Skip to content
الأعرَاف /

ఆయత్ 131

7 : 131

ఆయత్ 131 of الأعرَاف (7 : 131). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الأعرَاف ఆయతులు 206
సూరా · الأعرَاف
తెలుగు · Muhammad
7 : 131

فَإِذَا جَآءَتۡهُمُ ٱلۡحَسَنَةُ قَالُواْ لَنَا هَٰذِهِۦۖ وَإِن تُصِبۡهُمۡ سَيِّئَةٞ يَطَّيَّرُواْ بِمُوسَىٰ وَمَن مَّعَهُۥٓۗ أَلَآ إِنَّمَا طَٰٓئِرُهُمۡ عِندَ ٱللَّهِ وَلَٰكِنَّ أَكۡثَرَهُمۡ لَا يَعۡلَمُونَ

ఆ పిదప వారికి మంచికాలం వచ్చినపుడు వారు: "మేము దీనికే అర్హులం!" అని అనేవారు. కాని వారికి కష్టకాలం దాపురించి నపుడు, వారు మూసా మరియు అతనితో పాటు ఉన్నవారిని తమకు అపశకునంగా పరిగణించేవారు. వాస్తవానికి వారి అపశకునాలన్నీ అల్లాహ్ చేతుల్లోనే ఉన్నాయి, కాని వారిలో చాలా మందికి తెలియదు.

Explanation & meanings · 1
  1. 'తాఇ'రున్: ఎగురుట. 'తాఇ'రుహుమ్: అపశకునం. ప్రాచీన కాలంలో శుభ - అశుభ శకునాలను పక్షులను ఎగుర వేసి అంచనా వేసేవారు. శకునాలు చూడటం ఇస్లాంలో 'హరాం. శకునాలను గురించి ఇంకా చూడండి, 3:49, 5:110, 17:13, 27:47 మరియు 36:18-19.