Skip to content
సూరాల జాబితా /

الأعرَاف

الأعرَاف is chapter 7 of the Quran and has 206 verses. This page presents it in full in the Uthmani script, with a verse-by-verse translation of its meaning.

206 ఆయతులు సూరా సంఖ్య 7
ఆయత్‌కు వెళ్ళండి
తెలుగు · Muhammad
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

الٓمٓصٓ

అలిఫ్ - లామ్ - మీమ్ - సాద్!

Explanation & meanings · 1
  1. సూరతుల్ బఖరహ్ లోని మొదటి ఆయతు యొక్క ఫుట్‌నోట్ చూడండి.

كِتَٰبٌ أُنزِلَ إِلَيۡكَ فَلَا يَكُن فِي صَدۡرِكَ حَرَجٞ مِّنۡهُ لِتُنذِرَ بِهِۦ وَذِكۡرَىٰ لِلۡمُؤۡمِنِينَ

(ఓ ముహమ్మద్!) ఈ గ్రంథం నీపై అవతరింప జేయబడింది. కావున దీనిని గురించి నీ హృదయంలో ఏ విధమైన సంకోచం ఉండనివ్వకు; ఇది నీవు (సన్మార్గం నుండి తప్పేవారికి) హెచ్చరిక చేయటానికి (అవతరింపజేయబడింది); మరియు ఇది విశ్వాసులకొక హితోపదేశం.

ٱتَّبِعُواْ مَآ أُنزِلَ إِلَيۡكُم مِّن رَّبِّكُمۡ وَلَا تَتَّبِعُواْ مِن دُونِهِۦٓ أَوۡلِيَآءَۗ قَلِيلٗا مَّا تَذَكَّرُونَ

(ప్రజలారా!) మీ ప్రభువు తరఫు నుండి మీ కొరకు అవతరింప జేయబడిన దానిని (ఈ ఖుర్ఆన్ ను) అనుసరించండి. మరియు ఆయన (అల్లాహ్)ను కాదని ఇతర స్నేహితులను (సహాయకులను) అనుసరించకండి. మీరు ఎంతో తక్కువగా ఈ హితబోధను స్వీకరిస్తున్నారు!

وَكَم مِّن قَرۡيَةٍ أَهۡلَكۡنَٰهَا فَجَآءَهَا بَأۡسُنَا بَيَٰتًا أَوۡ هُمۡ قَآئِلُونَ

మరియు మేము ఎన్నో నగరాలను (వాటి నేరాలకు గాను) నాశనం చేశాము. వారిపై, మా శిక్ష (ఆకస్మాత్తుగా) రాత్రివేళలో గానీ, లేదా మధ్యహ్నం వారు విశ్రాంతి తీసుకునే సమయంలో గానీ వచ్చిపడింది.

فَمَا كَانَ دَعۡوَىٰهُمۡ إِذۡ جَآءَهُم بَأۡسُنَآ إِلَّآ أَن قَالُوٓاْ إِنَّا كُنَّا ظَٰلِمِينَ

వారిపై మా శిక్ష పడినప్పుడు వారి రోదన: "నిశ్చయంగా, మేము అపరాధులంగా ఉండే వారం!" అని అనడం తప్ప మరేమీ లేకుండింది!

Explanation & meanings · 1
  1. కాని అప్పుడది వారికి ఏ విధంగాను పనికిరాదు. చూడండి, 40:85.