7 : 133
فَأَرۡسَلۡنَا عَلَيۡهِمُ ٱلطُّوفَانَ وَٱلۡجَرَادَ وَٱلۡقُمَّلَ وَٱلضَّفَادِعَ وَٱلدَّمَ ءَايَٰتٖ مُّفَصَّلَٰتٖ فَٱسۡتَكۡبَرُواْ وَكَانُواْ قَوۡمٗا مُّجۡرِمِينَ
కావున మేము వారిపై జలప్రళయం (తూఫాన్), మిడుతల దండు, పేనులు, కప్పలు మరియు రక్తం మొదలైన స్పష్టమైన సూచనలను పంపాము. అయినా వారు దురహంకారం చూపారు ఎందుకంటే వారు మహా అపరాధులై ఉండిరి.
Explanation & meanings · 1
- ఈ తొమ్మిది అద్భుత సూచనలు: 1) కర్ర, 2) చేయి తెల్లగా మారుట, 3) కరువు (ఫల, పంటల నష్టం, 4) జల ప్రళయం (తుఫాను), 5) మిడుతల దండు, 6) పేనులు, 7) కప్పలు, 8) రక్తం, 9) సముద్రంలో త్రోవ.