17 : 81
وَقُلۡ جَآءَ ٱلۡحَقُّ وَزَهَقَ ٱلۡبَٰطِلُۚ إِنَّ ٱلۡبَٰطِلَ كَانَ زَهُوقٗا
మరియు ఇలా అను: "సత్యం వచ్చింది మరియు అసత్యం అంతరించింది. నిశ్చయంగా అసత్యం అంతరించక తప్పదు.
Explanation & meanings · 1
- మక్కా ముకర్రమా విజయం తరువాత, దైవప్రవక్త ('స'అస) కాబాలో ప్రవేశిస్తారు. అక్కడ 360 విగ్రహాలు ఉంటాయి. వాటిని ఒక చిన్న కట్టెతో కొట్టుతూ ఈ ఆయత్ చదువుతారు. ('స'హీ'హ్ బు'ఖారీ, ముస్లిం).