سَأَصۡرِفُ عَنۡ ءَايَٰتِيَ ٱلَّذِينَ يَتَكَبَّرُونَ فِي ٱلۡأَرۡضِ بِغَيۡرِ ٱلۡحَقِّ وَإِن يَرَوۡاْ كُلَّ ءَايَةٖ لَّا يُؤۡمِنُواْ بِهَا وَإِن يَرَوۡاْ سَبِيلَ ٱلرُّشۡدِ لَا يَتَّخِذُوهُ سَبِيلٗا وَإِن يَرَوۡاْ سَبِيلَ ٱلۡغَيِّ يَتَّخِذُوهُ سَبِيلٗاۚ ذَٰلِكَ بِأَنَّهُمۡ كَذَّبُواْ بِـَٔايَٰتِنَا وَكَانُواْ عَنۡهَا غَٰفِلِينَ
ఏ హక్కూ లేకుండా భూమిపై దురహంకారంతో వ్యవహరించే వారిని నేను నా సూచనల (ఆయాత్ ల) నుండి దూరం చేస్తాను. మరియు వారు ఏ సూచనను (ఆయత్ ను) చూసినా దానిని విశ్వసించరు. ఒకవేళ సక్రమమైన మార్గం వారి ముందుకు వచ్చినా, వారు దానిని అవలంబించరు. కాని వారు తప్పు దారిని చూస్తే దానిని అవలంబిస్తారు. ఎందుకంటే వాస్తవానికి, వారు మా సూచనలను (ఆయాత్ లను) అబద్ధాలని తిరస్కరించారు మరియు వాటి నుండి నిర్లక్ష్యులై ఉన్నారు.
- చూడండి, 10:96-97.
- ఈ విషయం ఈ కాలంలో గూడ జరుగుతోంది. ఈ కాలపు చాలా మంది ముస్లింలు కూడా మంచి నుండి దూరమై పోతున్నారు మరియు చెడును అవలంబిస్తున్నారు.
- చూడండి, 96:67.