6 : 107
وَلَوۡ شَآءَ ٱللَّهُ مَآ أَشۡرَكُواْۗ وَمَا جَعَلۡنَٰكَ عَلَيۡهِمۡ حَفِيظٗاۖ وَمَآ أَنتَ عَلَيۡهِم بِوَكِيلٖ
మరియు అల్లాహ్ సంకల్పించి ఉంటే! వారు అల్లాహ్ కు సాటి కల్పించి ఉండేవారు కాదు. మరియు మేము నిన్ను వారిపై రక్షకునిగా నియమించలేదు. నీవు వారి కొరకు బాధ్యుడవు (కార్యకర్తవు) కావు.
Explanation & meanings · 2
- చూడండి, 2:253 మరియు 6:35.
- అంటే నీకు వారిపై ఎట్టి అధికారం లేదు. ఒకవేళ దైవప్రవక్త ('స'అస) కు అల్లాహ్ (సు.తా.) ఇతరులపై అధికారం ఇచ్చి ఉంటే, అతను తన పినతండ్రి అబూ - 'తాలిబ్ ను బలవంతంగా ముస్లిం చేసి ఉండేవారు. ఎందుకంటే దైవప్రవక్త ('స'అస) తండ్రి వంటి తన పోషకుణ్ణి తెలిసి ఉండి కూడా నరకాగ్నిలోకి ఎలా పోనివ్వగలరు.