్రాయం రెండు రకాలుగా ఉంది: మొదటిది: గర్భంలోని బిడ్డ ఒకవేళ రూపు రేఖలు, ఆకారం తయారైన తర్వాత మరణిస్తే, అప్పుడు స్రవించే రక్తం పురుడు ముట్టు (నిఫాస్) గా పరిగణించబడుతుంది. అందులో ఆమె నమాజు, ఉపవాసం మానుకోవాలి మరియు శుద్ది పొందేంత వరకు ఆమె భర్త ఆమెతో రమించరాదు.
రెండవరకం: గర్భస్థ శిశువు యొక్క రూపురేఖలు, ఆకారం తయారవడానికి ముందే గర్భస్రావం జరిగితే, దాని తరువాత వెలువడే రక్తం పురుటి ముట్టు (నిఫాస్) అనబడదు గానీ చెడురక్తంగా భావించబడుతుంది. అది ఆమె నమాజులు, ఉపవాసాలకు అవరోధకం కాదు.
ఇస్లామీయ విద్వాంసులు చెప్పేదేమిటంటే తల్లి గర్భంలో శిశువు రూపురేఖలు, ఆకారం కనబడటానికి కనీస సమయం 81 రోజులు పడుతుంది. ఎందుకంటే పిండము తల్లి గర్భంలో ఉన్నది. అబ్దుల్లాహ్ బిన్ మసూద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : సత్యసందేశహరుడైన దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: "ప్రతీ వ్యక్తి తన తల్లి కడుపులో 40 రోజుల వరకు రేతస్సూ’గా ఉంటాడు, ఈ వ్యవధిలో రక్తం ముద్దగా ఉంటాడు మళ్ళీ అంతే వ్యవధి వరకు మాంసం ముద్దగా ఉంటాడు, అనంతరం అతని వద్దకు ఒక దూత పంపించబడతాడు. అతనికి నాలుగు విషయాలు వ్రాయమని ఆదేశించబడతుంది. కనుక ఆ దూత ఆ బిడ్డ యొక్క వయసు, ఉపాధి, కర్మలు మరియు మంచి లేక చెడ్డవాడనే విషయాలు లిఖిస్తాడు. కనుక ఈ సమయానికి ముందు కడుపులో శిశువు కనిపించడం అసాధ్యం, సాధారణంగా 90 రోజుల లోపల రూపురేఖల నిర్మాణం కనిపించదని కొంతమంది విద్వాంసులు వివరించారు.
ఒక మహిళ ఇలా ప్రశ్నిస్తుంది ఒక సంవత్సరం ముందు 3వ నెలలో నా గర్భం పడిపోయింది శుద్దిపొందే వరకు నేను నమాజు చేయలేదు, నేను నమాజు చేయడం తప్పనిసరి (వాజిబు) అని నాకు చెప్పబడింది, ఇప్పుడు నేను ఏమి చేయాలి ఖచ్చితమైన రోజులను నేను లెక్కించలేదు?
ఇస్లామీయ విద్వాంసుల దృష్టిలో ఎవరైనా గర్భవతి మూడు నెలల శిశువు గర్భస్రావానికి గురైతే ఆమె నమాజు చేయనవసరం లేదు. ఎందుకంటే మనిషి రూపురేఖలు దిద్దుకున్న తర్వాత శిశువును స్త్రీ కోల్పోయినప్పుడు స్రవించే రక్తం ప్రసవానంతర రక్తస్రావంగా పరిగణించబడుతుంది మరియు ఆ స్థితిలోని స్త్రీలు నమాజు ఆచరించకూడదు.
ఉలమాల అభిప్రాయం ప్రకారం శిశువు రూపురేఖలు 81 రోజులు పూర్తి అయిన తర్వాతే కనిపిస్తాయి మరియు ఈ వ్యవధి 3 నెలల కంటే తక్కువగా ఉంది. కనుక ఒకవేళ స్త్రీకు గర్భస్థ శిశువు మూడు నెలలు పూర్తి చేసుకున్నది అనే గట్టి నమ్మకం ఉన్నట్లయితే, ఆ స్రవించే రక్తం పురుటి ముట్టుగా (నిఫాస్) పరిగణించబడుతుంది. కానీ ఒకవేళ గర్భస్థ శిశువును 80 రోజులకు ముందుగానే కోల్పోయినట్లయితే, అప్పుడు స్రవించే రక్తం చెడు రక్తంగా భావించబడుతుంది. దీనివల్ల ఆమె నమాజు వదిలిపెట్టకూడదు.
ఇప్పుడు పైన ప్రస్తావించబడిన మహిళ తన గురించి బాగా గుర్తుకు తెచ్చుకోవాలి. ఒకవేళ ఆ శిశువు 80 రోజులకు ముందుగానే మరణిస్తే ఆ నమాజులను ఆమె ఖజా చేసుకోవాలి. ఒకవేళ ఆమెకు తప్పిపోయిన ఆ ఉపవాసాల సంఖ్య తెలియనట్లయితే, బాగా గుర్తు చేసుకుని గట్టిగా గుర్తున్న రోజులన్ని ఉపవాసాలకు ఖజా పూర్తి చేయాలి.
ఒక స్త్రీ ప్రశ్నిస్తున్నది: ఉపవాసాలు విధి అయినప్పటినుండి ఆమె రమదాను ఉపవాసాలు పాటిస్తున్నది కానీ బహిష్టుల సమయంలో తప్పిపోయిన ఉపవాసాలు తిరిగి ఖజా చేయడం లేదు మరియు అలా తప్పిపోయిన ఉపవాసాల సంఖ్య ఆమెకు తెలియదు. అయితే ఆమె తనపై విధిగా ఉన్న విషయం ఏమిటో దాని వైపుకు మార్గదర్శనం చేయమని కోరుతుంది.
ముస్లిం స్త్రీలు ఇలా చేయడం పట్ల మేము చింతిస్తున్నాము ఎందుకంటే విధిగా ఉన్న ఉపవాసాలు ఖజా చేయక పోవడానికి కారణం అజ్ఞానమే అయి ఉంటుంది లేదా బద్ధకం, సోమరితనం అయి ఉంటుంది అయితే ఈ రెండు కూడా ప్రమాదకరమే! అజ్ఞానం వల్ల అలా జరిగితే, ఆమె విద్యనార్జించి, విజ్ఞులను అడిగి తెలుసుకోవాలి. అదే బద్దకం వల్ల అయితే అల్లాహ్ భయభీతిని కలిగి ఉండాలి. దైవశిక్షలకు భయపడాలి. ఆయన ప్రసన్నత కొరకై తాపత్రయ పడాలి.
పైన ప్రస్తావించబడిన మహిళ, జరిగిన తప్పును గ్రహించి, అల్లాహు తఆల వద్ద స్వచ్ఛమైన తౌబా చేసుకోవాలి మరియు తప్పిన పోయిన ఉపవాసాలన్నీ గుర్తుచేసుకుని ఒక నిర్దిష్ట అనుమానం ప్రకారం వాటి సంఖ్యను లెక్కించి, వాటి ఖజా పూర్తి చేయాలి. ఈ విధంగా ఆమె తనపై విధిగావించబడిన భాధ్యత నుండి బయట పడగలదు, అల్లాహు తఆల ఆమె తౌబా ఆమోదించాలని మేము ప్రార్థిస్తున్నాము.
సలాహ్ (నమాజు) సమయం అయిపోయిన తర్వాత స్త్రీకు ఋతుస్రావం మొదలైతే దాని ఆదేశం ఏమిటి? శుద్ది పొందిన తర్వాత ఆ సలాహ్ ఆమెపై ఖజా చేయడం విధిగా ఉంటుందా ? ఇదేవిధంగా ఒకవేళ సలాహ్ సమయం ముగియడానికి ముందు శుద్దిపొందినట్లయితే దాని ఆదేశం ఏమిటి ?
మొదటిది: సలాహ్ (నమాజు) సమయం దాటిన తర్వాత స్త్రీకు బహిష్టు మొదలైతే, అప్పటివరకు ఆమె సలాహ్ ఇంకా చదవనట్లయితే, పరిశుద్దిపొందిన తర్వాత ఆ సలాహ్ ను ఆమె ఖజా చేయవలసి ఉంటుంది. ఎందుకంటే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారు: "ఎవరైతే సలాహ్ యొక్క ఒక్క రకాతు పొందినా అతను పూర్తి నమాజును పొందినట్లే". కనుక స్త్రీకు ఏదేని సలాహ్ యొక్క ఒక్క రకాతు సమయం దొరికినా, ఆ సలాహ్ మొదలు పెట్టడానికి ముందే ఆమెకు బహిష్టు మొదలైతే, శుద్దిపొందిన తర్వాత ఆ సలాహ్ ను ఆమె ఖజా చేయవలసి ఉంటుంది.
రెండవది: ఒకవేళ ఆమె సలాహ్ సమయం ముగియడానికి ముందు ఆమె పరిశుద్ది పొందినట్లయితే, ఆమెపై ఆ సలాహ్ ఖజా చదవడం విధి అవుతుంది. ఒకవేళ ఆమె ఫజ్ర్ సమయం ముగియటానికి ఒక రకాతు సమయం ముందు శుద్దిపొందినా, ఆమెపై ఫజ్ర్ నమాజు ఖజా చేయడం విధి అవుతుంది. అదేవిధంగా ఒకవేళ సూర్యాస్తమయానికి ఒక రకాతు సమయం ముందు శుద్ది పొందినట్లయితే, ఆమె పై అస్ర్ సలాహ్ ఖజా చేయడం విధి అవుతుంది. ఒకవేళ ఇషా సలాహ్ ఒక రకాతు సమయానికి ముందు శుద్దిపొందినట్లయితే ఆమెపై ఇషా సలాహ్ ఖజా చేయడం తప్పనిసరి అవుతుంది. ఇషా సలాహ్ సమయం అయిపోయిన ర్వాత ఆమె పరిశుద్దత పొందినట్లయితే, ఇషా సలాహ్ ఆమెపై విధికాదు. అప్పుడు ఆమెపై ఫజర్ సలాహ్ దాని సమయంలో చేయవలసి ఉంటుంది. అల్లాహు తఆలా ఇలా ప్రకటించాడు: అయితే పరిస్థితులు కుదుటపడిన తర్వాత మాత్రం సలాహ్ నెలకొల్పండి. నిస్సందేహంగా సలాహ్ ను నిర్ణీత వేళల్లో చేయడం విశ్వాసులకు విధిగాలించబడింది.{నిసా :103} అనగా: ప్రతి సలాహ్ కొరకు ఒక సమయ పరిమితి విధిగావించబడింది. సలాహ్ సమయం దాటిన తర్వాత దానిని పూర్తి చేయడం సమంజసం కాదు. అలాగే సమయం కాక ముందే ఆ సలాహ్ చేయడం కుదరదు.
నాకు సలాహ్ చేస్తున్న సమయంలో బహిష్టు మొదలైంది. నేను ఏం చేయాలి? మరియు బహిష్టు సమయంలో తప్పిన నమాజులు నేను ఖజా చేయవలసి ఉందా?
సలాహ్ సమయం గడిచిన తర్వాత స్త్రీకి బహిష్టు మొదలైతే, అనగా పొద్దువాలిన అర్ధగంట తర్వాత ఆమెకు బహిష్టు మొదలైతే, శుద్దిపొందిన తర్వాత ఆ సలాహ్ ఖజా చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఆ సలాహ్ సమయం ప్రారంభమైనప్పుడు ఆమె పరిశుద్దావస్థలో ఉంది. ఎందుకంటే అల్లాహు తఆలా ఇలా ప్రకటించాడు: "నిశ్చయంగా సలాహ్ (నమాజు) విశ్వాసులపై నిర్ణీత సమయంలో విధిగావించబడింది. {నిసా:103}
మరియు స్త్రీ పై బహిష్టు సమయంలో తప్పిపోయిన నమాజుల ఖజా లేదు. ఎందుకంటే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక హదీథులో ఇలా ప్రవచించారు: స్త్రీ బహిష్టు సమయంలో సలాహ్ చేయదు మరియు ఉపవాసమూ పాటించదు కదా! అంతేకాదు ఇస్లామీయ విద్వాంసులు ఏకీభవించిన ప్రకారం స్త్రీ బహిష్టులో తప్పిపోయిన నమాజులను తిరిగి చేయదు.
కానీ ఆమె ఒక రకాతు లేదా అంతకంటే అధిక సమయం మిగిలి ఉన్నప్పుడు పరిశుద్దత పొందినట్లయితే, ఏ సలాహ్ సమయంలో శుద్ది పొందిందో, ఆ సలాహ్ ఖజా చేయవలసి ఉంటుంది. ఎందుకంటే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారు, "ఎవరైతే సూర్యాస్తమయానికి ముందు అస్ర్ యొక్క ఒక రకాతును పొందుతారో, వారు అస్ర్ సలాహ్ పాటించినట్లే". ఎవరైతే సూర్యాస్తమయానికి ముందు అస్ర్ సలాహ్ సలాహ్ సమయంలో శుద్ది పొంది, ఒక రకాతు చేసే సమయం పొందినట్లయితే లేదా సూర్యోదయానికి ముందు శుద్దిపొంది ఒక రకాతు చేసే సమయం పొందినట్లయితే, అప్పుడు మొదటి సందర్భంలో అస్ర్ సలాహ్, రెండవ సందర్భంలో ఫజ్ర్ సలాహ్ ఖజా పూర్తి చేయవలసి ఉంటుంది.
నా తల్లికి 65 సంవత్సరాల వయసు నిండినది.19 సంవత్సరాల నుండి ఆమెకు సంతానం కలుగలేదు. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఆమెకు రక్తస్రావం జరుగుతుంది. చూస్తే ఇది ఒక జబ్బుగా అనిపిస్తుంది. ఇంకా ఇటు రమదాను మాసం కూడా దగ్గర పడుతున్నది. కనుక ఆమెకు మీరు ఏమని హితబోధ చేస్తారు? మరియు ఇలాంటి స్త్రీ ఏం చేయవలసి ఉంటుందో స్పష్టంగా తెలియ జేయగలరు?
ఇటువంటి స్త్రీ, ఎవరికైతే రక్తస్రావం జరుగుతూ ఉంటుందో వారి కొరకు ఆదేశం ఏమిటంటే, ‘ఈ వ్యాధి మొదలు కావడానికి ముందు అలవాటు ప్రకారం తెలిసిన బహిష్టు రోజులను లెక్కించి, అన్ని రోజులలో సలాహ్, ఉపవాసం విడిచిపెట్టాలి. ఉదాహరణకు ఒకవేళ ఆమె అలవాటు అనగా ప్రతీ నెల ప్రారంభంలో 6 రోజులు ఋతుస్రావం కలుగుతూ ఉంటే, అప్పుడు ఆమె ప్రతీనెలా మొదటి ఆరు రోజులు సలాహ్, ఉపవాసమూ విడిచి పెట్టాలి. 6 రోజులు గడిచిన తర్వాత గుసుల్ ఆచరించి సలాహ్, ఉపవాసం పాటించాలి.
ఇటువంటి స్త్రీలు సలాహ్ చేసే విధానం ఏమిటంటే, వారు తమ మర్మాయవాన్ని చక్కగా శుబ్రపరుచుకుని ఒక ప్యాడ్సు ధరించాలి. తరువాత ఉదూ చేయాలి, ఆమె ఈ పని ఫర్ద్ సలాహ్ సమయం మొదలు కాగానే చేయాలి. ఇదే విధంగా ఫర్ద్ సలాహ్ మినహా, ఎప్పుడైనా సున్నతు, నఫిల్ సలాహ్ లు చేయాలని తలిస్తే, అప్పుడు కూడా ఆమె ఇలాగే చేయవలసి ఉంటుంది.
ఈ స్థితిలోగల సంక్లిష్టతను బట్టి ఆమె జొహ్ర్'ను, అస్ర్ తో జమా చేసి ఆచరించవచ్చు. అలాగే మగ్రిబు సలాహ్ ను, ఇషా సలాహ్ తో కలిపి ఆలస్యంగా చేయడానికి కూడా అనుమతి ఉంది. చివరికి ఆమె ఈ ఆచరణ రెండు నమాజుల కొరకు ఒకే విధంగా واحدًا للصلاتين ఉంటుంది. واحدًا للصلاتين: మగ్రిబు మరియు ఇషా సలాహ్ మరియు ఫజ్ర్ సలాహ్ కోసం అంటే ఐదు పూటలు చేయడానికి బదులు మూడు పూటల సలాహ్ లు మూడు వేళల్లోనే చేయవచ్చు.
నేను రెండవసారి మరలా చెప్పేది ఏమిటంటే : అలాంటి స్త్రీ పరిశుద్దత పొంద దలచినపుడు, మర్మాంగాన్ని పరిశుభ్రపరుచుకుని, దానిపై ప్యాడు కట్టుకోవాలి తద్వారా వెలువడే రక్తం తగ్గుతుంది, పిదప ఉదూ చేసుకుని సలాహ్ ఆచరించాలి. నాలుగు రకాతులు జుహ్ర్, నాలుగు రకాతులు అస్ర్ పూర్తి చేయాలి. మగ్రిబ్ సమయం అయిన తరువాత మూడు రకాతులు మగ్రిబు సలాహ్ మరియు నాలుగు రకాతులు ఇషా సలాహ్ చేయాలి. ఫజ్ర్ సమయం అవగానే రెండు రకాతులు ఫజ్ర్ సలాహ్ చేయాలి. అంటే, ఆమె ఈ నమాజుల్లో ఖస్ర్ చేయదు. కొంతమంది ఖస్ర్ చేయవచ్చనే అపోహకు గురైఉన్నారు. అయితే ఆమె కొరకు జుహ్ర్, అస్ర్ ఒకేసారి; మగ్రిబు మరియు ఇషా ఒకేసారి కలిపి చేసే అనుమతి ఉంది. అనగా జుహ్ర్’ని అస్ర్’తో పాటు లేదా అస్ర్’ను జుహ్ర్’తో పాటు మరియు ఇదేవిధంగా మగ్రిబును ఇషాతో పాటు లేదా ఇషాను మగ్రిబుతో పాటు కలిపి జమా తాఖీర్ లేదా జమా తకదీమ్ చేసుకోవచ్చు. ఇదేవిధంగా ఒకవేళ ఆమె అదే ఉదూతో సున్నతులు, నఫిల్ సలాహ్ లు చేయాలని కోరుకుంటే, అలా చేయడంలో ఎలాంటి సమస్యా లేదు.
దర్స్ మరియు ఖుత్బా వినడానికి బహిష్టులో ఉన్న స్త్రీ మస్జిదే హరామ్ లోపల ఆగటానికి సంబంధించిన ఆదేశం ఏమిటి?
బహిష్టు స్త్రీ మస్జిదే హరాం లేక ఇతర మస్జిదులలో ఆగటానికి అనుమతి లేదు. కానీ మస్జిదు గుండా వెళ్ళడం, అవసరమైన వస్తువులు తీసుకోవడానికి మస్జిదులో ప్రవేశించడం, మొదలైన అత్యావసరాలకుఅనుమతి ఉంది. మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయిషా రదియల్లాహు అన్హాతో {1} 'అల్ ఖమ్ర’ తెప్పించినప్పుడు ఆమె సమాధానంగా ‘అల్ ఖుమ్ర మస్జిదులో ఉంది, నేను బహిష్టులో ఉన్నాను అని చెప్పగా, దానికి మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సమాధానమిచ్చారు, "ఋతుస్రావం నీ చేతులకు లేదు కదా." కనుక ఋతుస్రావంలోని స్త్రీ, మస్జిదులో రక్తం పడుతుంది అనే భయం లేనట్లయితే ఆమె మస్జిదులో వెళ్ళవచ్చు.
కానీ వారు అక్కడ కూర్చునే ఉద్దేశ్యంతో ప్రవేశిస్తే మాత్రం వారికి అనుమతి లేదు.
దీనికి ఆధారం ఏమిటంటే, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సలాహ్ గురించి స్త్రీలకు ఇలా ఆదేశించారు: "వారు యువతులను స్త్రీలను మరియు బహిష్టులో ఉన్న స్త్రీలను ఈద్గాకు తీసుకుని వెళ్ళాలి, కానీ బహిష్టు ఉన్న స్త్రీలు ఈద్గా’కు కొంచెం దూరంలో కూర్చోవాలి. దీని వలన ఋజువు అవుతున్నది ఏమిటంటే, ’ఖుత్బా ప్రసంగం, హితబోధ మరియు పాఠాలు వినడానికి బహిష్టులో ఉన్నస్త్రీ మస్జిదులో ఆగడానికి అనుమతి లేదు.
*
సలాహ్ (నమాజు) విషయంలో శుద్ధికి సంబంధించిన కొన్ని ఆదేశాలు:
స్త్రీ మర్మాంగం నుండి తెలుపు లేక లేత పసుపు రంగులో వెలువడే ద్రవం అశుద్దమా? లేదా శుద్దమా? అది అవిరామంగా వెలువడిన సందర్భంలో ఉదూ చేయడం తప్పనిసరి (వాజిబు) అవుతుందా? ఒకవేళ విరామంలో వెలువడినట్లయితే, దాని ఆదేశం ఏమిటి? ముఖ్యంగా చాలామంది విద్యార్థినిలు ఇది స్వాభావికమైనదని దీని కోసం ఉదూ తప్పనిసరి కాదని భావిస్తారు?
క్షుణ్ణంగా పరిశోధించిన తర్వాత నాకు స్పష్టంగా తెలిసింది ఏమిటంటే స్త్రీ మర్మాంగం నుండి వెలువడే ద్రవం ఒకవేళ మూత్రనాళం నుండి కాకుండా గర్భం నుండి వెలువడుతున్నట్లయితే అది శుద్దమైనదవుతుంది. కానీ మర్మాంగం నుండి వెలువడుతున్నందుకు ఉదూభంగం అయి పోతుంది ఎందుకంటే ఉదూ భంగం అయ్యేందుకు, ఆ వెలువడే ద్రవం అశుద్దమై ఉండాలనే షరతు ఏమిలేదు. ఉదాహరణకు మలద్వారం నుండి వాయువులు వెలువడతాయి వాయువుకు ఏ భౌతికతా లేదు అయినప్పటికీ అది ఉదూను భంగం చేసేదిగా పేర్కొనబడినది.
అలాగే ఒకవేళ స్త్రీ ఉదూలో ఉంది ఆపై మర్మాంగం గుండా ఏదేని ద్రవం వెలువడినట్లయితే, ఆమె ఉదూ భంగం అవుతుంది. ఆమె మళ్ళీ ఉదూ చేసుకోవలసి ఉంటుంది.
ఒకవేళ ఈ ద్రవం నిరంతరంగా వెలువడుతున్నట్లయితే, అది ఉదూను భంగ పర్చదు. అయితే ఇలాంటి సందర్భంలో స్త్రీ సలాహ్ (నమాజు) సమయం అయినప్పుడు, సలాహ్ కోసం ఉదూ చేసుకోవాలి. ఆ ఉదూతో ఫర్ద్, సున్నతు, నఫిలు చేసుకోవచ్చు. ఖుర్ఆను పారాయణం చేసుకోవచ్చు, ఇంకా ఆ స్త్రీకు అనుమతించబడిన పనులు చేసుకోవచ్చు. ఇస్లామీయ విద్వాంసులు సిల్సిలుల్ బౌల్ (నిరంతరంగా మూత్ర బిందువులు విసర్జిత వ్యాధి) గురించి ఈ విధంగా తెలియజేశారు: "ఇదే గర్భం నుండి విసర్జిత మయ్యే ద్రవాలకు సంబంధించిన ఆదేశం - ఈ ద్రవం శుద్దమైనది, కానీ ఆగుతూ ఆగుతూ వస్తుంటే మాత్రం ఉదూను భంగం చేసేదిగా పరిగణించబడుతుంది. కానీ అవిరామంగా, ప్రవాహంలా వస్తుంటే మాత్రం ఉదూను భంగం చేసేదిగా భావించబడదు. అయితే ఈ సందర్భంలో స్త్రీ ఖచ్చితంగా సలాహ్ సమయం అయినప్పుడు ఉదూ చేసుకుని తన మర్మాంగానికి సురక్షణకై ప్యాడ్ కట్టుకోవాలి.
ఒకవేళ ఈ ద్రవం, విరామంతో వస్తూ, సలాహ్ సమయంలో ఆగిపోతే, ఎప్పుటి వరకైతే ఈ ద్రవం ఆగిపోతుందో అప్పటి వరకు సలాహ్ వాయిదా వేసుకోవాలి. సలాహ్ సమయం మాత్రం ముగియ కూడదు. ఒకవేళ సమయం దాటుతుందనే భయం ఉంటే ప్యాడ్ కట్టుకుని, సలాహ్ చేయాలి.
స్రవించే ద్రవపదార్థం ఎక్కువైనా లేదా తక్కువైనా అందులో ఎలాంటి తేడా లేదు, ఎందుకంటే మర్మాంగం నుండి వెలువడే ప్రతీ పదార్థం అది గరిష్ట కనిష్టాలలో ఏ మోతాదైన సరే ఉదూ భంగమవుతుంది. అయితే దీనికి విరుద్దంగా ఇతర శరీర అవయవాల నుండి వెలువడే ద్రవపదార్ధం అనగా రక్తం గానీ లేక కక్కడం వల్ల గానీ ఉదూ భంగమవ్వదు. అది తక్కువై మోతాదులో నైనా, ఎక్కువ మోతాదులో నైనా సరే.
ఇక కొంతమంది స్త్రీల అభిప్రాయం ప్రకారం, ప్రస్తావిత తడి స్వాభావికంగా జరిగే ఒక విషయం అవటం వలన ఇది ఉదూను భంగపర్చదని అంటారు. కానీ నా జ్ఞానం మేరకు, దీనిని నిరూపించే ఎటువంటి ఋజువూ లేదు. కానీ ఇబ్నె హజమ్ రహిమహుల్లాహ్ వాక్కు ప్రకారం ‘దానివల్ల ఉదూ భంగమవ్వదు. ఆయన దీనికి ఎటువంటి ఆధారం ప్రస్తావించలేదు ఒకవేళ ఖుర్ఆను, హదీథులలో సహబాల ప్రవచనాలలో ఏదేని ఆధారం లభ్యమై ఉంటే, ఖచ్చితంగా ఇది ఒక గట్టి ఋజువుగా ఉండేది.
కనుక స్త్రీ ఎల్లప్పుడూ అల్లాహు తఆలా యొక్క భయభీతి కలిగి ఉండాలి. మరియు పరిశుభ్రత పట్ల ఆసక్తిని కనబర్చాలి. ఎందుకంటే తహారతు లేకుండా వందసార్లు సలాహ్ చేసినా, అది స్వీకరించబడదు. ఇంకా కొంతమంది ఉలెమాల అభిప్రాయం ప్రకారం ‘తహరతు’ లేకుండా సలాహ్ చేసేవాడు కాఫిరు అవుతాడు. ఎందుకంటే ఇది అల్లాహు ఆయతులా పట్ల పరిహాసమాడటంగా భావించ బడుతుంది.
ఒక స్త్రీకు మర్మాంగం నుండి తడి అవిరామంగా వెలువడుతుంది ఒకవేళ ఆమె ఫర్ద్ సలాహ్ (నమాజు) కోసం ఉదూ చేసుకుని మళ్ళీ రెండవ ఫర్ద్ సలాహ్ సమయం వచ్చేంత వరకు ఆ ఉదూతోనే సున్నతులు, నఫిల్ సలాహ్ చేయవచ్చునా? ఖుర్ఆను పారాయణం చేయవచ్చునా?
ప్రస్తావిత స్త్రీ ఫర్ద్ సలాహ్ కోసం మొదటి సమయంలో ఉదూ చేసుకుని తదుపరి ఫర్ద్ సలాహ్ వచ్చే వరకు ఆమె ఆ ఉదూ ద్వారా ఎన్ని ఫర్ద్ లు, సున్నతులు, నఫిలు సలాహ్ చేయాలనుకుంటుందో చేయ వచ్చును. అంతేకాదు ఖుర్ఆను పారాయణం కూడా చేయవచ్చు.
ప్రస్తావిత స్త్రీ ఫజ్ర్ కోసం చేసిన ఉదూ తో దొహా సలాహ్ చేస్తే అది చెల్లుతుందా?
ఇలా చేయడం మంచిది కాదు. ఎందుకంటే దుహా (చాష్త్) సలాహ్ కోసం ఒక నిర్ణీత సమయం ఉంది. అందువలన సమయం ముగిసిన తర్వాత ఆమె కోసం ఉదూ చేయడం తప్పనిసరి. ఎందుకంటే ఈ స్త్రీ ముస్తహాదా ఆదేశంలో ఉంది. ముస్తహాదాతో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతీ సలాహ్ కోసం ఉదూ చేయాలని ఆదేశించారు!
జుహ్ర్ సమయం: జుహ్ర్ సమయం మిట్టమధ్యానం దాటిన తరువాత నుండి అస్ర్ సలాహ్ సమయం వరకు ఉంటుంది.
అస్ర్ సలాహ్ సమయం: జుహ్ర్ సలాహ్ సమయం ముగిసినప్పటి నుండి సూర్యుడు పసుపు రంగులోకి మారే వరకు అంటే సూర్యాస్తమయం వరకు ఉంటుంది.
మగ్రిబు సలాహ్ సమయం సూర్యాస్తమయం తరువాత నుండి షఫఖ్ అహ్మర (ఎర్రని వెలుగు) మాయమై పోయేంత వరకు ఉంటుంది.
ఇషా సలాహ్ సమయం షఫఖ్ అహ్మర్ (ఎర్రని వెలుగు) మాయమై పోయిన తర్వాత నుండి అర్ధరాత్రి వరకు ఉంటుంది.
ప్రస్తావిత స్త్రీ కొరకు ఇషా ఉదూతో అర్ధరాత్రి తర్వాత తహజ్జుదు సలాహ్ చేయడం చెల్లుతుందా?
లేదు! ఒక అభిప్రాయం ప్రకారం అర్ధరాత్రి గడిచిన తర్వాత ఆ స్త్రీ పై కొత్తగా ఉదూ చేయడం తప్పనిసరి మరొక అభిప్రాయం ప్రకారం కొత్తగా ఉదూ చేయడం తప్పనిసరి కాదు. ఈ రెండవ అభిప్రాయం సమంజసమైనది.
ఇషా సలాహ్ యొక్క చివరి సమయం మరియు దాన్ని తెలుసుకునే విధానం ఏమిటి?
ఇషా సలాహ్ యొక్క చివరి సమయం అర్ధరాత్రి వరకు ఉంటుంది. మరియు దానిని తెలుసుకునే విధానం ఏమిటంటే సూర్యాస్తమయం మరియు ఫజ్ర్ సమయానికి (ఉషోదయానికి) మధ్య సమయాన్ని రెండు భాగాలుగా విభజించాలి. మొదటి సగం పూర్తయ్యేసరికి ఇషా సలాహ్ సమయం ముగిసిపోతుంది. మరియు రాత్రి యొక్క మిగతా సగభాగం ఇషా సమయం కాదు. బదులుగా ఇషా మరియు ఫజ్ర్ మధ్యలో ఒక సమయం తెర’గా పరిగణించబడింది.
స్త్రీకు ప్రస్తావిత తడి పదార్ధం ఆగి ఆగి వస్తుంది. ఒకవేళ ఆమె ఉదూ చేసుకున్నట్లయితే, ఉదూను ముగించుకున్న తర్వాత సలాహ్ చేసే ముందు మళ్ళీ తడి వచ్చినట్లయితే ఏమి చేయాలి?
ఒకవేళ ఈ తడిపదార్ధం ఆగి, ఆగి వస్తున్నట్లయితే, ఆమె అది పూర్తిగా ఆగి పోయేంత వరకు వేచి ఉండాలి. కానీ ఒకవేళ స్పష్టమైన మార్గం లేనట్లయితే అనగా కొంత సమయం తడి అవుతుంది, మరికొంత సమయం ఆగిపోతూ ఉంటే, సలాహ్ సమయంలో ఉదూ చేసుకుని సలాహ్ చేసుకోవాలి. ఇలా చేస్తే ఆమెపై ఎలాంటి దోషమూ ఉండదు.
ప్రస్తావిత తడి శరీరం లేక దుస్తులకు అంటినట్లయితే దాని ఆదేశం ఏమిటి?
ప్రస్తావిత తడి అశుద్దం కానప్పుడు ఎలాంటి సమస్యా లేదు. కానీ అది అశుద్దమై యుండి మూత్రనాళం నుండి వెలువడుతున్నట్లయితే దానిని కడగడం తప్పనిసరి.
ప్రస్తావిత తడి నుండి ఉదూ చేయు సందర్భంలో కేవలం ఉదూలో కడిగే అవయవాలు కడగితే సరిపోతుందా? తెలుపగలరు.
అవును! ఒకవేళ ఈ తడి మూత్రనాళం నుండి కాకుండా గర్భసంచి నుండి వెలువడినట్లయితే, కేవలం ఆ అవయవాలు కడిగితే సరిపోతుంది.
మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ప్రస్తావిత తడి కారణంగా ఉదూ భంగమవుతుందనడానికీ ఏ హదీథు ప్రవచింప బడలేదు. దీనికి గల కారణమేమిటి? చూడబోతే సహాబీయాతులు ధార్మిక విషయాలను అడిగి తెలుసుకోవడంలో చురుకుగా ఆసక్తిని కనబరచేవారు కదా?
దీనికి గల కారణం అలాంటి తడి అనేది ప్రతీ స్త్రీకు స్రవించదు.
ప్రస్తావిత సమస్యలో షరియతు పరమైన ఆదేశం తెలియక, ఎవరైతే ఉదూ చేయలేదో ఆమె ఏమి చేయాలి?
అల్లాహు తఆలాతో తౌబా చేసుకోవడం ఆమెపై తప్పనిసరి (వాజిబు) మరియు దీని గురించి ఇస్లామీయ పండితులను సంప్రదించి తెలుసుకోవాలి.
కొంతమంది మీ వైపుకు ఆపాదిస్తూ ప్రస్తావిత తడి వలన ఉదూ తప్పనిసరి (వాజిబు) కాదు అని చెప్పారు. దీనికి మీ సమధానం ఏమిటి?
ఎవరైతే నా వైపుకు ఈ మాటను ఆపాదించాడో అతను అబద్దీకుడు మరియు బాహ్యంగా అతను నేను చెప్పిన "ప్రస్తావిత తడి అశుద్దం కాదు ఉదూను భంగపర్చదు" అనే మాట ద్వారా అపోహకు గురి అయి ఉండవచ్చు.
స్త్రీలకు బహిష్టుకు ఒక రోజు ముందు الكدرة గోధుమ రంగు ద్రవం వస్తుంది. దాని ఆదేశం ఏమిటి? ఈ ద్రవం కొన్ని సార్లు పలుచని దారం రూపంలో నలుపు లేక ఎరుపు నలుపుతో కూడిన రంగులో ఉంటుంది. ఒకవేళ ఇది బహిష్టు తర్వాత వస్తే దాని ఆదేశం ఏమిటి?
ఈ ద్రవం ఒకవేళ బహిష్టు ప్రారంభ సంకేతాలలో ఉన్నట్లయితే అప్పుడు అది బహిష్టుగా పరిగణించబడుతుంది, దానిని అలవాటు ప్రకారం సాధారణంగా స్త్రీకు కలిగే నొప్పి, కళ్ళు తిరగడం ద్వారా గుర్తించవచ్చు.
ఎందుకంటే బహష్టులో కలిసి వచ్చే గోధుమ రంగుని పోలిన ద్రవం వచ్చినట్లయితే, స్త్రీ శుద్దత కోసం వేచి చూడాలి. ఎందుకంటే బహిష్టులో కలిసి వచ్చే గోధుమ రంగు ద్రవం కూడా ఋతుస్రావం అనబడుతుంది. ఆయిషా రదియల్లాహు అన్హా ఇలా పలికారు: మీరు తెలుపు చూడనంత వరకు తొందర పడకండి’వల్లాహు ఆలము.
*
ఉమ్రహ్ మరియు హజ్ ల విషయంలో బహిష్టుకు సంబంధించిన కొన్ని ఆదేశాలు:
బహిష్టులోని స్త్రీ ఇహ్రాంకు చెందిన రెండు రకాతుల సలాహ్ ఎలా చదవాలి మరియు బహిష్టులోని స్త్రీ మనసులో నెమ్మదిగా ఖుర్ఆను దుఆలను చదవడం అనుమతించబడుతుందా?
మొదటిది: మొట్టమొదటగా మనం తెలుసుకోవలిసిన విషయం ఏమిటంటే ఇహ్రాంలో ప్రవేశించేందుకు ప్రత్యేకంగా ఎటువంటి సలాహ్ లేదు. ఎందుకంటే దైవప్రవక్త (స) ద్వారా అది ఋజువు కాలేదు. ప్రవక్త (స) తన మాటల ద్వారా, అంగీకార మౌనం ద్వారా (ఖౌలి, ఫేలీ, తక్రీరి) ద్వారా తన ఉమ్మతుకు ఇహ్రాం కోసం ప్రత్యేకంగా ఎలాంటి సలాహ్ గురించి ఆదేశించలేదు.
రెండవది: ఎవరైతే ఇహ్రాం కట్టుకోవడానికి ముందు బహిష్టుకు గురవుతారో, వారు ఆ అవస్థలోనే ఇహ్రాం కట్టుకోవచ్చు.
ఇక మిగిలిన ప్రశ్న ఏమనగా బహిష్టు స్త్రీ ఖుర్ఆను చదువవచ్చునా? దీనికి సమాధానం ఏమనగా అవసరం మరియు ఉద్దేశాన్ని బట్టి ఆమె ఖుర్ఆను చదువవచ్చు. కానీ ఏ అవసరం మరియు తగిన ఉద్దేశం లేక పోతే, కేవలం ఆరాధన మరియు దైవసామీప్యత సంకల్పంతో ఖుర్ఆను చదువకుండా ఆగిపోవడం ఉత్తమం.
ఒక స్త్రీ హజ్జ్ కోసం ప్రయాణం చేసింది మరియు ప్రయాణం యొక్క ఐదవరోజు ఆమెకు బహష్టు మొదలైంది. మీఖాతుకు చేరుకుని గుసులు చేసింది ఇహ్రాం కట్టుకుంది. అప్పటికీ ఆమె ఋతుస్రావం నుండి పరశుద్దత పొందలేదు. మక్కా చేరిన తర్వాత హరం నుండి బయట ఉండింది, హజ్జ్ మరియు ఉమ్రా సంభంధిత ఎలాంటి ఆచరణా ఆమె చేయలేదు. రెండు రోజులు ఆమె మీనాలో గడిపింది. పిదప ఆమె బహిష్టు నుండి పరిశుబ్రత పొంది, గుసుల్ చేసింది. పరిశుద్దావస్థలో ఉమ్రా యొక్క మూల ఆచరణలు పూర్తి చేసింది. పిదప హజ్జ్ కోసం తవాఫే ఇఫాదా చేయసాగింది. ఆ సందర్భంలోనే ఆమెకు రెండవ సారి రక్తస్రావం జరిగింది. కానీ సిగ్గుతో తన సంరక్షకుడికి చెప్పలేదు. అదేస్థితిలో హజ్జ్ మనాసిక్ (హజ్జ్ క్రియలు) పూర్తిచేసింది, పిమ్మట దేశానికి చేరిన తర్వాత ఆమె తన సంరక్షకుడికి దీని గురించి చెప్పింది ఇప్పుడు ఆమెకు వర్తించే ఆదేశంఏమిటి?
ప్రస్తావిత స్త్రీకు వర్తించే ఆదేశమేమిటంటే, ఆమె తవాఫే ఇఫాదా సమయంలో స్రవించిన రక్తం అది ఋతుస్రావమయితే దానిని రక్తం యొక్క విధానం మరియు నొప్పి ద్వారా తెలుసుకోగలదు అప్పుడు ఆమె చేసిన తవాఫే ఇఫాదా సరికాదు. దాని కొరకు ఆమె మక్కాకు మరొక సారి వెళ్ళి మీఖాతు నుండి ఉమ్రా ఇహ్రాం ధరించి తవాఫ్ మరియు సయీతో పాటు ఉమ్రా ఆచరించాలి మరియు ఖస్ర్ చేయాలి ఆ తర్వాత తవాఫే ఇఫాదా ఆచరించాలి.
కానీ ఒకవేళ తవాఫే ఇఫాదా సందర్భంలో వచ్చిన రక్తం నెలసరి సహజ రక్త స్రావం కానట్లయితే, బదులుగా గుంపులోని ఒత్తిడి లేక భయం, ఇంకేదైనా కారణంతో ఉన్నట్లయితే, అప్పుడు తవాఫే ఇఫాదా కోసం తహారతు షరతు కాదని భావించినవారి దృష్టిలో ఆమె చేసినది సరైనదిగా భావించబడుతుంది.
మొదటి సందర్భంలో ఒకవేళ మళ్ళీ మక్కాకు వెళ్ళడం సాధ్యపడక పోతే అనగా బహుదూర ప్రాంతం నుండి వెళ్ళిన ప్రయాణికుడైతే అప్పుడు ఆమె హజ్జ్ చెల్లుతుంది. ఎందుకంటే చేసిన దానికి మించి చేయగల శక్తి ఆమెకులేదు కాబట్టి!
ఒక స్త్రీ ఉమ్రా కొరకు ఇహ్రాం ధరించింది. మక్కా చేరుకున్న తర్వాత ఆమెకు బహిష్టు మొదలైంది. ఆమె యొక్క మహ్రం వెంటనే ప్రయాణించ వలసిన నిస్సహాయస్థితిలో ఉన్నాడు. ఆమెకు మక్కాకు సమీపంలో ఎవరు లేరు. అప్పుడు ఆమె ఏమి చేయాలి?
ప్రస్తావిత స్త్రీ ఒకవేళ సౌదీ అరబ్ నివాసి అయితే, ఆమె తన మహ్రంతో మక్కా విడిచి వెళ్లి పోవాలి. మరియు ఇహ్రాం స్థితిలోనే ఉండాలి. ఆపై శుద్ది పొందిన తర్వాత మక్కాకు తిరిగి రావాలి. ఎందుకంటే ఆమెకు మళ్ళీ మక్కాకు రావడం చాలా తేలిక ఆమెకు అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరియు వీసా అవసరం కూడా లేదు.
కానీ ఆ స్త్రీ మరొక దేశం నుండి వచ్చినట్లయితే, మక్కా విడిచి వెళ్ళి, మళ్ళీ తిరిగి ప్రయాణం చేయడం చాలా కష్టం. అప్పుడు ఆమె ఒక లంగూటి (ప్యాడ్) ధరించి తవాఫ్, సయీ చేసి ఖస్ర్ చేయించుకుని అదే ప్రయాణంలో తన ఉమ్రా పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే ఈ స్థితిలో ఆమె తవాఫ్ ఒక అనివార్య అవసరం ఏర్పడింది. మరియు అత్యవసర పరిస్థితులు కొన్ని నిషేధాలను కూడా సమ్మతిస్తాయి.
ఒక స్త్రీ హజ్జ్ దినాలలో బహిష్టు మొదలైతే దాని ఆదేశం ఏమిటి? ఆమె చేసిన ఈ హజ్జ్ చెల్లుతుందా?
స్త్రీకు బహిష్టు ఎప్పుడు మొదలైనదో తెలియకుండా ఈ ప్రశ్నకు సమాధానం తెలపడం అసాధ్యం. ఎందుకంటే హజ్జ్’కు చెందిన కొన్ని ఆచరణలు నెలసరి సమయంలో చేయడానికి వీలు లేదు. తహారతు లేకుండా తవాఫు అసాధ్యం. ఇది తప్పితే ఇతర హజ్జ్ ఆచరణలు నెలసరి సమయంలో కూడా ఆచరించవచ్చు.
నేను గత సంవత్సరం హజ్జ్ చేసి, హజ్జ్ ఆచరణలన్నీ పూర్తి చేసాను. అయితే షరియతు కల్పించిన వెసులుబాటు వలన తవాఫే ఇఫాదా మరియు తవాఫే విదా చేయలేదు. పిమ్మట ఇంకెప్పుడైన మక్కా నగరానికి వచ్చి తవాఫే ఇఫాదా, తవాఫే విదా చేద్దాం అనుకుని మదీనా మునవ్వరాలో ఉన్న నా ఇంటికి తిరిగి వచ్చేశాను. ధార్మిక విషయాల గురించి సరైన జ్ఞానం తెలియక పోవడం వల్ల నేను ప్రతీ విషయం నుండి శుద్ది పొందాను, హలాలు అయ్యాను అని భావించి, ఇహ్రాం సమయంలో నిషేధిత పనులన్నీచేశాను. పిమ్మట నేను మక్కా తిరిగి వచ్చి తవాఫ్ చేయడం గురించి అడిగాను. అప్పుడు నాకు తెలిసిందేమనగా ‘మీరు తవాఫ్ చేయడం సరికాదు, ఎందుకంటే మీరు మీ హజ్జ్ పూర్తి చేయలేదు, ఇప్పుడు మళ్ళీ రాబోయే సంవత్సరం తిరిగి హజ్జ్ పునరావృతం చేయవలసి ఉంటుంది, దాంతో పాటు ఒక ఆవు లేక ఒంటెను ఫిధ్యా రూపంలో జిబహ్ చేసి పరిహారం చెల్లించ వలసి ఉంటుందని తెలిపారు. ఇక్కడ నా ప్రశ్న ఏమనగా ఈ విషయం నిజమా? లేక నా విషయంలో మరేదైనా పరిష్కారం ఉందా? నా హజ్జ్ నిజంగానే నిర్వీర్యమై పోయిందా? మళ్ళీ హజ్జ్ చేయడం నాపై విధిగా ఉంటుందా? ఇప్పుడు నేను ఏం చేయాలో సలహా ఇవ్వగలరు. అల్లాహ్ మీపై సమృద్ది ఫలాలు కురిపించుగాక!
నిజానికి ఇది ఒక ప్రమాదకరమైన పరిస్థితియే! అజ్ఞానంతో ప్రజలు ఫత్వా ఇస్తూ ఉంటారు. ప్రస్తావిత సందర్భంలో మీ పై తప్పనిసరి (వాజిబు) ఏమిటంటే, మక్కా వెళ్ళి, తవాఫే ఇఫాదా పూర్తి చేయవలసి ఉన్నది.
మక్కా నుండి వాపసు బయల్దేరే సమయంలో మీరు ఋతుస్రావంలో ఉన్నారు. కనుక మీ పై తవాఫే విదా తప్పనిసరి (వాజిబు) కాదు. ఎందుకంటే బహిష్టులో ఉన్న స్త్రీ పై తవాఫే విదా వాజిబు కాదు. అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు అన్హుమ ఉల్లేఖన: "ప్రజలకు చివరి ఆచరణగా అల్లాహ్ గృహాన్ని (బైతుల్లాహ్) సందర్శించి, తవాఫ్ చేసి వెళ్ళమని ఆదేశించబడింది. కానీ బహిష్టు స్త్రీలకు మాత్రం మినహాయింపు ఉంది. అబూదావూద్ కథనం ప్రకారం ప్రజల చివరి కార్యక్రమం బైతుల్లా యొక్క ప్రదక్షిణ అయి ఉండాలి. మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సఫియ్య రదియల్లాహు అన్హా తవాఫే ఇఫాదా చేసిన తర్వాత, ఆమెకు నెలసరి ప్రారంభమైంది అని తెలిసినప్పుడు ఇలా సెలవిచ్చారు: అలాగై ప్రయాణానికి బయల్దేరండి.’ ఈ హదీథు నిర్ధారించే విషయం ఏమిటంటే నెలసరి స్త్రీపై తవాఫే విదా లేదు.
కానీ తవాఫే ఇఫాదా ఆచరించడం అనివార్యం. ఇక మీరు ప్రతీదాని నుండి శుద్ది పొందిన విషయానికొస్తే, చూడబోతే ఈ మొదటి తహల్లుల్ అజ్ఞానం మరియు అవగాహనరాహిత్యం వల్ల జరిగింది. కనుక ఇది మీకు నష్టం చేకూర్చదు. ఎందుకంటే ఎవరైతే అజ్ఞానం కారణంగా ఇహ్రాం స్థితిలో ఏదైనా నిషేదాజ్ఞకు పాల్పడినట్లయితే అతనిపై ఏమి ఉండదు. దానికి ఋజువు ఈ ఖుర్ఆను ఆయతు:{رَبَّنَا لاَ تُؤَاخِذْنَا إِن نَّسِينَا أَوْ أَخْطَأْنَا}(అల్ బఖర:286) ఆయతు ‘ఓ మా దైవమా! ఒకవేళ మేము మరిచి లేదా పొరబడి తప్పుకు పాల్పడినట్లైతే మాపై పట్టుబిగించకూ’ దాసుడి ఈ ప్రార్ధనకు సమాధానంగా అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:«قد فعلت»، నేను నీ ప్రార్ధనను అలకించాను, ఇంకో చోట అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:{وَلَيْسَ عَلَيْكُمْ جُنَاحٌ فِيمَا أَخْطَأْتُم بِهِ وَلَكِن مَّا تَعَمَّدَتْ قُلُوبُكُمْ} (అల్ అహజాబ్:5) "మీరు ఈ విషయంలో (ఇంత వరకు) చేసిన పొరపాటు గురించి మీ కెలాంటి పాపం లేదు, కాని ఇక ముందు మీరు ఉద్దేశ్యపూర్వకంగా చేస్తే (పాపం) అవుతుంది. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రధాత". అల్లాహ్ వారించిన నిషేధితాలన్నీ ఇహ్రాం ధరించినవాడు అజ్ఞానం, మరుపు లేక బలవంతంగా చేసినట్లయితే అతనిపై ఎలాంటి పాపం లేదు. కానీ సాకు ముగిసిన పిమ్మట ఆగిపోవడం అతని పై వాజిబు!
పురుటి ముట్టు స్త్రీ ఒకవేళ తర్వియా 8 దుల్ హజ్ రోజున ప్రసవానంతర రక్తస్రావం ప్రారంభమై, తవాఫ్ మరియు సయీ మినహా ఇతర హజ్జ్ కార్యక్రమాలు ముగించింది. కానీ 10 రోజుల తర్వాత ఆమె ప్రాథమికంగా శుద్దిపొందింది. అప్పుడు ఆమె తనను తాను పరిశుద్దురాలుగా భావించి గుసుల్ చేసుకోవాలా? మిగతా మౌళికాంశాలు అనగా తవాఫే ఇఫాదా పూర్తి చేయాలా?
ప్రస్తావిత మహిళకు ఎప్పటివరకైతే పరిపూర్ణ శుద్ది పొందాననే నమ్మకం కుదరదో అప్పటి వరకు గుసుల్ చేసి, తవాఫు చేయడానికి అనుమతి లేదు. ప్రశ్నించిన దాన్ని బట్టి ఇప్పటి వరకు ఆమె పరిపూర్ణ శుద్ది పొందలేదని అర్థమవుతుంది. ఇది 'ప్రాథమిక' అనే పదం ద్వారా అర్ధమవుతుంది! అయితే ఆమె సంపూర్ణ శుద్ది వరకు నిరీక్షించాలి. దాని తర్వాతే గుసుల్ చేసి, తవాఫ్ మరియు సయీ ఆచరించాలి.
ఒకవేళ తవాఫ్’కు ముందు సయీ ఆచరించి నట్లయితే ఎలాంటి సమస్య లేదు, ఎందుకంటే హజ్జతుల్ విదా సమయంలో ప్రవక్త అలైహిస్సలాంతో తవాఫ్ కంటే ముందు సయీ చేసినవాడి ఆదేశంఏమిటి అని ప్రశ్నించగా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం: ఎలాంటి దోషమూ లేదు’ అని పలికారు.
ఒక స్త్రీ ఋతుస్రావంలో సైల్’ప్రాంతం (మీఖాతు) నుండి హజ్జ్ కోసం ఇహ్రాం ధరించింది కానీ మక్కా వెళ్ళిన తర్వాత అత్యవసరం వల్ల జెద్దా వెళ్ళింది. అక్కడే ఆమె శుద్దిపొందింది గుసుల్ చేసింది, వెంట్రుకలు దువ్వినది, ఆ పై తన హజ్జ్ పూర్తిచేసింది,అయితే ఆమె హజ్జ్ ఆమోదయోగ్యమేనా? లేక ఆమెపై ఇంకేమైనా భాద్యత ఉంటుందా?
ప్రస్తావిత మహిళ చేసిన హజ్జ్ చెల్లుబాటవుతుంది, ఆమెపై ఇంకా ఎలాంటి భాద్యతా లేదు.
నేను ఉమ్రా కోసం వెళ్తున్నాను, మీఖాతు గుండా వెళ్లేటప్పుడు నేను ఋతుస్రావంలో ఉన్నాను. దానివల్ల ఇహ్రాం ధరించలేదు. శుద్దిపొందే వరకు మక్కాలో ఆగాను. ఆపై మక్కా నుంచి ఇహ్రాం ధరించాను. ఇలా చేయడం ఆమోదయోగ్యమేనా? నాపై గల విధి ఏమిటి?
ప్రస్తావిత ఆచరణ అనుమతించబడదు, ఉమ్రా సంకల్పించిన మహిళ ఇహ్రాం లేకుండా మీఖాతు దాటడానికి అనుమతిలేదు. బహిష్టు స్థితిలో ఉన్నాసరే! బహిష్టు స్థితిలోనే ఆమె ఇహ్రాం ధరించాలి. ఆమె ధరించే ఈ ఇహ్రాం చెల్లుతుంది. దానికి ఋజువు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజ్జతుల్ విదా సంకల్పంతో జుల్ హులైఫా ప్రాంతంలో విడిది చేసనప్పుడు అబూబకర్ రదియల్లాహు అన్హు భార్య అస్మా బింతు ఉమైస్ రదియల్లాహు అన్హాకు కుమారుడు జన్మించాడు. అప్పుడు అస్మా, దైవప్రవక్తతో ఈ స్థితిలో నేను ఏం చేయాలి అని అడిగారు. దానికి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బదులిచ్చారు: గుసుల్ ఆచరించి వస్త్రాన్ని కట్టుకోవాలి పిదప ఇహ్రాం ధరించాలి. బహిష్టు రక్తస్రావం కూడా ప్రసవానంతర రక్తస్రావం ఆదేశానికి వర్తిస్తుంది.
కనుక బహిష్టు మహిళకు మేము చెప్పేది ఏమనగా హజ్ మరియు ఉమ్రా ఉద్దేశంతో ఆమె మీఖాత్ గుండా వెళ్ళినట్లయితే గుసుల్ ఆచరించి మర్మాయవాలపై వస్త్రాన్ని (ప్యాడ్) కట్టుకోవాలి పిమ్మట (హజ్ మరియు ఉమ్రా యొక్క) ఇహ్రాం కట్టుకోవాలి. అయితే ఇహ్రాం కట్టుకొని ఆమె మక్కా చేరిన తరువాత శుద్ధి పొందనంత వరకూ మస్జిద్ హరాంలో ప్రవేశించకూడదు, బైతుల్లాహ్ ప్రదక్షిణ చేయకూడదు. ఎందుకంటే ఆయిషా రదియల్లాహు అన్హా ఉమ్రా చేస్తున్నప్పుడు నెలసరి ప్రారంభమైంది. అప్పుడు దైవప్రవక్త స ఆమెతో ఇలా చెప్పారు ‘హాజీలు చేసే ఆచరణలన్నీనువ్వు కూడా ఆచరించు. కానీ శుద్ధి పొందనంత వరకు బైతుల్లాహ్ యొక్క తవాఫ్ చేయవద్దు'. సహీహ్ బుఖారీ ఉల్లేఖనంలో ఇలా కూడా ఉంది, 'ఆయిషా రదియల్లాహు అన్హా తెలిపారు, తను తహరతు పొందినప్పడు బైతుల్లాహ్ తవాఫు చేశారు మరియు సఫా మర్వాల సయీ చేశారు'. కనుక ఈ హదీథు రూఢీ పరిచే విషయం ఏమనగా స్త్రీ ఉమ్రా లేక హజ్జ్' కోసం ఋతుస్రావాస్థలో ఇహ్రాం ధరించినప్పుడు లేక తవాఫుకు ముందు ఋతుస్రావం ప్రారంభం అయినపుడు, ఆమె తవాఫు మరియు సయీ చేయకూడదు. తహారతు పొంది గుసుల్ ఆచరించే వరకు వేచి ఉండాలి.
కానీ ఒకవేళ పరిశుద్ధ అవస్థలో తవాఫ్ చేసిన పిమ్మట ఆమెకు బహిష్టు వచ్చినట్లయితే, ఆమె అదే స్థితిలో తన ఉమ్రా కొనసాగిస్తుంది, పిదప సయీ చేస్తుంది, వెంట్రుకలు కత్తిరిస్తుంది మరియు అదే విధంగా తన ఉమ్రా పూర్తిచేస్తుంది. ఎందుకంటే సఫా మర్వా యొక్క సయీ కోసం తహరతు షరతు లేదు.
ఒక వ్యక్తి ప్రశ్నిస్తున్నాడు: నేను నా భార్యతో పాటు యంబు నగరం నుండి ఉమ్రా కోసం వచ్చాను. జిద్దా నగరం చేరిన తర్వాత నా భార్యకు ఋతుస్రావం ప్రారంభం అయింది. అప్పుడు నేను ఒంటరిగానే ఉమ్రా చేశాను. ఇప్పుడు నా భార్యపై గల ఆదేశం ఏమిటి?
ఇలాంటి పరిస్థితిలో, నీ భార్యకు వర్తించే ఆదేశం ఏమనగా ఆమె శుద్ధి పొందే వరకు వేచిఉండాలి ఉమ్రా పూర్తిచేయాలి. ఎందుకంటే ఉమ్ముల్ మూమినీన్ సఫియ్య రదియల్లాహు అన్హా, బహిష్టు వచ్చినప్పుడు దైవప్రవక్త (స) ను అడిగారు, ‘ఏమిటి? ఇది మనని ప్రయాణం నుండి ఆపుతుందా?' ప్రజలు చెప్పారు: ఓ దైవప్రవక్త ఈమె తవాఫే ఇఫాదా పూర్తి చేసింది. అప్పుడు దైవప్రవక్త సెలవిచ్చారు అలాగైతే తిరుగు ప్రయాణానికి బయల్దేరండి. దైవప్రవక్త చెప్పిన ఈ ప్రవచనంలో ‘ఇది మన ప్రయాణాన్ని ఆపుతుందా? అనే మాట రూడీ పర్చేది ఏమనగా ఒక వేళ స్త్రీకు తవాఫే ఇఫాదాకు ముందు ఋతుస్రావం కలిగినట్లయితే ఆమె శుద్ది పొందే వరకూ ఆగిపోవడం తప్పనిసరి (వాజిబు) గా ఉంది. తర్వాత తవాఫే ఇఫాదా చేయాలి.
తవాఫే ఉమ్రాకు కూడా తవాఫే ఇఫాదా యొక్క ఆదేశమే వర్తిస్తుంది. ఎందుకంటే అది ఉమ్రాలోని మౌలిక అంశంలోనిది. కనుక ఉమ్రా చేసే స్త్రీ ఒకవేళ తవాఫే ఇఫాదా ముందుగానే రుతుస్రావానికి గురైతే పరిశుద్ధత పొందే వరకూ ఆగిఉండాలి. దాని తరువాత ఆమె తవాఫ్ చేయాలి.
మస్ఆ’ హరంలోని భాగమా? ఋతుస్రావ స్త్రీ మస్’ఆ లో ప్రవేశించవచ్చా? మస్ఆ నుండి హరం లో ప్రవేశించేటప్పుడు తహియ్యతుల్ మస్జిదు’చదవడం తప్పనిసరా?
స్పష్టంగా తెలుస్తున్న విషయం ఏమిటంటే మస్’అ మస్జిదే హరంలోని భాగం కాదు. కారణం దీనికి మరియు మస్జిదే హరంకు మధ్యలో ఒక చిన్న గోడ నిలబెట్టబడింది. మస్జిదే హరాం నుండి మస్’ఆ బయట ఉండటంలోనే అందరికీ మేలు కలుగుతుంది. ఎందుకంటే ఒకవేళ దానిని మస్జిదే హరాం యొక్క భాగంగా ఖరారు చేసినట్లయితే తవాఫ్ మరియు సయీ మద్యలో ఋతుస్రావానికి గురైన మహిళ కోసం సయీ చేయడం నిషేధమయ్యేది.
అందువల్ల దీనికి సంబంధించి నా ఫత్వా ఏమనగా ఒకవేళ మహిళ తవాఫు తర్వాత సయీకు ముందు బహిష్టు మొదలైతే, ఆమె సయీ చేసుకోవాలి ఎందుకంటే మస్’ఆ మస్జిదే హరాం నుండి వేరుగా ఉంది.
ఇక తహియ్యతుల్ మస్జిద్ విషయానికొస్తే ఇలా చెప్పబడుతుంది: ఎవరైన ఒకవేళ తవాఫ్ తర్వాత సయీ చేసుకుని దాని తర్వాత మస్జిదు హరంలో తిరిగి వెళ్ళదలిస్తే ఆమె తహియ్యతుల్ మస్జిద్ సలాహ్ చేయ వలసి ఉంటుంది. ఒకవేళ చేయక పోయిన ఎటువంటి దోషమూ లేదు. కానీ ఉత్తమం ఏమిటంటే దీన్నిసువర్ణావకాశంగా భావించి ఆ ప్రాంతంలో చేసే సలాహ్ (నమాజు) ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని రెండు రకాతులు ‘తహియ్యతుల్ మస్జిదు’ చేయాలి.
నేను హజ్జ్ చేశాను. హజ్జ్ చేస్తుండగా నాకు బహిష్టు మొదలైంది సిగ్గుతో నేను ఎవరికి చెప్పుకోలేదు, నేను హరంలో కూడా ప్రవేశించాను, నమాజు చేశాను. తవాఫు చేశాను, సయీ కూడా చేశాను. ఇప్పుడు నేను ఏం చేయాలి? గమనించే విషయం ఏమిటంటే ఇది నాకు ప్రసవానంతరక్తస్రావం తర్వాత వెలువడింది?
బహిష్టులో ఉన్న స్త్రీ మరియు పురుటి ముట్టులో ఉన్న స్త్రీ సలాహ్ (నమాజు) చేయడానికి అనుమతిలేదు. అది ఆమె మక్కా నగరంలో ఉన్నా లేక తన దేశంలో ఉన్నా లేక మరెక్కడా ఉన్నా సరే! ఎందుకంటే దైవప్రవక్త బోధించారు: స్త్రీకు బహష్టు మొదలైనప్పుడు నమాజు గానీ ఉపవాసం గానీ పాటించదు కదా? బహిష్టులో ఉన్న స్త్రీ నమాజు చేయడానికి, ఉపవాసం పాటించడానికి అనుమతి లేదని ముస్లింలందరూ ఇజ్మా చేసి ఉన్నారు.
కనుక ప్రస్తావిత మహిళ అల్లాహ్'తో తౌబా చేయాలి తన ద్వారా జరిగిన తప్పుకు పశ్చాత్తాప పడుతూ, క్షమాపణ వేడుకోవాలి.
ఇక నెలసరి సమయంలో చేసిన తవాఫు విషయానికొస్తే, ఆ తవాఫు చెల్లదు. కానీ సయీ స్వీకరించబడుతుంది. ఎందుకంటే ప్రామాణిక కథనం ప్రకారం హజ్జ్'లో తవాఫుకు ముందు సయీ చేయడం అనుమతించబడుతుంది. కనుక ఆమెపై మళ్ళీ తవాఫు చేయడం విధిగా ఉంటుంది. ఎందుకంటే తవాఫ్ ఇఫాదా హజ్జ్'కు చెందిన ఒక మౌలిక అంశం. ఇది లేకుండా తహల్లుల్ పూర్తిగా పొందలేము.
అందుచేత ఆ స్త్రీ ఒకవేళ వివాహిత అయితే ఆమె తవాఫు చేసేంతవరకు భర్తతో రమించడానికి వీలు లేదు. ఒకవేళ అవివాహిత అయితే తవాఫు చేసేంత వరకు ఆమె నికాహ్ చేసుకోవడం సరికాదు! వల్లాహు ఆలము.
అరఫా రోజున స్త్రీకు ఋతుస్రావం మొదలైనట్లయితే ఏం చేయాలి?
మహిళకు అరఫా రోజున ఋతుస్రావం మొదలైతే ఇతర హాజీల మాదిరిగా ఆమె కూడా హజ్జ్ ఆచరణలు చేస్తూ, తన హజ్జ్'ను పూర్తిచేసుకోవాలి. కానీ బైతుల్లాహ్ తవాఫును శుద్ది పొందేవరకు వాయిదా వేసుకోవాలి.
స్త్రీ జమ్రతుల్ అక్బా యొక్క రమీ చేసిన తర్వాత తవాఫే ఇఫాదాకు ముందు బహిష్టు మొదలై ఆమె తన భర్తతో పాటు ఒక సముదాయంతో కలిసి ఉన్నస్థితిలో ఏమిచేయాలి? తిరుగుప్రయాణం చేశాక మళ్ళీ మక్కా రావడం ఆమెకు సాధ్యపడదు. ఈ విషయాన్ని గమనించగలరు?
ప్రస్తావిత మహిళ ఒకవేళ మక్కా మళ్ళీ రావడం కుదరని పక్షంలో ఆమె అనివార్యత స్థితి మేరకు తన మర్మాయానికి వస్త్రాన్ని కట్టుకుని తవాఫు చేయాలి అలాగే ఇతర హజ్జ్'విధులను కూడా నిర్వర్తించాలి. ఇలాంటి సదర్భంలో ఆమెపై ఫిద్యా చెల్లించ వలసిన అవసరం ఉండదు.
పురుటి ముట్టులో ఉన్న స్త్రీ ఒకవేళ నలభై రోజులకు ముందు పరిశుద్ది పొంది నట్లయితే, ఆమె చేసిన హజ్జ్ స్వీకరించబడుతుందా? ఒకవేళ తహారతు పొందకపోతే ఏమి చేయాలి? ఆమె హజ్జ్ నియ్యతు సంకల్పం చేసుకుందని గమనించగలరు?
పురుటి ముట్టులో ఉన్న స్త్రీ నలభై రోజులకు ముందు తహారతు పొందిన పక్షంలో గుసుల్ చేసి నమాజు ఆచరించాలి. ఇతర పరిశుద్ద స్త్రీలు చేసే అన్ని కార్యక్రమాలు చేయవచ్చు. చివరికి ఆమె బైతుల్లాహ్ యొక్క తవాఫు కూడా చేయవచ్చు. ఎందుకంటే నిఫాస్ స్త్రీల కనిష్ట అశుద్ధ సమయం నిర్దారించబడలేదు.
ప్రస్తావిత మహిళ ఒకవేళ తుహ్ర్ చూడకపోతే, అప్పుడు కూడా ఆమె హజ్జ్' స్వీకరించబడుతుంది కానీ శుద్దిపొందనంత వరకు బైతుల్లాహ్ తవాఫు చేయకూడదు.
*
Related books
All books
జనాజా (అంత్యక్రియల) ఆదేశాలు26 భాషలుజనాజా (అంత్యక్రియల) ఆదేశాలు
ఇది ఇస్లామీయ షరియతు ప్రకారం మయ్యత్ (మృతదేహం)తో వ్యవహరించే ఆచారాలు మరియు ఉద్దేశ్యాలను వివరించే 'అహ్కాముల్ జనాఇజ్' (జనాజా నియమాల) పుస్తకం. ఇది జనాజాను అనుసరించడం యొక్క ప్రాముఖ్యత, జనాజా నమాజు పద్ధతి మరియు దాని వివిధ స్థితులను వివరిస్తుంది. అలాగే, జనాజాను త్వరగా సిద్ధం చేయడం, శోకించకుండా ఉండడం, సహనం పాటించడం మరియు అల్లాహ్ నిర్ణయంపై సంతృప్తి చెందడం వంటి ముఖ్యమైన మార్గదర్శకాలను ఈ పుస్తకం వివరిస్తున్నది. మరణం ప్రతి మనిషిపై తప్పనిసరిగా వస్తుందనే విషయాన్ని గుర్తుచేస్తూ, అల్లాహ్ పట్ల మంచి భావన కలిగి ఉండాలని మరియు ధర్మాన్ని స్థిరంగా అనుసరించాలని ఈ పుస్తకం కోరుతుంది. అలాగే మృతుల క్షమాపణ కోసం మరియు…
పరిశుద్ధత, నమాజు మరియు జనాజాకు సంబంధించిన ఫిఖీ నియమాలు (ఇస్లామీయ శాస్త్ర విధానాలు):16 భాషలుపరిశుద్ధత, నమాజు మరియు జనాజాకు సంబంధించిన ఫిఖీ నియమాలు (ఇస్లామీయ శాస్త్ర విధానాలు):
షేఖ్ అల్లామా ముహమ్మద్ బిన్ సాలిహ్ అల్ ఉసైమీన్ రహిమహుల్లాహ్ రచించిన పరిశుద్ధత, నమాజు మరియు జనాజాకు సంబంధించిన ఫిఖీ నియమాలు (ఇస్లామీయ శాస్త్ర విధానాలు) అనే పుస్తకం శుద్ధి (తహారా), ప్రార్థనలు (సలాత్) మరియు అంత్యక్రియల (జనాయిజ్) ఆరాధనలను స్పష్టంగా వివరిస్తుంది. ఇది ఖుర్ఆన్ మరియు సున్నత్ల ఆధారంగా రచించబడింది. ఈ పుస్తకం ముస్లింలు తమ ఆరాధనలను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానం ప్రకారం, స్పష్టమైన అవగాహనతో నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇది సులభత మరియు ఆచరణాపరమైన నియమాల మధ్య సమతుల్యతను పాటిస్తూ, అల్లాహ్ యొక్క ఆమోదాన్ని మరియు ఆయనకు సన్నిహితం కావడాన్ని సాధించడానికి నిష్కాపట్యతను మరియు అనుసరణను…
ముఅజ్జిన్, ఇమామ్ మరియు ఖతీబ్ మరియు మస్జిద్ నియమ నిబంధనల కోసం ఒక సంక్షిప్త మరియు ప్రయోజనకరమైన మార్గదర్శి.47 భాషలుముఅజ్జిన్, ఇమామ్ మరియు ఖతీబ్ మరియు మస్జిద్ నియమ నిబంధనల కోసం ఒక సంక్షిప్త మరియు ప్రయోజనకరమైన మార్గదర్శి.
ఈ పుస్తకం అజాన్ మరియు ఇఖామత్, నమాజు ఇమామత్, జుముఅహ్ ప్రసంగం, మరియు మస్జిద్ మర్యాదల నియమాలపై సమగ్ర దృక్పథాన్ని అందిస్తున్నది; ఇది ముఅజ్జిన్'లు, ఇమామ్'లు మరియు ప్రసంగీకుల విధులను చర్చిస్తుంది మరియు ఈ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడానికి వాటికి సంబంధించిన షరీఅత్ నియమాలను నేర్చుకోవడం యొక్క ప్రాముఖ్యతను బలపరుస్తుంది. అంతేకాక, వాటిని సరిగ్గా ఆచరించడాన్ని నిర్ధారించడానికి, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి నుండి ఉల్లేఖించబడిన వచనాలు వాటి వివరణతో సహా ఇందులో ఉన్నాయి.
من أحكام الصيام