Skip to content
అల్-అరాఫ్ /

ఆయత్ 188

7 : 188

ఆయత్ 188 of అల్-అరాఫ్ (7 : 188). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

అల్-అరాఫ్ ఆయతులు 206
సూరా · అల్-అరాఫ్
తెలుగు · Muhammad
7 : 188

قُل لَّآ أَمۡلِكُ لِنَفۡسِي نَفۡعٗا وَلَا ضَرًّا إِلَّا مَا شَآءَ ٱللَّهُۚ وَلَوۡ كُنتُ أَعۡلَمُ ٱلۡغَيۡبَ لَٱسۡتَكۡثَرۡتُ مِنَ ٱلۡخَيۡرِ وَمَا مَسَّنِيَ ٱلسُّوٓءُۚ إِنۡ أَنَا۠ إِلَّا نَذِيرٞ وَبَشِيرٞ لِّقَوۡمٖ يُؤۡمِنُونَ

(ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను: "అల్లాహ్ కోరితే తప్ప నా స్వయానికి నేను లాభం గానీ, నష్టం గానీ చేసుకునే అధికారం నాకు లేదు. నాకు అగోచర విషయజ్ఞానం ఉండి ఉన్నట్లైతే నేను లాభం కలిగించే విషయాలను నా కొరకు అధికంగా సమకూర్చుకునేవాడిని. మరియు నాకు ఎన్నడూ ఏ నష్టం కలిగేది కాదు. నేను విశ్వసించే వారికి కేవలం హెచ్చరిక చేసేవాడను మరియు శుభవార్త నిచ్చేవాడను మాత్రమే!"

Explanation & meanings · 3
  1. నప్'అన్: అంటే లాభం, మేలు, ప్రయోజనం, ఉపయోగం అనే అర్థాలున్నాయి.
  2. 'దర్రన్: అంటే నష్టం, కీడు, హాని, చెరుపు, అపాయం, దోషం, ఆపద, బాధ అనే అర్థాలున్నాయి.
  3. దైవప్రవక్త ము'హమ్మద్ ('స'అస) కు ఎట్టి అగోచర జ్ఞానం లేదు అని ఇక్కడ స్పష్టంగా విశదమవుతుంది. అగోచర జ్ఞానం గలవాడు కేవలం అల్లాహ్ (సు.తా.) ఒక్కడు మాత్రమే! దీనికి నిదర్శనాలు: 1) ము'హమ్మద్ ('స'అస) యొక్క పన్ను 'ఉహుద్ యుద్ధరంగంలో విరిగి పోయింది. అతను గాయాలతో స్పృహ తప్పి పడిపోయారు. ఏ విధంగానైతే ఒక సాధారణ మానవుడు బాధపడుతాడో అదే విధంగా అతను బాధపడ్డారు. 2) 'ఆయి'షహ్ (ర.'అన్హా)పై నింద మోపబడినప్పుడు, అల్లాహుతా'ఆలా వ'హీ వచ్చేంత వరకు, అతను సాధారణ వ్యక్తిగానే వ్యవహరించారు. ఒకవేళ అతనికి అగోచర జ్ఞానమే ఉంటే ఇదంతా అతనికి ముందుగా తెలిసి, బాధపడేవారు కాదు.