Skip to content
الإسرَاء /

ఆయత్ 71

17 : 71

ఆయత్ 71 of الإسرَاء (17 : 71). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الإسرَاء ఆయతులు 111
సూరా · الإسرَاء
తెలుగు · Muhammad
17 : 71

يَوۡمَ نَدۡعُواْ كُلَّ أُنَاسِۭ بِإِمَٰمِهِمۡۖ فَمَنۡ أُوتِيَ كِتَٰبَهُۥ بِيَمِينِهِۦ فَأُوْلَٰٓئِكَ يَقۡرَءُونَ كِتَٰبَهُمۡ وَلَا يُظۡلَمُونَ فَتِيلٗا

(జ్ఞాపకముంచుకోండి!) ఒకరోజు మేము మానవులందరినీ వారి వారి నాయకులతో (ఇమామ్ లతో) సహా పిలుస్తాము. అప్పుడు వారి కర్మపత్రాలు కుడిచేతిలో ఇవ్వబడిన వారు, తమ కర్మ పత్రాలను చదువుకుంటారు మరియు వారికి రవ్వంత (ఖర్జూర బీజపు చీలికలోని పొరంత) అన్యాయం కూడా జరగదు.

Explanation & meanings · 2
  1. ఇమామ్: అంటే నాయకుడు ఇక్కడ వ్యాఖ్యాతలు దీనికి మూడు అర్థాలిచ్చారు. 1) దైవప్రవక్తలు, 2) దివ్యగ్రంథాలు, 3) కర్మపత్రాలు. ప్రతి ఒక్కరు తమ కాలపు దైవప్రవక్త లేక దివ్యగ్రంథం లేక కర్మపత్రంతో పిలువబడతారు. ఇబ్నె-కసీ'ర్ మరియు షౌకాని ఈ మూడవది అంటే కర్మపత్రమని భావిస్తున్నారు. చూడండి, 53:39.
  2. చూడండి, 69:19 మరియు 84:7.