17 : 34
وَلَا تَقۡرَبُواْ مَالَ ٱلۡيَتِيمِ إِلَّا بِٱلَّتِي هِيَ أَحۡسَنُ حَتَّىٰ يَبۡلُغَ أَشُدَّهُۥۚ وَأَوۡفُواْ بِٱلۡعَهۡدِۖ إِنَّ ٱلۡعَهۡدَ كَانَ مَسۡـُٔولٗا
మరియు అతడు యుక్తవయస్సుకు చేరనంత వరకు - సక్రమమైన పద్ధతిలో తప్ప అనాథుని ఆస్తిని సమీపించకండి. మరియు చేసిన వాగ్దానాన్ని పూర్తి చేయండి, నిశ్చయంగా వాగ్దానం గురించి ప్రశ్నించడం జరుగుతుంది.
Explanation & meanings · 1
- మానవుడు అల్లాహ్ (సు.తా.)తో చేసుకున్న వాగ్దానమైనా, లేక తన తోటి మానవునితో చేసిన వాగ్దానమైనా దానిని తప్పక పూర్తి చేయాలి, లేకుంటే పునరుత్థాన దినమున దానిని గురించి ప్రశ్నించడం జరుగుతుంది.