17 : 13
وَكُلَّ إِنسَٰنٍ أَلۡزَمۡنَٰهُ طَٰٓئِرَهُۥ فِي عُنُقِهِۦۖ وَنُخۡرِجُ لَهُۥ يَوۡمَ ٱلۡقِيَٰمَةِ كِتَٰبٗا يَلۡقَىٰهُ مَنشُورًا
మరియు మేము ప్రతి మానవుని మెడలో అతని కర్మలను కట్టి ఉంటాము. మరియు పునరుత్థాన దినమున అతని (కర్మ) గ్రంథాన్ని అతని ముందుపెడ్తాము, దానిని అతడు స్పష్టమైనదిగా గ్రహిస్తాడు.
Explanation & meanings · 1
- చూడండి, 'స. బు'ఖారీ, పు. 9, 'హ. నం. 625. ఇమామ్ షౌకాని 'తాయిరతున్ - అంటే మానవుని అదృష్టం లేక భవిష్యత్తు, అని అన్నారు. అల్లాహుతా'ఆలా కు జరుగబోయేది అంతా తెలుసు కాబట్టిఆయన ప్రతివాని అదృష్టం వ్రాసి అతని వెంట ఉంచుతాడు. అందుకొరకే దాని ప్రకారం అతని కర్మలు (మంచి-చెడులు) ఉంటాయి. పునరుత్థాన దినమున వాటికి తగినట్టి ప్రతిఫలమే దొరుకుతుంది.