هَلۡ يَنظُرُونَ إِلَّآ أَن تَأۡتِيَهُمُ ٱلۡمَلَٰٓئِكَةُ أَوۡ يَأۡتِيَ رَبُّكَ أَوۡ يَأۡتِيَ بَعۡضُ ءَايَٰتِ رَبِّكَۗ يَوۡمَ يَأۡتِي بَعۡضُ ءَايَٰتِ رَبِّكَ لَا يَنفَعُ نَفۡسًا إِيمَٰنُهَا لَمۡ تَكُنۡ ءَامَنَتۡ مِن قَبۡلُ أَوۡ كَسَبَتۡ فِيٓ إِيمَٰنِهَا خَيۡرٗاۗ قُلِ ٱنتَظِرُوٓاْ إِنَّا مُنتَظِرُونَ
ఏమీ? వారు తమ వద్దకు దేవదూతలు రావాలని గానీ, లేక నీ ప్రభువు రావాలని గానీ, లేదా నీ ప్రభువు యొక్క కొన్ని (బహిరంగ) నిదర్శనాలు రావాలని గానీ ఎదురు చూస్తున్నారా? నీ ప్రభువు యొక్క కొన్ని (బహిరంగ) నిదర్శనాలు వచ్చే రోజున, పూర్వం విశ్వసించకుండా ఆ రోజున విశ్వసించిన వ్యక్తికీ, లేదా విశ్వసించి కూడా ఏ మంచినీ సంపాదించుకోని వ్యక్తికీ, తన విశ్వాసం వల్ల (ఆ రోజు) ఏ ప్రయోజనం చేకూరదు. వారితో ఇలా అను: "మీరు నిరీక్షించండి. నిశ్చయంగా, మేము కూడా నిరీక్షిస్తాము."
- చూడండి, 40:84-85 మరియు 47:18. ఇంకా చూడండి, 'స.బు'ఖారీ, పు.6 'హ.నం. 159 మరియు పు. 9 'హ.నం. 245.