Skip to content
الأعرَاف /

ఆయత్ 150

7 : 150

ఆయత్ 150 of الأعرَاف (7 : 150). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الأعرَاف ఆయతులు 206
సూరా · الأعرَاف
తెలుగు · Muhammad
7 : 150

وَلَمَّا رَجَعَ مُوسَىٰٓ إِلَىٰ قَوۡمِهِۦ غَضۡبَٰنَ أَسِفٗا قَالَ بِئۡسَمَا خَلَفۡتُمُونِي مِنۢ بَعۡدِيٓۖ أَعَجِلۡتُمۡ أَمۡرَ رَبِّكُمۡۖ وَأَلۡقَى ٱلۡأَلۡوَاحَ وَأَخَذَ بِرَأۡسِ أَخِيهِ يَجُرُّهُۥٓ إِلَيۡهِۚ قَالَ ٱبۡنَ أُمَّ إِنَّ ٱلۡقَوۡمَ ٱسۡتَضۡعَفُونِي وَكَادُواْ يَقۡتُلُونَنِي فَلَا تُشۡمِتۡ بِيَ ٱلۡأَعۡدَآءَ وَلَا تَجۡعَلۡنِي مَعَ ٱلۡقَوۡمِ ٱلظَّٰلِمِينَ

మరియు మూసా తన జాతి వారి వద్దకు తిరిగి వచ్చి క్రోధంతో విచారంతో అన్నాడు: "నేను వెళ్ళిన పిదప మీరు ఆచరించింది ఎంత చెడ్డది! ఏమీ? మీ ప్రభువు ఆజ్ఞ (రాకముందే) తొందరపడి (ఆయన ఆరాధనను వదిలారా)?" తరువాత ఫలకాలను పడవేసి, తన సోదరుని తల వెంట్రుకలను పట్టుకొని తన వైపుకు లాగాడు. (హారూన్) అన్నాడు: "నా సోదరుడా (తల్లి కుమారుడా!) వాస్తవానికి ఈ ప్రజలు బలహీనునిగా చూసి నన్ను చంపేవారే, కావున నీవు (మన) శత్రువులకు, నన్ను చూసి సంతోషించే అవకాశం ఇవ్వకు మరియు నన్ను దుర్మార్గులలో లెక్కించకు!"

Explanation & meanings · 2
  1. మూసా ('అ.స.) తన జాతివారు అల్లాహ్ (సు.తా.) ను వదలి ఆవుదూడ విగ్రహాన్ని ఆరాధించటాన్ని చూసి, క్రోధావేశంలో ఏమీ తోచక - తన సోదరుణ్ణి పట్టుకొని శిక్షించటానికి, తన చేతులలో ఉన్న ఫలకాలను క్రిందపెట్టి - తన సోదరుని తలవెంట్రుకలను పట్టుకున్నారే గానీ, ఫలకాలకు అనాదరణ చేయటం అతని ఉద్దేశం కాదు. కోపం చల్లారిన తరువాత అతను వాటిని ఎత్తుకున్నారు. చూడండి, ఆయత్, 154.
  2. చూడండి, 20:92-94.