Skip to content
الأنعَام /

ఆయత్ 138

6 : 138

ఆయత్ 138 of الأنعَام (6 : 138). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الأنعَام ఆయతులు 165
సూరా · الأنعَام
తెలుగు · Muhammad
6 : 138

وَقَالُواْ هَٰذِهِۦٓ أَنۡعَٰمٞ وَحَرۡثٌ حِجۡرٞ لَّا يَطۡعَمُهَآ إِلَّا مَن نَّشَآءُ بِزَعۡمِهِمۡ وَأَنۡعَٰمٌ حُرِّمَتۡ ظُهُورُهَا وَأَنۡعَٰمٞ لَّا يَذۡكُرُونَ ٱسۡمَ ٱللَّهِ عَلَيۡهَا ٱفۡتِرَآءً عَلَيۡهِۚ سَيَجۡزِيهِم بِمَا كَانُواْ يَفۡتَرُونَ

మరియు వారు:"ఈ పశువులు మరియు ఈ పంటలు నిషిద్ధం చేయబడ్డాయి. మేము కోరినవారు తప్ప ఇతరులు వీటిని తినరాదు." అని అంటారు. కొన్ని జంతువుల వీపులపై బరువు వేయటాన్ని (స్వారీ చేయటాన్ని) నిషేధిస్తారు. మరికొన్ని జంతువులను (వధించేటప్పుడు) వాటి మీద అల్లాహ్ పేరు ఉచ్ఛరించరు. ఇవన్నీ వారు ఆయనపై కల్పించిన (అబద్ధాలు) మాత్రమే. ఆయన త్వరలోనే వారికి, వారి (అసత్య) కల్పనలకు తగిన ప్రతిఫలం ఇవ్వగలడు.

Explanation & meanings · 1
  1. చూడండి, 5:103. దీని అర్థమేమిటంటే ముష్రిక్ 'అరబ్బులు అల్లాహ్ (సు.తా.) ను ఏకైక అత్యున్నత దైవంగా విశ్వసించి, కొన్ని పశువులను వధించేటప్పుడు అల్లాహుతా'ఆలా పుర తీసుకునేవారు. కాని తాము కల్పించిన దైవాలకు బలి ఇచ్చేటప్పుడు, ఆ దైవాల పేర్లే తీసుకునేవారు. ఇదే విధంగా ఈ నాటి హిందువులు (ముష్రికులు), కూడా పరమేశ్వరుణ్ణి ఏకైక అత్యుత్నత దైవంగా విశ్వసిస్తున్నారు. కాని అల్లాహ్ (సు.తా.)కు భాగస్వాములను, ప్రతి కార్యనిర్వాహణకు ఒక దైవాన్ని కల్పించుకున్నారు. అల్లాహుతా'ఆలా అన్నాడు: "నేను ప్రతి పాపాన్ని - నేను తలచుకుంటే - క్షమిస్తాను! ఒక్క షిర్కు తప్ప."