Skip to content
الأنعَام /

ఆయత్ 136

6 : 136

ఆయత్ 136 of الأنعَام (6 : 136). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الأنعَام ఆయతులు 165
సూరా · الأنعَام
తెలుగు · Muhammad
6 : 136

وَجَعَلُواْ لِلَّهِ مِمَّا ذَرَأَ مِنَ ٱلۡحَرۡثِ وَٱلۡأَنۡعَٰمِ نَصِيبٗا فَقَالُواْ هَٰذَا لِلَّهِ بِزَعۡمِهِمۡ وَهَٰذَا لِشُرَكَآئِنَاۖ فَمَا كَانَ لِشُرَكَآئِهِمۡ فَلَا يَصِلُ إِلَى ٱللَّهِۖ وَمَا كَانَ لِلَّهِ فَهُوَ يَصِلُ إِلَىٰ شُرَكَآئِهِمۡۗ سَآءَ مَا يَحۡكُمُونَ

మరియు ఆయన (అల్లాహ్) పుట్టించిన పంటల నుండి మరియు పశువుల నుండి, వారు అల్లాహ్ కొరకు కొంత భాగాన్ని నియమించి: "ఇది అల్లాహ్ కొరకు మరియు ఇది మా దేవతల (అల్లాహ్ కు వారు సాటి కల్పించినవారి) కొరకు." అని తమ ఊహలో చెబుతారు. వారి దేవతలకు చెందిన భాగం అల్లాహ్ కు చేరదు. మరియు అల్లాహ్ కు చెందిన భాగం వారి దేవతలకు చేరుతుంది. ఎలాంటి చెడు నిర్ణయాలు చేస్తున్నారు వీరు!

Explanation & meanings · 1
  1. ముష్రిక్ ఖురైషులు తమ సేద్యపు పంటలలో మరియు ఇతర ఆదాయలలో కొంతభాగం అల్లాహ్ (సు.తా.) పేర, మరికొంత తమ కల్పిత దైవాల పేర నిర్ణయించేవారు. అల్లాహుతా'ఆలా పేర ఉన్న దానిని తమ దగ్గరి బంధువుల పై, పేదవారిపై మరియు అతిథులపై ఖర్చు చేసేవారు. కల్పిత దైవాల పేర ఉన్న దానిని, వారి పూజారుల మీద. కల్పిత దేవాల పేర ఉన్నదానిలో పంట సరిగ్గా పండకుంటే అల్లాహ్ (సు.తా.) పేర ఉన్నదాని నుండి తీసుకొని పూజారులకు ఇచ్చేవారు, కాని అల్లాహుతా'ఆలా పేర ఉన్నదానిలో తగ్గింపు అయితే అల్లాహ్ (సు.తా.) స్వయంసమృద్ధుడు, ఏమీ అక్కర లేనివాడనేవారు. అంటే తమ దగ్గరి బంధువులకు , పేదవారికి మరియు అతిథులకు ఇచే వారు కాదు.