Skip to content
అల్-ఇస్రా /

ఆయత్ 59

17 : 59

ఆయత్ 59 of అల్-ఇస్రా (17 : 59). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

అల్-ఇస్రా ఆయతులు 111
సూరా · అల్-ఇస్రా
తెలుగు · Muhammad
17 : 59

وَمَا مَنَعَنَآ أَن نُّرۡسِلَ بِٱلۡأٓيَٰتِ إِلَّآ أَن كَذَّبَ بِهَا ٱلۡأَوَّلُونَۚ وَءَاتَيۡنَا ثَمُودَ ٱلنَّاقَةَ مُبۡصِرَةٗ فَظَلَمُواْ بِهَاۚ وَمَا نُرۡسِلُ بِٱلۡأٓيَٰتِ إِلَّا تَخۡوِيفٗا

మరియు నిదర్శనాలను (ఆయాత్ లను) పంపకుండా మమ్మల్ని ఏదీ ఆపలేదు. కాని పూర్వకాలపు ప్రజలు వాటిని తిరస్కరించడమే తప్ప! మరియు మేము సమూద్ జాతి వారికి ప్రత్యక్ష నిదర్శనంగా ఒక ఆడ ఒంటెను పంపాము, కాని వారు దాని పట్ల క్రూరంగా ప్రవర్తించారు. మరియు మేము నిదర్శనాలను (ఆయాత్ లను) పంపుతున్నది, కేవలం ప్రజలు వాటిని చూసి భయపడటానికే!

Explanation & meanings · 2
  1. పూర్వకాలపు ప్రజలు తమ ప్రవక్తల నుండి నిదర్శనాలు (ఆయాత్) కోరారు. ఆ నిదర్శనాలు వచ్చిన తరువాత కూడా వారు విశ్వాసులు కాలేదు. దాని ఫలితంగా వారిపై అల్లాహ్ (సు.తా.) శిక్ష పడి వారు నాశనం చేయబడ్డారు. ఇదే విధంగా మక్కా ముష్రిక్ లు కూడా దైవప్రవక్త ('స'అస) నుండి నిదర్శనాలు కోరారు. మక్కా పర్వతాలను బంగారంగా మార్చమన్నారు. పూర్వ జాతి వారి వలే వీరూ నిదర్శనాలు వచ్చిన తరువాత కూడా విశ్వసించరని మరియు వారంతా నాశనం చేయబడతారని అతను ('స'అస) నిదర్శనాలను కోరలేదు. (వివరాలకు చూడండి, ముస్నద్ అ'హ్మద్, పుస్తకం-1, పేజీ 258)
  2. ఆ ఆడ ఒంటె నిదర్శనం కొరకు చూడండి, 7:73 మరియు 54:27.