6 : 143
ثَمَٰنِيَةَ أَزۡوَٰجٖۖ مِّنَ ٱلضَّأۡنِ ٱثۡنَيۡنِ وَمِنَ ٱلۡمَعۡزِ ٱثۡنَيۡنِۗ قُلۡ ءَآلذَّكَرَيۡنِ حَرَّمَ أَمِ ٱلۡأُنثَيَيۡنِ أَمَّا ٱشۡتَمَلَتۡ عَلَيۡهِ أَرۡحَامُ ٱلۡأُنثَيَيۡنِۖ نَبِّـُٔونِي بِعِلۡمٍ إِن كُنتُمۡ صَٰدِقِينَ
(పెంటి-పోతు కలిసి) ఎనిమిది రకాలు (జతలు). అందులో గొర్రెలలో నుండి రెండు (పెంటి - పోతు) మరియు మేకలలో నుండి రెండు (పెంటి - పోతు). వారిని అడుగు: "ఏమీ? ఆయన నిషేధించింది, రెండు మగవాటినా ? లేక రెండు ఆడవాటినా? లేక ఆ రెండు ఆడవాటి గర్భాలలో ఉన్న వాటినా? మీరు సత్యవంతులే అయితే, నాకు సరైన జ్ఞానంతో తెలుపండి."
Explanation & meanings · 2
- అరబ్బీ భాషలో ఒకే రమైన ఆడ-మగలను కలిపి జత ('జౌజ్), అంటారు. ఆ రెండింటిలోని, ప్రతి ఒక్క దానిని కూడా 'జౌజ్, అని అంటారు. అంటే జతలో నుండి ఒకటి. ఎందుకంటే, ఒకటి మరొకదాని జతకారి. ఇక్కడ ఆ జతలో ప్రతి ఒక్కటి అనే అర్థంలో ఉపయోగించబడింది.
- ముష్రికులు కొన్ని పశువులను తమంతట తామే నిషిద్ధం ('హరాం) చేసుకొని ఉండిరి. కావున ఇక్కడ వారితో ఈ ప్రశ్న అడుగబడుతోంది. ఎందుకంటే, అల్లాహ్ (సు.తా.) వీటిలో దేనిని కూడా 'హరామ్ చేయలేదు.