Skip to content
الأعرَاف /

ఆయత్ 155

7 : 155

ఆయత్ 155 of الأعرَاف (7 : 155). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الأعرَاف ఆయతులు 206
సూరా · الأعرَاف
తెలుగు · Muhammad
7 : 155

وَٱخۡتَارَ مُوسَىٰ قَوۡمَهُۥ سَبۡعِينَ رَجُلٗا لِّمِيقَٰتِنَاۖ فَلَمَّآ أَخَذَتۡهُمُ ٱلرَّجۡفَةُ قَالَ رَبِّ لَوۡ شِئۡتَ أَهۡلَكۡتَهُم مِّن قَبۡلُ وَإِيَّٰيَۖ أَتُهۡلِكُنَا بِمَا فَعَلَ ٱلسُّفَهَآءُ مِنَّآۖ إِنۡ هِيَ إِلَّا فِتۡنَتُكَ تُضِلُّ بِهَا مَن تَشَآءُ وَتَهۡدِي مَن تَشَآءُۖ أَنتَ وَلِيُّنَا فَٱغۡفِرۡ لَنَا وَٱرۡحَمۡنَاۖ وَأَنتَ خَيۡرُ ٱلۡغَٰفِرِينَ

మరియు మేము నిర్ణయించిన గడువు కొరకు, మూసా తన జాతి వారిలో నుండి డెబ్బై మందిని ఎన్నుకున్నాడు. ఆ పిదప వారిని భూకంపం ఆవరించగా (మూసా) ఇలా ప్రార్థించాడు: "ఓ నా ప్రభూ! నీవు కోరితే, వీరిని మరియు నన్ను కూడా ఇంతకు పూర్వమే సంహరించి ఉండేవాడవు. ఏమీ? మాలో కొందరు మూఢులు చేసిన పనికి నీవు మమ్మల్ని నశింపజేస్తావా? ఇదంతా నీ పరీక్షయే! దీని ద్వారా నీవు కోరిన వారిని మార్గభ్రష్టత్వానికి గురి చేస్తావు మరియు నీవు కోరిన వారికి మార్గదర్శకత్వం చేస్తావు. మా సంరక్షకుడవు నీవే, కావున మమ్మల్ని క్షమించు, మమ్మల్ని కరుణించు. మరియు క్షమించే వారందరిలో నీవే అత్యుత్తముడవు!"

Explanation & meanings · 1
  1. చూడండి, 2:55 అక్కడ పిడుగు ('సా'యిఖతున్) పడి ఆ 70 మంది చనిపోయినట్లు ఉంది. బహుశా ఈ రెండు శిక్షలు వచ్చి ఉండవచ్చు. మూసా ('అ.స.) ప్రార్థన వల్ల ఆ 70 మంది మళ్ళీ సజీవులయ్యారు.