Skip to content
సూరాల జాబితా /

الأنعَام

الأنعَام is chapter 6 of the Quran and has 165 verses. This page presents it in full in the Uthmani script, with a verse-by-verse translation of its meaning.

165 ఆయతులు సూరా సంఖ్య 6
ఆయత్‌కు వెళ్ళండి
తెలుగు · Muhammad
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

ٱلۡحَمۡدُ لِلَّهِ ٱلَّذِي خَلَقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ وَجَعَلَ ٱلظُّلُمَٰتِ وَٱلنُّورَۖ ثُمَّ ٱلَّذِينَ كَفَرُواْ بِرَبِّهِمۡ يَعۡدِلُونَ

ఆకాశాలను మరియు భూమిని సృష్టించి; చీకట్లను మరియు వెలుగును నెలకొలిపిన అల్లాహ్ మాత్రమే సర్వస్తోత్రాలకు అర్హుడు. అయినా సత్యతిరస్కారులు (ఇతరులను) తమ ప్రభువుకు సమానులుగా పరిగణిస్తున్నారు.

هُوَ ٱلَّذِي خَلَقَكُم مِّن طِينٖ ثُمَّ قَضَىٰٓ أَجَلٗاۖ وَأَجَلٞ مُّسَمًّى عِندَهُۥۖ ثُمَّ أَنتُمۡ تَمۡتَرُونَ

ఆయనే మిమ్మల్ని మట్టితో సృష్టించి, ఆ తరువాత మీకు ఒక గడువు నియమించాడు. ఆయన దగ్గర మరొక నిర్ణీత గడువు కూడా ఉంది. అయినా మీరు సంశయంలో పడి ఉన్నారు.

Explanation & meanings · 2
  1. అంటే మరణసమయం
  2. అంటే పునరుత్థానదినం.

وَهُوَ ٱللَّهُ فِي ٱلسَّمَٰوَٰتِ وَفِي ٱلۡأَرۡضِ يَعۡلَمُ سِرَّكُمۡ وَجَهۡرَكُمۡ وَيَعۡلَمُ مَا تَكۡسِبُونَ

మరియు ఆయన! అల్లాహ్ యే, ఆకాశాలలోనూ మరియు భూమిలోనూ (ఆరాధ్యుడు). మీరు దాచేది మరియు వెలిబుచ్చేది, అంతా ఆయనకు తెలుసు మరియు మీరు అర్జించేది (మంచి చెడు) అంతా ఆయనకు బాగా తెలుసు.

Explanation & meanings · 1
  1. అల్లాహ్ (సు.తా.) 'అర్ష్ పై ఉంటాడు. ఆయన ఔన్నత్యానికి తగినట్లుగా. కానీ అల్లాహుతా'ఆలా తన జ్ఞానంతో ప్రతిచోట ఉంటాడు. అంటే ఏ విషయం కూడా అల్లాహ్ (సు.తా.) జ్ఞానపరిధి నుండి అగోచరంగా లేదు. ఇది అహ్లెసున్నత్, సలఫుల విశ్వాసం (అఖీదహ్). వివరాలకు చూడండి, 'తబరీ, ఇబ్నె-కసీ'ర్.

وَمَا تَأۡتِيهِم مِّنۡ ءَايَةٖ مِّنۡ ءَايَٰتِ رَبِّهِمۡ إِلَّا كَانُواْ عَنۡهَا مُعۡرِضِينَ

అయినా వారి ప్రభువు సూచనల నుండి వారి వద్దకు ఏ సూచన వచ్చినా దానికి వారు విముఖతే చూపేవారు!

فَقَدۡ كَذَّبُواْ بِٱلۡحَقِّ لَمَّا جَآءَهُمۡ فَسَوۡفَ يَأۡتِيهِمۡ أَنۢبَٰٓؤُاْ مَا كَانُواْ بِهِۦ يَسۡتَهۡزِءُونَ

వాస్తవానికి, ఇప్పుడు వారు తమ వద్దకు వచ్చిన సత్యాన్ని (ఈ దివ్య గ్రంథాన్ని) కూడా అసత్యమని తిరస్కరించారు. కాబట్టి వారు పరిహసించే దాని (ప్రతిఫలాన్ని) గురించిన వార్త వారికి త్వరలోనే రానున్నది.

Explanation & meanings · 1
  1. చూడండి, 'స. ముస్లిం, పుస్తకము - 1, అధ్యాయము - 240.