6 : 86
وَإِسۡمَٰعِيلَ وَٱلۡيَسَعَ وَيُونُسَ وَلُوطٗاۚ وَكُلّٗا فَضَّلۡنَا عَلَى ٱلۡعَٰلَمِينَ
మరియు ఇస్మాయీల్, అల్ యసఅ, యూనుస్ మరియు లూత్ లకు కూడా (సన్మార్గం చూపాము). ప్రతి ఒక్కరికీ (వారి కాలపు) సర్వ లోకాల వాసులపై ఘనతను ప్రసాదించాము.
Explanation & meanings · 1
- లూ'త్ ('అ.స.) ఇబ్రాహీమ్ ('అ.స.) సోదరుడైన హారాన బిన్-ఆజర్ కుమారుడు. ఇబ్రాహీమ్ ('అ.స.), లూ'త్ ('అ.స.) యొక్క చిన్నాన్న. కాని అతను కూడా ఇబ్రాహీమం ('అ.స.) యొక్క సంతతిలోని వారిగా పరిణింపబడ్డారు. ఖుర్ఆన్ లో ఇటువంటి ఉదాహరణ మరొకటి ఉంది. ఇస్మా'యీల్ ('అ.స.) య'అఖూబ్ ('అ.స.) యొక్క తండ్రిగా పరిగణింపబడ్డారు. వాస్తవానికి అతను, య'అఖూబ్ ('అ.స.) యొక్క పెద్ద నాన్న (Uncle). ఇంకా చూడండి, 2:133.