Skip to content
الأنعَام /

ఆయత్ 164

6 : 164

ఆయత్ 164 of الأنعَام (6 : 164). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الأنعَام ఆయతులు 165
సూరా · الأنعَام
తెలుగు · Muhammad
6 : 164

قُلۡ أَغَيۡرَ ٱللَّهِ أَبۡغِي رَبّٗا وَهُوَ رَبُّ كُلِّ شَيۡءٖۚ وَلَا تَكۡسِبُ كُلُّ نَفۡسٍ إِلَّا عَلَيۡهَاۚ وَلَا تَزِرُ وَازِرَةٞ وِزۡرَ أُخۡرَىٰۚ ثُمَّ إِلَىٰ رَبِّكُم مَّرۡجِعُكُمۡ فَيُنَبِّئُكُم بِمَا كُنتُمۡ فِيهِ تَخۡتَلِفُونَ

ఇలా అను: "ఏమీ? నేను అల్లాహ్ ను వదలి ఇతరులను ప్రభువులుగా అర్థించాలా? ఆయనే ప్రతి దానికీ ప్రభువు! ప్రతి వ్యక్తీ తాను సంపాదించిందే అనుభవిస్తాడు. మరియు బరువు మోసేవాడు ఎవ్వడూ ఇతరుల బరువును మోయడు. చివరకు మీరంతా మీ ప్రభువు వైపునకే మరలి పోవలసి ఉంది. అప్పుడు ఆయన మీరు ఏ విషయాలను గురించి భేదాభిప్రాయాలు కలిగి ఉండేవారో, వాటిని మీకు తెలియజేస్తాడు."

Explanation & meanings · 1
  1. అల్లాహ్ (సు.తా.) ప్రతి ఒక్కనికి అతని కర్మలకు తగిన ప్రతిఫలమిస్తాడు. మంచి చేసిన వానికి మంచి ఫలితం మరియు చెడు చేసిన వానికి తగిన శిక్ష. అల్లాహుతా'ఆలా ఒకని పాపభారాన్ని మరొకనిపై మోపడు. ఏ వ్యక్తి కూడా ఇతరుల పాపభారాన్ని మోయడు. ఏ వ్యక్తిపై కూడా - అతడు ప్రవక్త అయినా సరే - ఇతరుల పాపభారం మోపబడదని అల్లాహ్ (సు.తా.) ఈ ఆయత్ లో స్పష్టంగా తెలుపుతున్నాడు. అంటే మానవుల పాప భారాలను మోయటానికి 'ఈసా ('అ.స.) సిలువపై ఎక్కారనే క్రైస్తవుల అపోహను ఈ ఆయత్ ఖండిస్తోంది.