6 : 73
وَهُوَ ٱلَّذِي خَلَقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ بِٱلۡحَقِّۖ وَيَوۡمَ يَقُولُ كُن فَيَكُونُۚ قَوۡلُهُ ٱلۡحَقُّۚ وَلَهُ ٱلۡمُلۡكُ يَوۡمَ يُنفَخُ فِي ٱلصُّورِۚ عَٰلِمُ ٱلۡغَيۡبِ وَٱلشَّهَٰدَةِۚ وَهُوَ ٱلۡحَكِيمُ ٱلۡخَبِيرُ
మరియు ఆకాశాలను మరియు భూమిని నిజానికి సృష్టించింది ఆయనే! మరియు ఆ రోజు ఆయన: "అయిపో!" అని అనగానే, అది అయి పోతుంది. ఆయన మాటే సత్యం! మరియు బాకా (సూర్) ఊదబడే రోజు, సార్వభౌమాధికారం ఆయనదే. ఆయనే అగోచర మరియు గోచర విషయాలన్నీ తెలిసినవాడు. మరియు ఆయన మహా వివేచనాపరుడు, సర్వం తెలిసిన వాడు.
Explanation & meanings · 2
- అంటే ఒక ఉద్దేశంతో.
- 'హదీస్'లో ఇలా ఉంది: ఇస్రాఫీల్ ('అ.స.) కొమ్ము (బాకా)ను తన నోటిలో పెట్టుకొని, తలవంచి, దానిని ఊదటానికి అల్లాహ్ (సు.తా.) ఆజ్ఞ కొరకు పేచి ఉంటారు.(ఇబ్నె-కసీ'ర్, అబూ దావూద్, తిర్మిజీ', 'హదీస్' నం. 4742, 4030, 3244). 'నూరున్: Trumpet, బాకా, కొమ్ము, తుత్తార, శంఖం.