6 : 52
وَلَا تَطۡرُدِ ٱلَّذِينَ يَدۡعُونَ رَبَّهُم بِٱلۡغَدَوٰةِ وَٱلۡعَشِيِّ يُرِيدُونَ وَجۡهَهُۥۖ مَا عَلَيۡكَ مِنۡ حِسَابِهِم مِّن شَيۡءٖ وَمَا مِنۡ حِسَابِكَ عَلَيۡهِم مِّن شَيۡءٖ فَتَطۡرُدَهُمۡ فَتَكُونَ مِنَ ٱلظَّٰلِمِينَ
మరియు ఎవరైతే తమ ప్రభువును ఉదయం మరియు సాయంత్రం ప్రార్థిస్తూ, ఆయన ముఖాన్ని (చూడ) గోరుతున్నారో, వారిని నీవు దూరం చేయకు. వారి లెక్క కొరకు నీవు ఎంత మాత్రమూ జవాబుదారుడవు కావు. మరియు నీ లెక్క కొరకు వారూ జవాబుదారులు కారు. కావున నీవు వారిని దూరం చేస్తే నీవు దుర్మార్గులలో చేరిన వాడవవుతావు.
Explanation & meanings · 1
- ప్రళయదినాన విశ్వాసులకు లభించే అతి గొప్ప వరం అల్లాహ్ (సు.తా.) దర్శనం. అందుకే ఖుర్ఆన్ లో అనేక చోట్లలో: "అల్లాహ్ ముఖాన్ని చూడగోరేవారు..." అని చెప్పబడింది: "ఓ ప్రవక్తా! 'ధనవంతులు, పేరు ప్రఖ్యాతులు గల అవిశ్వాసులైన ముష్రిక్ ల మాటలలో పడి - ఇస్లాం స్వీకరించి తమ ప్రభువైన అల్లాహ్ (సు.తా.) ను ప్రార్థించే - పేదవారిని, బానిసలను దూరం చేయకు.' "