7 : 72
فَأَنجَيۡنَٰهُ وَٱلَّذِينَ مَعَهُۥ بِرَحۡمَةٖ مِّنَّا وَقَطَعۡنَا دَابِرَ ٱلَّذِينَ كَذَّبُواْ بِـَٔايَٰتِنَاۖ وَمَا كَانُواْ مُؤۡمِنِينَ
కావున తుదకు మేము అతనిని (హూద్ ను) మరియు అతని తోటి వారిని మా అనుగ్రహంతో రక్షించాము. మరియు మా సూచనలు అసత్యాలని తిరస్కరించిన వారిని నిర్మూలించాము. ఎందుకంటే వారు విశ్వసించకుండా ఉన్నారు.
Explanation & meanings · 1
- వారిపై ఎనిమిది రోజులు, ఏడు రాత్రులు భయంకరమైన తుఫాను గాలి, విరుచుకు పడింది. వారు కోసిన ఖర్జూర చెట్ల వలె పడిపోయారు. చూడండి, 69:6-8, 11:53-56, 46:24-25.