17 : 28
وَإِمَّا تُعۡرِضَنَّ عَنۡهُمُ ٱبۡتِغَآءَ رَحۡمَةٖ مِّن رَّبِّكَ تَرۡجُوهَا فَقُل لَّهُمۡ قَوۡلٗا مَّيۡسُورٗا
మరియు నీవు ఆశించే, నీ ప్రభువు కారుణ్యాన్ని పొందటానికి - నీకు వారి నుండి ముఖం త్రిప్పుకోవలసి వచ్చినా - వారితో మృదువుగా మాట్లాడు.
Explanation & meanings · 1
- ఒకవేళ నీవు బంధువులకు, పేదలకు ఇవ్వలేని స్థితిలో ఉంటే, వారిని కసిరి కొట్టే బదులు, నమ్రతతో, మృదువుగా నిరాకరించు.