Skip to content
الإسرَاء /

ఆయత్ 41

17 : 41
الإسرَاء ఆయతులు 111
సూరా · الإسرَاء
తెలుగు · Muhammad
17 : 41

وَلَقَدۡ صَرَّفۡنَا فِي هَٰذَا ٱلۡقُرۡءَانِ لِيَذَّكَّرُواْ وَمَا يَزِيدُهُمۡ إِلَّا نُفُورٗا

మరియు వారు వాస్తవానికి హితబోధ పొందుతారని, మేము ఈ ఖుర్ఆన్ లో అనేక విధాలుగా బోధించాము. కాని అది వారి వ్యతిరేకతను మాత్రమే అధికం చేస్తున్నది.

Explanation & meanings · 1
  1. ప్రతివిధంగా బోధించాము: అంటే పూర్వకాలపు ప్రజల కథలు చెప్పి, ఉదాహరణలు, ఉపమానాలు ఇచ్చి, హితబోధలు చేసి, పర్యవసానాలు చూపి, అనేక విధాలుగా అల్లాహ్ (సు.తా.) ఖుర్ఆన్ లో బోధించాడు, భయపెట్టాడు. బహుశా మానవులు గుణపాఠం నేర్చుకొని, అతి స్వల్పకాలపు ఈ జీవితంలో విశ్వసించి, సత్కార్యాలు చేసి, రాబోయే శాశ్వత జీవితంలో ఎడతెగని సుఖసంతోషాలు పొందాలని. కాని చాలా మంది దానిని అర్థం చేసుకోలేక పోతున్నారు. తమ భ్రష్టాచారాలను మరింత అధికం చేసుకుంటున్నారు.