ఇది ఇస్లామీయ షరియతు ప్రకారం మయ్యత్ (మృతదేహం)తో వ్యవహరించే ఆచారాలు మరియు ఉద్దేశ్యాలను వివరించే 'అహ్కాముల్ జనాఇజ్' (జనాజా నియమాల) పుస్తకం. ఇది జనాజాను అనుసరించడం యొక్క ప్రాముఖ్యత, జనాజా నమాజు పద్ధతి మరియు దాని వివిధ స్థితులను వివరిస్తుంది. అలాగే, జనాజాను త్వరగా సిద్ధం చేయడం, శోకించకుండా ఉండడం, సహనం పాటించడం మరియు అల్లాహ్ నిర్ణయంపై సంతృప్తి చెందడం వంటి ముఖ్యమైన మార్గదర్శకాలను ఈ పుస్తకం వివరిస్తున్నది. మరణం ప్రతి మనిషిపై తప్పనిసరిగా వస్తుందనే విషయాన్ని గుర్తుచేస్తూ, అల్లాహ్ పట్ల మంచి భావన కలిగి ఉండాలని మరియు ధర్మాన్ని స్థిరంగా అనుసరించాలని ఈ పుస్తకం కోరుతుంది. అలాగే మృతుల క్షమాపణ కోసం మరియు…
భాష: lang_te
సిద్ధం చేసినవారు: మస్జిదుల్ హరామ్ మరియు మస్జిదున్నబవీలలోని ధార్మిక పరమైన వ్యవహారాల విభాగానికి చెందిన శాస్త్రీయ కమిటీ.
మస్జిదుల్ హరామ్ మరియు మస్జిదున్నబవీలలోని ధార్మిక పరమైన వ్యవహారాల విభాగానికి చెందిన శాస్త్రీయ కమిటీ.
తొలి పలుకులు
స్థుతులన్ని అల్లాహ్ కే శోభిస్తాయి, ఆయన ఒక్కడే శాశ్వతుడై, జీవులందరిపై మరణాన్ని విధించినవాడు. మరియు మన ప్రభువు సర్వలోకాల కొరకు కారుణ్యంగా పంపిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, ఆయన కుటుంబముపై, ఆయన సహచరులపై, ఆయన అనుచరులందరిపై శుభాలు మరియు శాంతి కురియుగాక. అమ్మా బాద్:
ఇది సంక్షిప్త సందేశం, మీరు ఎవరైనా బంధువులను లేదా ప్రియమైనవారిని కోల్పోయినప్పుడు, మనము దీనిని ఉపయోగకరంగా పొందాలని అల్లాహ్ను ప్రార్థిస్తున్నాము. ఇది 'అంత్యక్రియల (జనాజా) ఆదేశాలు' అనే శీర్షికతో ఉంది.
మేము అల్లాహ్’ను వేడుకుంటున్నాము! ఆయన మీకు గొప్ప పుణ్యఫలాన్ని మరియు సాంత్వనను ప్రసాదించుగాక!ఎవరి కోసం నీవు క్షమాపణను మరియు అల్లాహ్ సంతృప్తిని కోల్పోయినావో.
దైవిక సంకేతాలు:
ఓ నా సోదరా! మరణం అనే ఆపదతో పరీక్షకు గురైన వాడా! మహోన్నతుడైన అల్లాహ్ యొక్క వాక్కును జ్ఞాపకం చేసుకో:((...సహనం వహించేవారికి శుభవార్తనివ్వు.))[సూరతుల్ బఖర: 155]
నిజంగా, అల్లాహ్ యొక్క ప్రవక్త ముహమ్మద్ ﷺ మరణంలో నీకు గొప్ప ధైర్యం, ఓదార్పు మరియు ప్రేరణ ఉంది. ఎందుకంటే ఆయన ﷺ ఇలా పలికినారు:మీలో ఎవరికైనా ఆపద కలిగినప్పుడు, నా ఆపదను గుర్తు చేసుకోండి; ఎందుకంటే అది అతని దృష్టిలో అతి పెద్ద ఆపద.దీనిని తబ్రానీ నమోదు చేసినారు.
ఉమ్ముల్ ము’మినీన్ ఉమ్మె సలమహ్ రదియల్లాహు అన్హా ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను:ఏ సేవకుడైనా విపత్తు బారిన పడినప్పుడు, ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్, అల్లాహుమ్మ అజుర్నీ ఫీ ముసీబతి, వఅఖ్లిప్లీ ఖైరన్ మిన్హా అని దుఆ చేస్తే, అల్లాహ్ అతనికి ఆ విపత్తులో మంచి ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు, మరియు బదులుగా దానికి మించిన మంచి దానిని అతనికి ప్రదానం చేస్తాడు.దీనిని ముస్లిం నమోదు చేసినారు.
నిశ్చయంగా అల్లాహ్ నిన్ను పరీక్షించాడు నీ తప్పిదాలను ప్రక్షాళించుటకు గాను, ప్రవక్త ﷺ నుండి అబూ సయీద్ ఖుద్రీ మరియు అబూ హురైర రదియల్లాహు అన్హుమాల ఉల్లేఖన:ఒక విశ్వాసికి ఎటువంటి అలసట, అనారోగ్యం, దుఃఖం, హాని లేదా వేదన కలిగినా, చివరికి ముల్లు గుచ్చుకున్నా - అల్లాహ్ దాని ద్వారా అతని పాపాలను క్షమించి వేస్తాడు.దీనిని బుఖారీ నమోదు చేసినారు.
అల్లాహ్ తఆలా నీకు స్వర్గంలో ఒక గృహాన్ని వాగ్దానం చేశాడు! అబూ మూసా అల్ అష్అరీ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: రసూల్లల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:దాసుని బిడ్డ చనిపోయినప్పుడు అల్లాహ్ తన దూతలతో, "మీరు నా దాసుని బిడ్డ ప్రాణాలు తీశారా?" అని అడుగుతాడు. దానికి దూతలు 'అవునంటారు. “మీరు నా దాసుని గారాలపట్టిని చంపారా?” అని మళ్ళీ అడుగుతాడు అల్లాహ్. దైవ దూతలు అవునంటారు. అప్పుడు అల్లాహ్, “మరి దానికి నా దాసుడు ఏమన్నాడు?” అని అడుగుతాడు. “(ఓ అల్లాహ్! అంతటి కఠోర పరిస్థితిలో కూడా) అతను నిన్ను స్తుతించి, 'ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజివూన్' అని పఠించాడు” అని చెబుతారు దైవదూతలు. అది వినగానే అల్లాహ్ ప్రసన్నుడై, “అయితే నా దాసుని కొరకు స్వర్గంలో ఒక గృహాన్ని నిర్మించండి. దానికి 'స్తోత్ర నిలయం' అని పేరు పెట్టండి" అని తన దూతల్ని ఆజ్ఞాస్తాడు.దీనిని తిర్మిథీ మరియు అల్-అల్బానీ హసన్గా వర్గీకరించారు.
అల్లాహ్ తఆలా నీకు స్వర్గాన్ని వాగ్దానం చేశాడు; అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:అల్లాహ్ అజ్జ వ జల్ ఇలా సెలవిస్తున్నాడు: విశ్వాసి అయిన నా దాసుని నుంచి తనకు అత్యంత ప్రియమైన వస్తువుని నేను వెనక్కి తీసుకున్నా అతను దానిపై (సహనం వహించి) పుణ్యాన్ని ఆశిస్తాడు. అలాంటి వానికి నా దగ్గర స్వర్గం తప్ప మరే ప్రతిఫలమూ లేదు.దీనిని బుఖారీ నమోదు చేసినారు.
భయపడకు, మరియు నీవు కోల్పోయినవారి గురించి దుఃఖపడకు, మరియు నీ ప్రభువు పట్ల శుభ సంకల్పాన్ని కలిగి ఉండు, అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ రదియల్లాహు అన్హుమా నుండి, రసూలుల్లాహ్ ﷺ ఇలా పలికినారు:
మొదటిది: జనాజాను దాని కుటుంబ సభ్యుల వద్ద నుండి నమాజు ఆచరించే స్థలం వరకు అనుసరించడం.
రెండవది: జనాజాను, దాని కుటుంబం నుండి ఖననం పూర్తయ్యే వరకు అనుసరించడం, ఇది ఉత్తమం మరియు ఎక్కువ పుణ్యం.
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:ఎవరైతే ఒక ముస్లిం అంత్యక్రియల్లో పాల్గొని, జనాజా నమాజు చదవుతారో అతనికి ఒక ఖీరాత్ పుణ్యం లభిస్తుంది, మరెవరైతే నమాజ్ చదివి సమాధి వరకు వెళ్తారో వారికి రెండు ఖీరాత్ ల పుణ్యం లభిస్తుంది. అప్పుడు ప్రవక్తను ఇలా ప్రశ్నించారు’ ఈ ఖీరాత్ అంటే ఏమిటి? దానికి ప్రవక్త సమాధానమిస్తూ ‘ఖీరాతాన్ అంటే రెండు ‘పెద్ద పర్వతాలకు’ సమానం అని చెప్పారు.ముత్తఫఖున్ అలైహి
అబీ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:(ఈ రోజు మీలో ఎవరు ఉపవాసం పాటిస్తున్నారు?). అబూ బకర్ రదియల్లాహు అన్హు: నేను, అన్నారు. (ఈ రోజు మీలో ఎవరు జనాజ వెంట వెళ్ళినారు? అని అడిగారు. దానికి మరలా అబూ బకర్ రదియల్లాహు అన్హు: నేను, అన్నారు. ఈ రోజు మీలో ఎవరు పేదవారికి ఆహారం పెట్టారు?. దానికి అబూ బకర్ రదియల్లాహు అన్హు: నేను, అన్నారు. ఈ రోజు మీలో ఎవరు ఒక రోగిని పరామర్శించారు?. దానికి అబూ బకర్ రదియల్లాహు అన్హు: నేను, అన్నారు. దానికి దైవప్రవక్త ﷺ: (వీటిని ఎవరైతే చేసినారో, అతను స్వర్గంలో ప్రవేశిస్తాడు) అని అన్నారు.దీనిని ముస్లిం నమోదు చేసినారు.
జనాజా నమాజు పద్దతి:
తక్బీర్ మొదట: అఊజు బిల్లాహి మినష్షైతానిర్రజీమ్ అని అల్లాహ్ శరణు కోరుతూ, బిస్మిల్లాహ్ చదివి, సూరతుల్ ఫాతిహ చదవాలి మరియు ఒక చిన్న సూరహ్ లేదా కొన్ని ఆయతులు నిశ్శబ్దంగా పఠించాలి.
రెండవ తక్బీర్: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ పఠించడం (ఇబ్రాహీమీ దరూద్).
మూడవ తక్బీర్: మృతుని కొరకు దుఆ చేయాలి, మరియు ఇలా పలకడం ఉత్తమం:అల్లాహుమ్మగ్ఫిర్ లిహయ్యినా వమయ్యితినా, వ షాహిదినా వగాయిబినా, వసగీరినా వకబీరినా, వజకరినా వ ఉన్సానా, అల్లాహుమ్మ మన్ అహ్యైయ్తహు మిన్నా ఫ అహ్యిహీ అలల్ ఇస్లాం, వమన్ తవఫ్ఫైతహు మిన్నా ఫ తవఫ్ఫహు అలల్ ఈమాన్.ఓ అల్లాహ్! అతన్ని క్షమించు, అతనిని కరుణించు, అతనికి సుఖాన్ని ప్రసాదించు, అతన్ని మన్నించు, అతన్ని అతిథిగా ఆదరించు, అతడు చేరుకునే స్థలాన్ని వెడల్పు చేయి, నీటితోను, మంచుతోను, మరియు వడగళ్ళతోనూ అతని పాపములను కడిగివేయి, మురికి లేని తెల్లని వస్త్రం నుండి మురికిని శుభ్రం చేసినట్లుగా అతని పాపములను కడిగివేయుము. అతని ఇంటికి బదులుగా మరింత మంచి ఇల్లు, అతని కుటుంబం కంటే మంచి కుటుంబము, అతని జీవిత భాగస్వామి కంటే మంచి జీవితభాగస్వామిని అతనికి ప్రసాదించు. అతనికి స్వర్గంలో ప్రవేశం కల్పించు, సమాధి శిక్ష నుండి కాపాడు.ఇవన్నీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి నమోదు చేయబడినవి, ఇంకా, మృతుని కొరకు ఇతర దుఆలు చేస్తే ఎలాంటి అభ్యంతరం లేదు, ఉదాహరణకు ఇలా చెప్పవచ్చు:ఓ అల్లాహ్! అతను మంచి పనులు చేసినవాడైతే, అతని మంచితనాన్ని పెంచుము, మరియు అతను చెడు పనులు చేసినవాడైతే, అతని దోషాలను మన్నించుము. ఓ అల్లాహ్! అతనిని క్షమించు, అతనిని స్థిరపరచు.
నాలుగో తక్బీర్: కొద్దిసేపు నిలిచి, కుడివైపు తల త్రిప్పుతూ 'అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహ్' అని ఒక సలాం పలుకు.
జనాజా నమాజు పరిస్థితులు:
1. జనాజా నమాజు మస్జిద్లో చేయాలి.
2. జనాజా పై మస్జిద్ లో నమాజ్ చేయడం.
3. సమాధి స్థలంలో ఖననానికి ముందు జనాజా నమాజు చేయవచ్చు.
4. ఖననం అయిన కొంత సమయం వరకు మాత్రమే సమాధి వద్ద జనాజా నమాజు చేయవచ్చు.
5. ఖననం తరువాత సమాధి వద్ద చాలా కాలం తరువాత కూడా జనాజా నమాజు చేయవచ్చు.హజ్రత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖన: ఒక నల్లని వ్యక్తి - పురుషుడో లేక స్త్రీయో - మస్జిద్ ఊడ్చేవారు. ఆ వ్యక్తి మరణించిన విషయం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలుపలేదు. ఒక రోజు ఆ వ్యక్తిని గురించి ప్రస్తావిస్తూ ఆయన ఇలా అడిగారు:ఆ వ్యక్తి ఏమయ్యాడు?" అని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు. "ఆయన చనిపోయారు, యా రసూలుల్లాహ్" అని వారు చెప్పారు. దానికాయన (చిరు కోపంతో) “మరి ఆ విషయం నాతో ఎందుకు చెప్పలేదు?” అని అడిగారు. వారు అతని కథను వివరించారు. వారు అతని విషయాన్ని తేలికగా తీసుకున్నారు. అందుకే ఆయనకు తెలియపరచలేదు. "సరే, నాకు అతని సమాధి ఎక్కడుందో చూపించండి" అని కోరారు. ఆయన సమాధి వద్దకు వెళ్లి అతని కొరకు జనాజా నమాజు చేశారు.దీనిని ఇమామ్ బుఖారీ నమోదు చేసినారు.
రెండవది: జనాజా నమాజు చేయుట పట్ల ప్రోత్సాహము, మరియు దానిని అనుసరించుటలో అలసత్వం ప్రదర్శించుట పట్ల హెచ్చరిక.
మూడవది: మృతుని అప్పు తీర్చడంలో ఆలస్యం చేయకూడదు: అబూ హురైర రదియల్లాహు అన్హు ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:విశ్వాసి యొక్క ఆత్మ అతను తీసుకున్న అప్పులు తీర్చ బడనంతవరకు అనిశ్చితంగా ఉంటుంది.అహ్మద్ మరియు అత్తిర్మిథీ ఉల్లేఖించారు.
4- సంకల్పము చేయరాదు; అది మృతుని లక్షణాలను మరియు అతని సత్కార్యాలను స్వరమును పెంచి చెప్పడం ద్వారా జరుగుతుంది, ఇది జాహిలీయ్యా కాలం యొక్క చర్యలలో ఒకటి; అబూ మాలిక్ అష్అరీ రదియల్లాహు అన్హు కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా బోధించారు:నా జాతిలో నాలుగు విషయాలు అజ్ఞాన కాలపు విషయాలు, వాటిని వారు ఎప్పటికీ వదులుకోలేరు: తన మరియు తన పూర్వీకుల పనుల గురించి గర్వపడటం, సంబంధాలలో లోపాలను కనుగొనడం, నక్షత్రాల ద్వారా వర్షం కోసం అడగడం మరియు చట్టవిరుద్ధమైన రీతిలో బిగ్గరగా ఏడవటం.దీనిని ముస్లిం నమోదు చేసినారు.
ఐదవది: సమాధిపై నడవటం లేదా కూర్చోవటం నుండి జాగ్రత్తగా ఉండండి: ఉక్బా బిన్ ఆమిర్ రదియల్లాహు అన్హు కథనం: దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు:ముస్లిం సమాధిపై నడవడం కంటే, నిప్పులపై, కత్తిపై నడవడం లేదా నా కాలి చెప్పును నా కాళ్లతో కుట్టడం నాకు ఇష్టము.దీనిని ఇబ్నె మాజహ్ నమోదు చేసినారు.
6- మృతుని కొరకు దుఆ చేయటంలో తొందరపడకూడదు మరియు ఖననం తరువాత వెంటనే వెళ్లిపోకూడదు: అబూ అమ్ర్ లేక అబూ అబ్దుల్లాహ్ లేక అబూ లైలా ఉస్మాన్ బిన్ అప్ఫాన్ రదియల్లాహు అన్హు కథనం : దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మృతుడిని ఖననం చేసిన తరువాత సమాధి వద్ద నిలబడి ఇలా పలికేవారు :మీరు మీ సోదరుని మన్నింపు కొరకు వేడుకోండి. మరియు అతని స్థిరత్వం కొరకు వేడుకోండి. ఎందుకంటే అతను ఇప్పుడు ప్రశ్నించబడుతాడు.దీనిని అబూ దావూద్ నమోదు చేసినారు.
7- సమాధుల వద్ద నుండి వెళ్ళేటప్పుడు లేదా వాటిని సందర్శించినప్పుడు సమాధి వాసులపై శాంతి కొరకు దుఆ చేయాలి, బురైదా రదియల్లాహు అన్హు ఉల్లేఖిస్తూ ఇలా తెలిపారు; ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్మశానానికి వెళ్ళినప్పుడు ఈ దుఆ చేయమని వారికి నేర్పించేవారు:అస్సలాము అలైకుమ్ అహ్లద్దియార్ మినల్ ముమినీన వల్ ముస్లిమీన్, వ ఇన్నా ఇన్ షా అల్లాహు బికుమ్ లాహికూన్’అస్ అలుల్లాహ లనా వలకుముల్ ఆఫియ.దీనిని ముస్లిం నమోదు చేసినారు.
ఎనిమిదవది: సమాధి వద్ద ప్రాపంచిక విషయాలలో నిమగ్నమవడం మరియు చర్చించడం, స్థలం మరియు పరిస్థితిని పరిగణనలోకి తీసుకోకుండా ఉండటం నిషేధం.
ముగింపు.
మరణం ఒక ద్వారం మరియు ప్రతి మనిషి దానిలో ప్రవేశించును. మరణం వంటి బోధకుడు మరొకరు లేరు అని తెలుసుకో. అల్లాహ్ మీ మృతుని కరుణించుగాక మరియు అతని పాపాలను మన్నించుగాక, మరియు సమస్త ముస్లింల మృతులను కరుణించుగాక.
అల్లాహ్ మన ప్రవక్త అయిన ముహమ్మద్ పై, ఆయన కుటుంబముపై, ఆయన సహచరులందరిపై శుభాలను, శాంతిని కలిగించుగాక.
పరిశుద్ధత, నమాజు మరియు జనాజాకు సంబంధించిన ఫిఖీ నియమాలు (ఇస్లామీయ శాస్త్ర విధానాలు):
16 భాషలు
పరిశుద్ధత, నమాజు మరియు జనాజాకు సంబంధించిన ఫిఖీ నియమాలు (ఇస్లామీయ శాస్త్ర విధానాలు):
షేఖ్ అల్లామా ముహమ్మద్ బిన్ సాలిహ్ అల్ ఉసైమీన్ రహిమహుల్లాహ్ రచించిన పరిశుద్ధత, నమాజు మరియు జనాజాకు సంబంధించిన ఫిఖీ నియమాలు (ఇస్లామీయ శాస్త్ర విధానాలు) అనే పుస్తకం శుద్ధి (తహారా), ప్రార్థనలు (సలాత్) మరియు అంత్యక్రియల (జనాయిజ్) ఆరాధనలను స్పష్టంగా వివరిస్తుంది. ఇది ఖుర్ఆన్ మరియు సున్నత్ల ఆధారంగా రచించబడింది. ఈ పుస్తకం ముస్లింలు తమ ఆరాధనలను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానం ప్రకారం, స్పష్టమైన అవగాహనతో నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇది సులభత మరియు ఆచరణాపరమైన నియమాల మధ్య సమతుల్యతను పాటిస్తూ, అల్లాహ్ యొక్క ఆమోదాన్ని మరియు ఆయనకు సన్నిహితం కావడాన్ని సాధించడానికి నిష్కాపట్యతను మరియు అనుసరణను…
ముఅజ్జిన్, ఇమామ్ మరియు ఖతీబ్ మరియు మస్జిద్ నియమ నిబంధనల కోసం ఒక సంక్షిప్త మరియు ప్రయోజనకరమైన మార్గదర్శి.
47 భాషలు
ముఅజ్జిన్, ఇమామ్ మరియు ఖతీబ్ మరియు మస్జిద్ నియమ నిబంధనల కోసం ఒక సంక్షిప్త మరియు ప్రయోజనకరమైన మార్గదర్శి.
ఈ పుస్తకం అజాన్ మరియు ఇఖామత్, నమాజు ఇమామత్, జుముఅహ్ ప్రసంగం, మరియు మస్జిద్ మర్యాదల నియమాలపై సమగ్ర దృక్పథాన్ని అందిస్తున్నది; ఇది ముఅజ్జిన్'లు, ఇమామ్'లు మరియు ప్రసంగీకుల విధులను చర్చిస్తుంది మరియు ఈ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడానికి వాటికి సంబంధించిన షరీఅత్ నియమాలను నేర్చుకోవడం యొక్క ప్రాముఖ్యతను బలపరుస్తుంది. అంతేకాక, వాటిని సరిగ్గా ఆచరించడాన్ని నిర్ధారించడానికి, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి నుండి ఉల్లేఖించబడిన వచనాలు వాటి వివరణతో సహా ఇందులో ఉన్నాయి.