Skip to content
الأنعَام /

ఆయత్ 151

6 : 151

ఆయత్ 151 of الأنعَام (6 : 151). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الأنعَام ఆయతులు 165
సూరా · الأنعَام
తెలుగు · Muhammad
6 : 151

۞ قُلۡ تَعَالَوۡاْ أَتۡلُ مَا حَرَّمَ رَبُّكُمۡ عَلَيۡكُمۡۖ أَلَّا تُشۡرِكُواْ بِهِۦ شَيۡـٔٗاۖ وَبِٱلۡوَٰلِدَيۡنِ إِحۡسَٰنٗاۖ وَلَا تَقۡتُلُوٓاْ أَوۡلَٰدَكُم مِّنۡ إِمۡلَٰقٖ نَّحۡنُ نَرۡزُقُكُمۡ وَإِيَّاهُمۡۖ وَلَا تَقۡرَبُواْ ٱلۡفَوَٰحِشَ مَا ظَهَرَ مِنۡهَا وَمَا بَطَنَۖ وَلَا تَقۡتُلُواْ ٱلنَّفۡسَ ٱلَّتِي حَرَّمَ ٱللَّهُ إِلَّا بِٱلۡحَقِّۚ ذَٰلِكُمۡ وَصَّىٰكُم بِهِۦ لَعَلَّكُمۡ تَعۡقِلُونَ

ఇలా అను: "రండి మీ ప్రభువు మీకు నిషేధించి వున్న వాటిని మీకు వినిపిస్తాను: 'మీరు ఆయనకు సాటి (భాగస్వాములను) కల్పించకండి. మరియు తల్లిదండ్రులతో మంచిగా ప్రవర్తించండి. మరియు పేదరికానికి భయపడి మీ సంతానాన్ని చంపకండి. మేమే మీకూ మరియు వారికి కూడా జీవనోపాధిని ఇచ్చేవారము. మరియు బహిరంగంగా గానీ, లేదా దొంగచాటుగా గానీ అశ్లీలమైన (సిగ్గుమాలిన) పనులను సమీపించకండి. అల్లాహ్ నిషేధించిన ప్రాణిని, న్యాయం కొరకు తప్ప చంపకండి. మీరు అర్థం చేసుకోవాలని ఈ విషయాలను ఆయన మీకు ఆజ్ఞాపిస్తున్నాడు.

Explanation & meanings · 3
  1. షిర్క్ : ఇతరులను అల్లాహ్ (సు.తా.) కు సాటి (భాగస్వాములుగా) కల్పించటం. అది మహాపాపం. దాని కెట్టి పరిహారం లేదు. అది క్షమింపబడని పాపం. షిర్కు చేసే వారికి స్వర్గం 'హరాం మరియు నరకం అనివార్యం చేయబడ్డాయి. ఈ విషయం దివ్యఖుర్ఆన్ లో మాటిమాటికీ ఎన్నోసార్లు విశదీకరించబడింది.
  2. అంటే ఫామిలీ ప్లానింగ్ కొరకు చేసే అబార్షన్లు మొదలైనవి.
  3. చూడండి, 2:179.