Skip to content
الأنعَام /

ఆయత్ 97

6 : 97
الأنعَام ఆయతులు 165
సూరా · الأنعَام
తెలుగు · Muhammad
6 : 97

وَهُوَ ٱلَّذِي جَعَلَ لَكُمُ ٱلنُّجُومَ لِتَهۡتَدُواْ بِهَا فِي ظُلُمَٰتِ ٱلۡبَرِّ وَٱلۡبَحۡرِۗ قَدۡ فَصَّلۡنَا ٱلۡأٓيَٰتِ لِقَوۡمٖ يَعۡلَمُونَ

మరియు ఆయనే మీ కొరకు చీకట్లలో - భూమి మీద మరియు సముద్రంలో - మార్గాలను తెలుసు కోవటానికి, నక్షత్రాలను పుట్టించాడు. వాస్తవానికి, ఈ విధంగా మేము జ్ఞానవంతుల కొరకు మా సూచనలను వివరించి తెలిపాము.

Explanation & meanings · 1
  1. నక్షత్రాలను గురించి అల్లాహ్ (సు.తా.) యొక్క మూడు ఆదేశాలను అబూ-ఖతాదా (ర.'ది.'అ) ఇలా వివరించారు: 1) దగ్గరి ఆకాశాన్ని మేము నక్షత్రాలతో అలంకరించాము 67:5, 2) షై'తానులను తరిమే కొరవిగా మరియు 3) ఆ ఆయత్ లో చెప్పింది - చీకట్లలో మార్గాలు తెలుసుకోవటానికి. కావున నక్షత్రాలలో ఎవరైనా ఈ మూడు తప్ప ఇతర ఉపయోగాలను వెతికితే! వారు తప్పు దారిలో పడ్డవారే. ('స'హీ'హ్ బు'ఖారీ, పుస్తకం - 4). ఇంకా చూడండి, అబూ దావూద్ 'హదీస్' నం. 3905. కాబట్టి నక్షత్రాల ద్వారా భవిష్యత్తు చెప్పడం మొదలైనవి ఊహాగానాలే! అవి షరీయత్ కు విరుద్ధమైనవి. కావున వీటిని మంత్రజాలపు ఒక భాగంగా పేర్కొనబడింది.